AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రాసలీలలు.. సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ప్రైవేట్ వీడియోలు

Mewaram Jain's Videos Leak: కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు నెట్టింట వైరల్ అవ్వడంతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆ పార్టీపై ఆగ్రహం వ్యక్తంచేసింది. దీంతో సోషల్ మీడియా వేదికగా బీజేపీ నేతలు కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.

Viral Video: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రాసలీలలు.. సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ప్రైవేట్ వీడియోలు
Mewaram Jain's Videos
Shaik Madar Saheb
|

Updated on: Jan 06, 2024 | 9:12 PM

Share

Mewaram Jain’s Videos Leak: కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు నెట్టింట వైరల్ అవ్వడంతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆ పార్టీపై ఆగ్రహం వ్యక్తంచేసింది. దీంతో సోషల్ మీడియా వేదికగా బీజేపీ నేతలు కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. రాజస్థాన్ బార్మర్ మాజీ ఎమ్మెల్యేకు సంబంధించిన రెండు వీడియోలు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షం కావడంతో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మేవారం జైన్ మరోసారి వార్తల్లో నిలిచారు. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేపై ఓ మహిళ అత్యాచారం కేసు పెట్టగా, ఆ వీడియో అదే కేసుకు సంబంధించినదిగా చెబుతున్నారు. ఆ మహిళ మేవారం జైన్‌తో పాటు మరో ఎనిమిది మందిపై ఫిర్యాదు చేయగా.. పోలీసులు వారిపై అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే తరుణంలో వీడియోలు నెట్టింట వైరల్ అవ్వడంతో రాజకీయ దుమారం మొదలైంది.

కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే మేవారం జైన్ సహా 9 మంది తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు మహిళ డిసెంబర్ లో పోలీసులను సంప్రదించింది. ఐదేళ్ల కిందట తన తండ్రి అనారోగ్యం బారినపడటంతో బార్మర్‌కు చెందిన రామ్‌ స్వరూప్‌ను కలిసినట్లు మహిళ తెలిపింది. ఆయన లైంగిక దాడికి పాల్పడటంతోపాటు దానిని రికార్డ్‌ చేశాడని ఆరోపించింది.. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే సహా.. పలువురు వేధించినట్లు పేర్కొంది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేపై ఆ మహిళ తన ఎఫ్‌ఐఆర్‌లో వీడియోలను కూడా ప్రస్తావించింది. మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే తనపై అత్యాచారం చేశాడని, మేవరం జైన్ తన కుమార్తె ఎదుటే తనను వేధించాడని ఆరోపించింది.

అయితే, ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవ్వడంతో భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధికార ప్రతినిధి షెహజాద్ పూనావల్లా కూడా తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో వీడియోను పంచుకున్నారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేపై విరుచుకుపడటంతోపాటు.. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులకు ప్రశ్నలు సంధించారు. మేవారం బాధితులను పరామర్శిస్తారా అంటూ ప్రియాంక గాంధీని ప్రశ్నించారు. దీనిపై ఫాక్ట్ చెక్ చేస్తారా అంటూ పలువురిని డిమాండ్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..