iPhone 13 Vodafone Idea: ఐఫోన్ 13 కొనుగోలు చేసేవారి కోసం వొడాఫోన్‌ ఐడియా బంపర్‌ ఆఫర్‌.. క్యాష్‌బ్యాక్‌

Subhash Goud

Subhash Goud |

Updated on: Sep 19, 2021 | 3:25 PM

iPhone 13 Vodafone Idea: యాపిల్‌ ప్రియులకు ఐఫోన్‌ 13 సిరీస్‌ ఫోన్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన వారికి తీపి కబురు అందిన విషయం తెలిసిందే. భారతదేశం,..

iPhone 13 Vodafone Idea: ఐఫోన్ 13 కొనుగోలు చేసేవారి కోసం వొడాఫోన్‌ ఐడియా బంపర్‌ ఆఫర్‌.. క్యాష్‌బ్యాక్‌

iPhone 13 Vodafone Idea: యాపిల్‌ ప్రియులకు ఐఫోన్‌ 13 సిరీస్‌ ఫోన్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన వారికి తీపి కబురు అందిన విషయం తెలిసిందే. భారతదేశం, ఆస్ట్రేలియా, కెనడా, చైనా, జర్మనీ, జపాన్, యూకే, యూఎస్​తో పాటు 30కి పైగా దేశాల్లో ప్రీ-ఆర్డర్లు అందుబాటులో ఉంటాయి. సెప్టెంబర్ 24 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని యాపిల్‌ సంస్థ ప్రకటించింది. యాపిల్‌ ఐఫోన్​ 13 సిరీస్​లో మొత్తం నాలుగు ఫోన్లు విడుదలయ్యాయి. వీటిలో ఐఫోన్​13, ఐఫోన్​ 13 మినీ, ఐఫోన్​ ప్రో, ఐఫోన్​13 ప్రో మ్యాక్స్ ఫోన్లు అందుబాటులో ఉంటాయి. ఐఫోన్​12 సిరీస్​తో పోలిస్తే ఈ లేటెస్ట్​ మోడల్స్​లో అనేక కొత్త అప్​డేట్స్​ను చేర్చింది. ఈ నేపథ్యంలో ఈ యాపిల్‌ ఫోన్‌ను కొనుగోలు చేసే వినియోగదారుల కోసం వొడాఫోన్‌ ఐడియా అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. వొడాఫోన్ ఐడియా కస్టమర్‌లు సెప్టెంబర్ 18, 2021 నుండి myvi.com, Vi యాప్, అలాగే 270 కి పైగా రిటైలర్ల ద్వారా భారతదేశంలో iPhone 13, iPhone 13 Mini, iPhone 13 Pro, ,iPhone 13 Pro Max లను ముందస్తు ఆర్డర్ చేసుకున్నవారికి క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌, డబుల్‌ డేటా బెనిఫిట్స్‌ లభించనుంది. ముందుగా బుక్ చేసుకున్న వారికి సెప్టెంబర్‌ 25 నుంచి ఫోన్‌లు అందనున్నాయి.

వొడాఫోన్‌ ప్రీపెయిడ్‌ కస్టమర్లను ఈ ఆఫర్‌ పొందవచ్చు. ముఖ్యంగా రెడెక్స్‌ సబ్‌స్క్రైబర్‌లు పోస్ట్‌పెయిడ్‌ యూజర్లు రూ.1099 ప్లాన్‌, రూ.2299 ఫ్యామిలీ ప్లాన్‌లో ప్రత్యేక క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. వొడాఫోన్‌ ఐడియా యాప్‌ నుంచి ఫోన్‌ ఆర్డర్‌ చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్‌ వర్తించనుంది. అలాగే ఐఫోన్‌ కొనాలనుకునే కస్టమర్‌ వీ యాప్‌ను ఆర్డర్‌ చేసి రూ.299 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ మీద డబుల్‌ డేటా ప్రయోజనాలు పొందవచ్చు. ఐఫోన్ 13 మినీ ధర 128GB మోడల్‌కు రూ. 69,900, 256GB మోడల్‌కు రూ. 79,900, 512GB మోడల్‌కు రూ .99,900. మరోవైపు, ఐఫోన్ 13 128GB మోడల్‌కు రూ. 79,900, 256GB మోడల్‌కు రూ. 89,900, 512GB మోడల్ కోసం రూ. 109,900 వద్ద ప్రారంభమవుతుంది.

ఇవీ కూడా చదవండి:

బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Bank Account Aadhaar Link: మీ ఆధార్‌ నెంబర్‌ ఏ బ్యాంకు ఖాతాకు లింక్‌ అయ్యిందో తెలుసుకోండిలా..!

Bank Balance: ఒకే రోజు కరోడ్‌పతి.. రైతు బ్యాంకు ఖాతాలో రూ.52 కోట్లు జమ.. షాకైన అధికారులు

 

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu