Coronavirus: తీవ్ర స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు.. నిబంధనలు కఠినతరం.. కొరఢా ఝులిపిస్తున్న పోలీసులు

దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. తగ్గుముఖం పట్టిన కరోనా.. మళ్లీ తీవ్రరూపం దాల్చుతుంది. ఇక మహారాష్ట్రలో కరోనా...

Coronavirus: తీవ్ర స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు.. నిబంధనలు కఠినతరం.. కొరఢా ఝులిపిస్తున్న పోలీసులు
Follow us

|

Updated on: Feb 28, 2021 | 9:53 PM

దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. తగ్గుముఖం పట్టిన కరోనా.. మళ్లీ తీవ్రరూపం దాల్చుతుంది. ఇక మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి మళ్లీ వేగంగా పుంచుకుంటోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. ప్రతి రోజు రాష్ట్రంలో 8వేలకుపైగా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. గడిచిన 24 గంటల్లో అంటే శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 8,293 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 62 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,55,070కు చేరగా, మరణాల సంఖ్య 52,154కు చేరింది. మరో వైపు 24 గంటల్లో 3,753 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 20,24,704కు చేరినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం మహారాష్ట్రలో 77,008 యాక్టివ్‌ కేసులున్నట్లు వెల్లడించింది. కాగా, కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న అమరావతి, అచల్‌పూర్‌లలో లాక్‌డౌన్‌ను మార్చి 8వ తేదీ వరకు పొడిగించింది అక్కడ ప్రభుత్వం. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఇక దేశంలో కరోనా కేసులు, మరణాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది.

కాగా, మహారాష్ట్రలో కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రతి ఒక్కరికి మాస్కు ఉండేలా చర్యలు చేపడుతున్నారు. మాస్కులేని వారికి జరిమనా విధిస్తున్నారు. కఠినమైన ఆంక్షలు విధిస్తున్నారు. ఇక మాస్క్‌ ధరించని వారికి జరిమానా విధిస్తున్నారు. ఈ క్రమంలో బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) గురువావరం ఒక్క రోజులోనే ముంబై నగరంలో జరిమానాల రూపంలో రూ.29 లక్షల వసూలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించని రూ.14వేలకుపైగా మంది నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేసినట్లు మున్సిపల్‌ అధికారులు వెల్లడించారు. ఈ నియమాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే వారికి రూ.200 జరిమానా విధిస్తున్నారు. ఇక 2020 ఏడాది మొత్తం మీద మాస్క్‌ ధరించని వారి నుంచి ఏకంగా రూ. 30 కోట్ల 50 లక్షలకుపైగా వసూలు చేసినట్లు బీఎంసీ తెలిపింది. ఇలా మహారాష్ట్రలో కేసుల సంఖ్య తీవ్రంగా పెరిగిపోతుండటంతో అధికారులు ఆంక్షలు మరింత కఠినతరం చేశారు. ప్రతి ఒక్కరికి మాస్కు ధరించేలా చర్యలు తీసుకుంటున్నారు. కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరో రెండు వారాల్లో లాక్‌డౌన్‌ విధించే పరిస్థితులు వచ్చే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరు సహకరించాలని, లేకపోతే మున్ముందు మరిన్ని ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Coronavirus: ఏపీలో కరోనా బారిన పడి 7169 మంది మృతి.. మళ్లీ పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు.. పరిశోధకులు ఏమంటున్నారు..?

తెలంగాణలో మరోసారి పెరగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 176 మందికి పాజిటివ్, ఒకరు మృతి