Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DGCA: రిపీట్ చేస్తే తాటతీస్తాం.. డీజీసీఏ సీరియస్‌ వార్నింగ్‌

విమానాల్లో సాంకేతిక లోపాలు, ఎయిర్‌పోర్ట్‌ల్లో భద్రతా ప్రమాణాల వైఫల్యంపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల్లో లోపాలను సరిచేసుకోవాలని , లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అహ్మదాబాద్‌లో ప్రమాదానికి గురైన ఎయిర్‌ ఇండియా విమానం బ్లాక్‌బాక్స్‌ను భారత్‌ లోనే డీకోడ్‌ చేస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు.

DGCA: రిపీట్ చేస్తే తాటతీస్తాం.. డీజీసీఏ సీరియస్‌ వార్నింగ్‌
Airports
Ravi Kiran
|

Updated on: Jun 24, 2025 | 9:30 PM

Share

దేశంలోని విమానయాన సంస్థలకు డీజీసీఏ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చింది. మేజర్ విమానాశ్రయాలు, విమానయాన సంస్థల్లో సేఫ్టీ సర్వే నిర్వహించింది డీజీసీఏ. ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లో పగలు, రాత్రి ఆపరేషన్ల పరిశీలించారు. లోపాలు పదే పదే పునరావృతమవుతున్నాయని, గ్రౌండ్ హ్యాండ్లింగ్ పరికరాలు కూడా పనిచేయని స్థితిలో ఉన్నాయని గుర్తించారు. ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటనెన్స్‌లో భద్రతాపరమైన లోపాలున్నాయని డీజీసీఏ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రన్-వే మీద మధ్యలో ఉండాల్సిన లైన్ మార్కింగ్ వెలిసిపోయి, చెదిరిపోయి ఉన్నట్టు తెలిపింది.

ర్యాపిడ్ ఎగ్జిట్ ట్యాక్సీవే, గ్రీన్ సెంటర్ లైట్ ఒకే డైరక్షన్లో లేవని వెల్లడించింది. చాలాసార్లు గుర్తించిన లోపాలే మళ్లీ మళ్లీ పునరావృతం అయ్యాయని మండిపడింది. దీన్ని బట్టి లోపాలను సరిదిద్దే ప్రక్రియ సజావుగా సాగడం లేదని తెలిపింది. అరిగిపోయిన టైర్లతో నడుస్తున్న షెడ్యూల్డ్ విమానాన్ని టైర్లు మార్చిన తర్వాత విడుదల చేసినట్టు తెలిపింది. గుర్తించిన లోపాలను సరిదిద్దేందుకు ఆపరేటర్లకు 7 రోజుల గడువు ఇచ్చింది. డీజీసీఏ సేఫ్టీ సర్వే తరువాత కీలక నివేదికను విడుదల చేసింది.

మరోవైపు అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదం బ్లాక్‌బాక్స్‌ను విదేశాలకు పరీక్షల కోసం తరలించడం లేదని కేంద్రం స్పష్టం చేశారు. భారత్‌ లోనే బ్లాక్‌బాక్స్‌ను డీకోడ్‌ చేసే ప్రక్రియ జరుగుతోందని వెల్లడించారు విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు. అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో ఇప్పటివరకు 256 మృతదేహాలను డీఎన్‌ఏ పరీక్షతో గుర్తించి బంధువులకు అందచేశారు. 28 మృతదేహాలను దేశం లోని ఇతర ప్రాంతాల్లో ఉన్న కుటుంబ సభ్యులకు అందచేశారు. అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై పార్లమెంటరీ కమిటీ కూడా లోతుగా దర్యాప్తు చేస్తోంది.

హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో