Leopard Attack: దారుణం.. మరో చిన్నారిని చిదిమేసిన చిరుత.. టీ ఎస్టేట్‌లో హల్‌చల్
ఈ ఘటనతో ఆగ్రహించిన స్థానికులు పెద్దఎత్తున గుమిగూడి రోడ్లను దిగ్బంధించారు. నీలగిరి ఉథాయ్ సమీపంలోని తిటుక్కల్ ప్రాంతంలో 6 గంటల సుదీర్ఘ పోరాటం తర్వాత మరో చిరుతపులిని పట్టుకున్న కొద్ది రోజులకే ఈ సంఘటన జరిగింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తమిళనాడులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తమిళనాడులోని నీలగిరి జిల్లాలో జనవరి 6న చిరుతపులి దాడిలో ఓ చిన్నారి మృతి చెందింది. టీ ఎస్టేట్‌లో పని చేస్తోన్న కార్మికులపై చిరుత దాడి చేసింది. ఈ ఘటనలో ఓ బాలుడు మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నీలగిరి జిల్లాలోని టీ ఎస్టేట్‌లో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. జన సంచారం ఎక్కువగా ఉండే ప్రదేశంలో చిరుత ప్రవేశించి దాడి చేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు.
ఈ ఘటనతో ఆగ్రహించిన స్థానికులు పెద్దఎత్తున గుమిగూడి రోడ్లను దిగ్బంధించారు. నీలగిరి ఉథాయ్ సమీపంలోని తిటుక్కల్ ప్రాంతంలో 6 గంటల సుదీర్ఘ పోరాటం తర్వాత మరో చిరుతపులిని పట్టుకున్న కొద్ది రోజులకే ఈ సంఘటన జరిగింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..