Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya Ram Mandir: అయోధ్య ప్రాణప్రతిష్ఠ ఆహ్వాన పత్రికను చూశారా.? ప్రత్యేకతలు ఇవే..

అయోధ్య ప్రాణప్రతిష్ఠ ఆహ్వాన పత్రిక సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ పత్రికను దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 4 వేల మంది సాధువులకు అందజేస్తున్నారు. ఈ ఆహ్వాన పత్రికలో జనవరి 22న అయోధ్యలో నిర్వహించే వివిధ కార్యక్రమాల జాబితా ఉంది. అలానే.. ఒక బుక్‌లెట్‌ కూడా ఉంది.

Ayodhya Ram Mandir: అయోధ్య ప్రాణప్రతిష్ఠ ఆహ్వాన పత్రికను చూశారా.? ప్రత్యేకతలు ఇవే..
Ayodhya Ram Mandir
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 06, 2024 | 9:06 PM

అయోధ్య ప్రాణప్రతిష్ఠ ఆహ్వాన పత్రిక సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ పత్రికను దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 4 వేల మంది సాధువులకు అందజేస్తున్నారు. ఈ ఆహ్వాన పత్రికలో జనవరి 22న అయోధ్యలో నిర్వహించే వివిధ కార్యక్రమాల జాబితా ఉంది. అలానే.. ఒక బుక్‌లెట్‌ కూడా ఉంది. అయోధ్య రామమందిర నిర్మాణ ఉద్యమంలో పాల్గొన్న వారి వివరాలు ఇందులో ఉన్నాయి. రామమందిర నిర్మాణ ఉద్యమంలో ముఖ్యఘట్టాలను ఇందులో వివరించారు.

హిందూ సంస్కృతి.. రామాయణం గొప్పదనం.. రాముడి వైశిష్ట్యం చాటేలా… అత్యద్భుత నిర్మాణ శైలితో.. అయోధ్య రామమందిరం ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది. అంతస్తుల రాతి కట్టడంలో గోపురాలు…, స్తంభాలతో 161 అడుగుల ఎత్తులో అత్యంత అద్భుతంగా.., అపురూపంగా రామ మందిరాన్ని రూపొందించారు. మొత్తం 5 గుమ్మటాలు ఉన్నాయి. గర్భగుడి అష్టభుజి ఆకృతిలో నిర్మాణం జరిగింది. సోమ్‌ నాథ్‌, అక్షర్‌ థామ్‌ లాంటి అనేక పుణ్యక్షేత్రాల ఆకృతులను నిర్మించిన సోంపుర కుటుంబమే రామ మందిరాన్ని రూపొందించింది. నాగర శైలిలో అయోధ్య ఆలయ నిర్మాణం జరిగింది. ఎక్కడా ఇనుము, సిమెంట్ వాడకుండా.. కేవలం రాతి పలకలతోనే.. ఒక అద్భుత కట్టడంగా మలిచారు.

భక్తుల ఆశలకు.. ఆకాంక్షలకు అనుగుణంగా రామమందిర నిర్మాణం రూపుదిద్దుకుంది. వెయ్యేళ్లు అయినా సరే.. చెక్కు చెదరని, ఎంతటి తీవ్రమైన భూకంపాలు, ప్రకృతి విపత్తులు వచ్చినా సరే.. తట్టుకుని నిలబడే అత్యంత శక్తివంతమైన, అత్యాధునిక, అద్భుతమైన రామ మందిరాన్ని నిర్మించారు. ఆలయ ప్రధాన ద్వారం దగ్గర ఎంత దూరంలో నిల్చున్నా, రాముడి విగ్రహం కనిపించేలా నిర్మాణం చేశారు. ప్రధాన గర్భగుడిలో రామ్‌ లల్లా విగ్రహం కొలువుదీరుతుంది. తెల్లటి మకర్న పాలరాయితో నిర్మించిన గుర్భగుడిలో 51 అంగుళాల పొడవైన రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు.

అయోధ్య శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠను పురస్కరించికొని శ్రీరాముడి అత్తింటి వారు భారీ కానుకలు పంపించారు. నేపాల్‌లోని జనక్‌పూర్‌ ధామ్‌ నుంచి రెండు ట్రక్కుల నిండా బహుమతులతో భక్తబృందం అయోధ్యకు చేరుకుంది. ఇందులో వెండి వస్తువులు, పూసల దండలు, వంటింటి ప్రత్యేక సామాన్లు అనేకం ఉన్నాయి. అటు.. అయోధ్య రామమందిరంలో పూజలందుకున్న శ్రీరామ అక్షింతల పంపిణీ దేశమంతటా జరుగుతోంది. ఒక్క ఆలయమే కాదు.. రైల్వే స్టేషన్‌, ఎయిర్‌ పోర్ట్‌, బస్‌స్టేషన్‌లో అడుగు పెట్టిన దగ్గర నుంచీ కనువిందు చేసే రామకథా దృశ్యాలే దర్శనమిస్తాయి. అయోధ్యలో కొత్తగా ప్రారంభించిన మహర్షి వాల్మీకీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల రాకపోకలు ప్రారంభమయ్యాయి. తొలి ఫ్లైట్‌లో వచ్చిన ప్రయాణికులకు యూకో బ్యాంకు అయోధ్య రామమందిర చిత్రంతో ఫొటోలు అందించి స్వాగతం పలికింది.