AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడి మహిళను దారుణంగా హత్య చేసిన ఘటనలో ఇద్దరు అరెస్టు

దేశ వ్యాప్తంగా రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. దుండగులు చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతూ రెచ్చిపోతున్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతూ ప్రాణాలకు ..

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడి మహిళను దారుణంగా హత్య చేసిన ఘటనలో ఇద్దరు అరెస్టు
Subhash Goud
|

Updated on: Feb 28, 2021 | 9:10 PM

Share

దేశ వ్యాప్తంగా రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. దుండగులు చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతూ రెచ్చిపోతున్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతూ ప్రాణాలకు తెగించి వారిని దారుణంగా హతమారుస్తున్నారు. తాజాగా ఢిల్లీలో జరిగిన ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డు మీద వెళ్తున్న ఓ మహిళను దొంగ దారుణంగా పొడిచి చంపాడు. ఈ ఘటన వాయువ్య ఢిల్లీలోని ఆదర్శనగర్‌లో చోటుచేసుకుంది. ఓ 25 ఏళ్ల మహిళా తన రెండేళ్ల కూతురుతో రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తుండగా, ఓ చెయిన్ స్నాచ‌ర్ పొడిచి చంపాడు. ఈ సంఘటన అంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ ప్రాంతంలో ఇలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌డం రెండు రోజుల్లో ఇది రెండోసారని స్థానికులు ఆగ్రహం వ్యక్తచేస్తున్నారు. అయితే దేశ రాజధానిలో ఇలాంటి సంఘటనలు వెలుగులోకి రావడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అయితే ఈ ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ పుటేజీలను సైతం పరిశీలించారు. అయితే ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఘటన జరిగిన ఒక 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు.

కాగా, శనివారం వాయువ్య ఢిల్లీలోని ఆదర్శనగర్ ప్రాంతంలో శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో సిమ్రాన్ అనే మహిళ తన బిడ్డతో కలిసి పని నిమిత్తం మార్కెట్‌కు వెళ్లి వస్తోంది. ఈ క్రమంలో ఆమె మెడలో ఉన్న గొలుసుపై కన్నెసిన దొంగ.. గోసులును తెంపేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆమె పక్కనున్న మహిళ ప్రతిఘటించింది. ఈ క్రమంలో ఆ మహిళ చేతుల్లో ఉన్న బిడ్డ కిందపడింది. ఆ వెంటనే దొంగను పట్టుకునేందుకు మహిళ ప్రయత్నించింది. ఈ క్రమంలో చైన్ స్నాచర్ తన వెంట తెచ్చుకున్న కత్తితో సిమ్రాన్‌ను దారుణంగా పొడిచి చంపాడు. ఈ ఘటన అంతా అక్కడున్న సీసీ టీవీలో రికార్డయింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుల కోసం పోలీసులు పది బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రెండురోజుల క్రితం ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనే జరగడం.. మళ్లీ అలాంటి ఘటనే పునరావృతం కావడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎట్టకేలకు పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి:

Murder Of Lawyer-Couple : అడ్వకేట్ దంపతుల హత్య కేసు విచారణ.. సుందిళ్ల బ్యారేజీపై పోలీసులు ఫోకస్

Man Dresses As Bride: గత 30ఏళ్లకు పైగా వధువు దుస్తుల్లో పురుషుడు.. అందుకు పెద్ద కారణమే ఉంది.. ఆ కథా కమామీషు మీ కోసం