AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rotten Mutton: మటన్‌ మాటున బీఫ్.. విజవాడలో మటన్ మాఫియా దందా… మున్సిపల్ అధికారుల తనిఖీల్లో నమ్మలేని నిజాలు.. ‌

విజయవాడలో నిల్వ ఉంచిన మాంసాన్ని విక్రయించడం వ్యాపారులు అలవాటుగా మార్చుకుంటున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ చర్యలు తీసుకుంటున్నా.. ఏ మాత్రం జంకడం లేదు. కొన్ని సందర్భాల్లో నిల్వ పెట్టిన

Rotten Mutton: మటన్‌ మాటున బీఫ్.. విజవాడలో మటన్ మాఫియా దందా... మున్సిపల్ అధికారుల తనిఖీల్లో నమ్మలేని నిజాలు.. ‌
seizes rotten mutton in shops
Sanjay Kasula
|

Updated on: Feb 28, 2021 | 9:42 PM

Share

Seizes Rotten Mutton : ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న మటన్ మాఫియా గుట్టు మరోసారి రట్టు అయింది. మటన్‌ అంటేనే మండిపడేలా ప్రవర్తిస్తున్నారు. చికెన్‌ను కూడా ఛీ ఛీ అని చీదరించుకునే చేస్తున్నారు. వ్యాపారం మాటున.. నిల్వ ఉంచిన, కుళ్లిన మాంసాన్ని అంటగడుతూ ప్రజల ప్రాణాలను ఇబ్బందుల్లో పడేస్తున్నారు.

విజయవాడలో నిల్వ ఉంచిన మాంసాన్ని విక్రయించడం వ్యాపారులు అలవాటుగా మార్చుకుంటున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ చర్యలు తీసుకుంటున్నా.. ఏ మాత్రం జంకడం లేదు. కొన్ని సందర్భాల్లో నిల్వ పెట్టిన దాన్ని అమ్ముతుండగా.. మరికొన్ని సార్లు కుళ్లిన మాంసాన్ని కూడా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రోజుల తరబడి ఫ్రిడ్జ్‌లో ఉంచిన మాంసాన్ని ఫ్రెష్‌ అన్నట్టుగా బిల్డప్‌ ఇస్తూ అంటగడుతున్నారు.

దీనిపై అనేక సార్లు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందుతుండడంతో.. మున్సిపల్‌ అధికారులు మరోమారు తనిఖీలు చేపట్టారు. తాజా తనిఖీల్లో కూడా కలవరపడే వాస్తవాలను గుర్తించారు అధికారులు. విజయవాడ నగరంలో ఉన్న అనేక మటన్‌, చికెన్‌ షాపుల్లో అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఇందులో కుళ్లిన మాంసాన్నే అమ్ముతున్నట్టుగా ఫిర్యాదులు అందాయి.

తనిఖీల్లో బీఫ్‌ మాంసాన్ని కూడా గుర్తించిన అధికారులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. దీంతో ఆయా నాన్‌వెజ్‌ వ్యాపారస్తులకు నోటీసులను జారీ చేశారు. రోజుల తరబడి నిల్వ పెట్టుకుని మరీ అమ్ముతున్నట్టు గుర్తించారు అధికారులు. పైకి మాత్రం వినియోగదారులకు తాజా మాంసాన్ని ఇస్తున్నట్టుగా నమ్మించే యత్నం చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఇటీవల మాంసాన్ని తినేవారి సంఖ్య కూడా పెరిగింది.

ఈ నేపథ్యంలో వ్యాపారులు సొమ్ము చేసుకునే క్రమంలో.. వారి ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇలా ఇష్టానుసారంగా నిల్వ ఉంచినవి, కుళ్లిన మాంసాన్ని అంటగడుతున్నారు. గోళ్లపాలెం సెంటర్‌లో ఇటీవల ఇదే తరహా నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించారు. ఒక్కచోట అని కాదు.. విజయవాడ నగర వ్యాప్తంగా అనేక కాలనీల్లో ఇదే తరహా అమ్మకాలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి..

కామారెడ్డి జిల్లాలో సోలార్‌ ప్లాంట్‌లో భారీ ప్రమాదం.. ఘటన స్థలానికి అగ్ని మాపక సిబ్బంది.. భారీగా ఆస్తి నష్టం..!

Asia Cup: డబ్ల్యూటీసీలో టీమిండియా​ ఫైనల్‌కు వస్తే ఆసియా కప్​ వాయిదా..! జోస్యం చెప్పిన పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు

Women Lives Burial ground: స్మశానం వైపు వెళ్లాలంటే భయపడతారు.. ఆమె మాత్రం నిత్యం అక్కడే ఉంటోంది.. అందరితో హ్యాట్సాఫ్ అనిపించుకుంటోంది..