Coronavirus: ఏపీలో కరోనా బారిన పడి 7169 మంది మృతి.. మళ్లీ పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు.. పరిశోధకులు ఏమంటున్నారు..?

Coronavirus: గత ఏడాది కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభించి ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. అయితే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కేసుల సంఖ్య తీవ్రంగానే...

Coronavirus: ఏపీలో కరోనా బారిన పడి 7169 మంది మృతి.. మళ్లీ పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు.. పరిశోధకులు ఏమంటున్నారు..?
Follow us

|

Updated on: Feb 28, 2021 | 7:47 PM

Coronavirus: గత ఏడాది కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభించి ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. అయితే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కేసుల సంఖ్య తీవ్రంగానే ఉన్నాయి. ఇక ఏపీలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన రెండు రోజుల్లో వందకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 117 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా బారిన పడిన వారిలో 66 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 8,89,916 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. అలాగే 8,82,029 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 718 మంది చికిత్స పొందుతున్నారు. ఈ రోజు వరకు కరోనా బారిన పడి 7169 మంది మరణించారు. తాజాగా 39,122 మందికి కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,39,54,131 శాంపిళ్లను పరీక్షించినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

పెరుగుతున్న కేసులు:

కాగా, గతంలో కరోనా పాజిటివ్‌ కేసులు వేగంగా పెరుగుతుండగా, గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. తాజాగా మళ్లీ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వ మరిన్ని కఠినమైన ఆంక్షలు విధిస్తోంది. కరోనా వ్యాక్సిన్‌ వచ్చినప్పటి నుంచి జనాల్లో భయం లేకుండా పోతోంది. చాలా మంది మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం లాంటివి పాటించకపోవడంతో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. వ్యాక్సిన్‌ వచ్చిన కరోనా మార్గదర్శకాలు తప్పకుండా పాటించాలని, అధికారులు, పోలీసులు పదే పదే చెబుతున్నా కొందరి నిర్లక్ష్యం కారణంగా కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక:

కాగా, గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా పలు హెచ్చరికలు జారీ చేసింది. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన సెకండ్‌ వేవ్‌ కొనసాగే అవకాశం ఉందని ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసింది. లాక్‌డౌన్‌ తర్వాత అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా వివాహాలు, ఇతర శుభకార్యాలయాలు, ప్రార్థనలు, సమావేశాలు తదితర కార్యక్రమాల వల్ల మళ్లీ కరోనా పుంజుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. కరోనా వైరస్‌ తగ్గింది కదా అని ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం పడినందున అన్‌లాక్‌ ప్రక్రియ కొనసాగుతోంది. దేశంలో అన్ని రంగాలు తెరుచుకుని తమ తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. దీంతో మళ్లీ పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా వహించకుండా జాగ్రత్తలు పాటిస్తే తప్ప కరోనా కట్టడి చేయలేమనేది నగ్న సత్యం.

Also Read: తెలంగాణలో మరోసారి పెరగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 176 మందికి పాజిటివ్, ఒకరు మృతి

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..