Women Lives Burial ground: స్మశానం వైపు వెళ్లాలంటే భయపడతారు.. ఆమె మాత్రం నిత్యం అక్కడే ఉంటోంది.. అందరితో హ్యాట్సాఫ్ అనిపించుకుంటోంది..

Women Lives Burial ground: చీకటి పడితే చాలు ఆడవాళ్ళు బయటికి వెళ్ళాలి అంటే సాధారణంగా భయపడతారు. కానీ ఈ మహిళ రాత్రి, పగలు చితిమంటల మధ్య..

Women Lives Burial ground: స్మశానం వైపు వెళ్లాలంటే భయపడతారు.. ఆమె మాత్రం నిత్యం అక్కడే ఉంటోంది.. అందరితో హ్యాట్సాఫ్ అనిపించుకుంటోంది..
Follow us

|

Updated on: Feb 28, 2021 | 9:20 PM

Women Lives Burial ground: చీకటి పడితే చాలు ఆడవాళ్ళు బయటికి వెళ్ళాలి అంటే సాధారణంగా భయపడతారు. కానీ ఈ మహిళ రాత్రి, పగలు చితిమంటల మధ్య జీవనం సాగిస్తోంది. స్మశానమే ఆమె దేవాలయం. కళేబరాలు, చితి మంటలు, కళ్లెదుటే ఉన్నా ఏమాత్రం భయపడకుండా తన కుటుంబ పోషణ కోసం కాటి కాపరిగా మారింది మహిళ. భర్త చేసిన కాటికాపరి వృత్తినే తన బతుకుదెరువుగా మార్చుకుంది. కబేళాలు, కంకాలాలు కళ్లెదుటే అనుక్షణం భయపెడుతున్నా కాటికాపరిగా బతుకుబండిని లాగుతున్న ధీశాలి మణెమ్మ.

వివరాల్లోకెళితే.. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం ఎర్రగుంటకు చెందిన ప్రకాశం బతుకుదెరువు కోసం 35 ఏళ్ల క్రితం మిర్యాలగూడకు వచ్చాడు. మిర్యాలగూడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే స్మశాన వాటికలో ప్రకాశంకు ఉపాధి లభించింది. స్మశాన వాటిక లోని ఒక రూమ్‌లో కుటుంబంతో పాటు ఉన్నాడు. ప్రకాశానికి ఒక కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. స్మశాన వాటికలో పనిచేసే కాటికాపరి తరచూ విధులకు రాక పోయేవాడు. దీంతో స్మశాన వాటికకు వచ్చే మృతదేహాలకు ప్రకాశం కాటికాపరిగా పనిచేసే వాడు. ఇదిలాఉంటే.. ఇప్పుడు మణెమ్మ జీవితం చూద్దాం. అందరిలాగే ఇల్లాలు కావాలనుకుంది మణెమ్మ. హాయిగా కుటుంబంతో కలిసి జీవితాన్ని గడపాలనుకుంది. విధి ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. కాటికాపరిగా పనిచేస్తున్న భర్త ప్రకాశం 20 ఏళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. దానితో కుటుంబ భారం ఆమెపై పడింది. ఎవరూ చేయని సాహసం చేసింది.

నిండు నూరేళ్లు తోడు ఉంటానని ప్రమాణం చేసిన భర్త ప్రకాశం కాటికాపరిగా పనిచేసుకుంటూ అర్థాంతరంగా తనువు చాలించాడు. ఇలాంటి పరిస్థితుల్లో భర్త కాటికాపరి వృత్తినే తన వృత్తిగా ఎంచుకుని ముందుకు సాగుతోంది మణెమ్మ. అనాథ మృతదేహాలకు అన్నీ తానై అంతిమ సంస్కారాలు చేస్తూ, స్మశానంలోనే నివాసముంటూ, చుట్టుపక్కల వారి ఇళ్ళల్లో పనిచేస్తూ బతుకుబండిని లాగుతోంది. కాటికాపరిగా పని చేస్తున్న మణెమ్మకు ఓ దాత నెలకు 600 రూపాయల వేతనం చెల్లించేవాడు. కొంతకాలం క్రితం దాత మృతి చెందడతో వేతనం కూడా ఆగిపోయింది. ఇతరులు ఇచ్చే డబ్బులు మృతదేహాల దహన, సంస్కారాలకు, కిరోసిన్, డీజిల్‌కు సరిపోతుంది. పిల్లల్ని చదివించాలని ఉన్నా, ఆర్థిక స్థోమత లేకపోవడంతో పుస్తకాలు పట్టుకుని స్కూలుకు వెళ్లాల్సిన పిల్లలు, స్మశానంలో పని చేస్తూ చదువును మధ్యలోనే ఆపేశారు, పై చదువులు చదివించే స్తోమత లేకపోవడంతో పెద్ద కొడుకు ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు అని మణెమ్మ చెబుతోంది. మొదట్లో శవాన్ని దహనం చేస్తుంటే భయం వేసిందని కానీ ఆ తర్వాత అలవాటుగా మారిందని చెబుతోంది మణెమ్మ. తన భర్త చూపిన మార్గంలో శవాలను దహనం చేయడం సేవగా భావిస్తున్నానని మణెమ్మ చెబుతోంది.

అయితే, కరోనా కాలంలో దహన సంస్కారాల కోసం కావలసిన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జనం తనను చిన్నచూపుతో చూశారని మణెమ్మ వాపోయింది. కరోనా కాలంలో చనిపోయిన వారి కంటే బతికున్న వారే తనను మానసికంగా చంపేశారని మణెమ్మ తన బాధను వ్యక్తం చేసింది. కరోనా కష్టకాలంలో కొన్ని మృతదేహాలను ఎవరు వారి వారి బంధువులు పట్టించుకోకుండా అక్కడే వదలి వెళ్ళిపోతే మణెమ్మ స్వయంగా దగ్గరుండి దహన సంస్కారాలు చేసి ఆదర్శంగా నిలిచింది. మణెమ్మను ఆదుకోవాలని ఒక మహిళ దహణసంస్కారాలు చేయడం గొప్ప విషయమని స్థానికులు అంటున్నారు.

Also read:

Shanmukh Jaswanth Deepthi Sunaina: దీప్తి, షణ్ముఖ్‌ జశ్వంత్ మధ్య రిలేషన్ ఏంటి..? ఈ ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కుతుందా..?

Youtube Star Shanmukh Jaswanth: డ్రంక్ డ్రైవ్ చేసి ప్రమాదానికి కారణమైన యూట్యూబ్ స్టార్ షణ్ముక్.. కేసు నమోదు