AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Murder Of Lawyer-Couple : అడ్వకేట్ దంపతుల హత్య కేసు విచారణ.. సుందిళ్ల బ్యారేజీపై పోలీసులు ఫోకస్

Lawyer couple murdered : అడ్వకేట్ దంపతుల హత్య కేసు విచారణ సీన్‌.. సుందిళ్ల బ్యారేజీకి చేరింది. విచారణను వేగవంతం చేసిన పోలీసులు...నిందితులను కస్డడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

Murder Of Lawyer-Couple : అడ్వకేట్ దంపతుల హత్య కేసు విచారణ.. సుందిళ్ల బ్యారేజీపై పోలీసులు ఫోకస్
vaman rao advocate
Ram Naramaneni
|

Updated on: Feb 28, 2021 | 7:03 PM

Share

Murder Of Lawyer-Couple :  అడ్వకేట్ దంపతుల హత్య కేసు విచారణ సీన్‌.. సుందిళ్ల బ్యారేజీకి చేరింది. విచారణను వేగవంతం చేసిన పోలీసులు…నిందితులను కస్డడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. హత్య తర్వాత ఆయుధాలను బ్యారేజ్‌లో పడేయడంతో వాటిని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు.. జల్లెడపడుతున్నారు. అటు.. హ‌త్య కేసులో ఆడియో, వీడియో రికార్డులు కీలకంగా మారనున్నాయి.

హైకోర్టు న్యాయవాదులు వామన్‌రావు, నాగమణి దంపతుల హత్య కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. నిందితులుగా ఉన్న బిట్టు శ్రీనుతో పాటు మరొకరని పోలీసులు పార్వతీ బ్యారేజ్‌కు తీసుకెళ్లారు. న్యాయవాదుల హత్యకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. ఘటన తర్వాత ఆయుధాలను సుందిళ్ల బ్యారేజీలో పడేసినట్లు నిందితులు చెప్పడంతో.. విశాఖ నుంచి గజ ఈతగాళ్లను రప్పించారు పోలీసులు. మూడు బృందాలుగా వారిని విడగొట్టి.. ఆయుధాలను వెలికితీసే పనిలో పడ్డారు.

ఈ నెల 17న పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద రోడ్డుపై వామన్‌రావు దంపతులను దారుణంగా హత్య చేయడం తీవ్ర సంచలనం రేపింది. ఈ కేసులో.. ప్రధాన నిందితులుగా భావిస్తున్న బిట్టు శ్రీనుతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేసిన పోలీసులు.. విచారణలో నిందితుల నుంచి మరిన్ని వివరాలను రాబట్టేయత్నం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. వామన్‌రావుకు చెందిన మరో ఆడియో .. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పై గట్టు వామన్‌ రావు మరో వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. శ్రీధర్ బాబు తనను అవమానపర్చాడని, నీతిలేని వ్యక్తి అని వేరే వ్యక్తితో వామన్ రావు చెప్పేమాటలు.. హల్‌చల్‌ చేస్తున్నాయి.

అటు.. ఈ కేసులో.. ఆడియో, వీడియో సాక్ష్యాలు కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే హత్య జరిగే సమయంలో రికార్డు చేసిన వీడియోలను పరిగణలోకి తీసుకోవాలని, బస్సులో ఉన్న వారిని గుర్తించి సాక్షులుగా చేర్చాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. రేపు పోలీసులు కోర్టుకు స్టేటస్‌ రిపోర్టును సమర్పించనున్నారు. మరోవైపు బిట్టు శ్రీనును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. అతని నుంచి కీలక సమాచారాన్ని రాబడుతున్నట్టుగా తెలుస్తోంది.

Also Read:

దీప్తితో బ్రేకప్ అయ్యిందా..? షణ్ముఖ్‌ జశ్వంత్ సోషల్ మీడియా లైవ్‌లో క్లారిటీ ఇచ్చేశాడు

లైంగిక శక్తి పెరుగుతుందని, వీర్యపుష్టి కలుగుతుందని ప్రచారం.. ఏపీలో గాడిదలు కనుమరుగు

వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..