కామారెడ్డి జిల్లాలో సోలార్‌ ప్లాంట్‌లో భారీ ప్రమాదం.. ఘటన స్థలానికి అగ్ని మాపక సిబ్బంది.. భారీగా ఆస్తి నష్టం..!

అగ్ని ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానో, ఇతర కారణాల వల్ల ఎన్నో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని ప్రమాదాల్లో ఎందరో...

  • Subhash Goud
  • Publish Date - 9:29 pm, Sun, 28 February 21
కామారెడ్డి జిల్లాలో సోలార్‌ ప్లాంట్‌లో భారీ ప్రమాదం.. ఘటన స్థలానికి అగ్ని మాపక సిబ్బంది.. భారీగా ఆస్తి నష్టం..!

అగ్ని ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానో, ఇతర కారణాల వల్ల ఎన్నో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని ప్రమాదాల్లో ఎందరో అగ్నికి ఆహుతవుతున్నారు. తాజాగా తెలంగాణలోని కామారెడ్డి జిల్లా తాడ్వాయ్‌ మండలం కన్కల్‌ గ్రామ శివారులో గల రెన్యూ సోలార్‌ పవర్‌ ప్లాంట్‌లో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో భారీగా మంటలు వ్యాపించాయి. దీంతో వెంటనే అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు వెంటనే హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ప్లాంట్‌కు రెండు వైపులా మంటలు వ్యాపించడంతో అదుపు చేయడం కష్టంగా మారినట్లు తెలుస్తోంది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు కోటి రూపాయల వరకు నష్టం వాటిల్లి ఉండవచ్చని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు. ఏదైనా షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా జరిగిందా.. ? లేదా ఇంకేదైన కారణంగా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో సోలార్ ప్లేట్లు అగ్నికి ఆహుతయ్యాయి. కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. సోలార్ ప్లాంట్‌లో ఉన్నట్టుండి మంటలు వ్యాపించడంతో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ప్లాంట్‌లోని జీ బ్లాక్ పూర్తిగా అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, ఇలాంటి ఘటన కారణంగా ఎందరో అమాయకులు బలవుతున్నారు. అలాగే భారీగా ఆస్తినష్టం కూడా జరుగుతుంది. సదరు కంపెనీలు ప్రమాదాల నివరణకు అన్ని చర్యలు చేపట్టినా.. కొన్ని నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరుగుతూ పెద్ద ఎత్తున ఆస్తినష్టం చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఇవి కూడా చదవండి:

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడి మహిళను దారుణంగా హత్య చేసిన ఘటనలో ఇద్దరు అరెస్టు

Murder Of Lawyer-Couple : అడ్వకేట్ దంపతుల హత్య కేసు విచారణ.. సుందిళ్ల బ్యారేజీపై పోలీసులు ఫోకస్

Man Dresses As Bride: గత 30ఏళ్లకు పైగా వధువు దుస్తుల్లో పురుషుడు.. అందుకు పెద్ద కారణమే ఉంది.. ఆ కథా కమామీషు మీ కోసం