Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Man Dresses As Bride: గత 30ఏళ్లకు పైగా వధువు దుస్తుల్లో పురుషుడు.. అందుకు పెద్ద కారణమే ఉంది.. ఆ కథా కమామీషు మీ కోసం

అమ్మాయిలు అబ్బాయిల్లా.. అబ్బాయిలు అమ్మాయిల్లా వేషం వేయడం సినిమాల్లోనూ సీరియల్స్ లో బాగుంటాయి. వారి గెటప్స్ మనసారా నవ్విస్తాయి.. అయితే అదే గెటప్స్ లో నిజజీవితంలో దర్శనమిస్తే.. షాక్ తింటారు..

Man Dresses As Bride: గత 30ఏళ్లకు పైగా వధువు దుస్తుల్లో పురుషుడు.. అందుకు పెద్ద కారణమే ఉంది.. ఆ కథా కమామీషు మీ కోసం
Follow us
Surya Kala

|

Updated on: Feb 28, 2021 | 6:20 PM

Man Dresses As Bride : అమ్మాయిలు అబ్బాయిల్లా.. అబ్బాయిలు అమ్మాయిల్లా వేషం వేయడం సినిమాల్లోనూ సీరియల్స్ లో బాగుంటాయి. వారి గెటప్స్ మనసారా నవ్విస్తాయి.. అయితే అదే గెటప్స్ లో నిజజీవితంలో దర్శనమిస్తే.. షాక్ తింటారు.. మరి ఓ వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 31 ఏళ్ల నుంచి నవ వధువులా అలంకరించుకుని తిరుగుతున్నాడు.. అయితే ఇలా చేయడానికి అతను చెప్పే కారణం వింటే షాక్ తింటారు.. ఆ వ్యక్తి ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన వ్యక్తి.. వివరాల్లోకి వెళ్తే..

యూపీ హౌజ్‌ఖాస్‌లోని జలాల్‌పూర్‌ గ్రామానికి చెందిన చింతహరణ్ చౌహాన్ (66) అనే వ్యక్తి ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 31 ఏళ్ల నుంచి పెళ్లి కూతురిలా ముస్తాబవుతున్నాడు. చీరకట్టుకుని అందంగా అలంకరించుకుంటున్నాడు.. ఇలా తయారు కావడానికి ఓ కారణం ఉందట.. చౌహాన్‌ 21 ఏళ్ల వయసులో మొదటి భార్య మరణించింది. తర్వాత చౌహన్ పని కోసం పశ్చిమ బెంగాల్‌ కు వెళ్ళాడు. అక్కడ దినాజ్పూర్‌లో ఇటుకల బట్టీలో పనికి కుదిరాడు.. అక్కడ ఓ షాప్ ఓనర్ తో పరిచయం ఏర్పడింది.. అతని కూతురుని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లికి చౌహన్ ఫ్యామిలీ అంగీకరించలేదు.. దీంతో రెండో భార్యని విడిచి పెట్టి.. మళ్ళీ తిరిగి సొంత ఊరుకు వచ్చాడు. భర్త చేసిన మోసాన్ని తట్టుకోలేని రెండో భార్య ఆత్మహత్య చేసుకుంది. రెండో భార్య ఆత్మహత్య విషయం ఒక ఏడాది తర్వాత తెలిసింది. అయితే చౌహన్ ఇంతలో కుటుంబ సభ్యుల ఒత్తిడితో మూడో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి చౌహాన్‌కు రోజూ ‘హర్రర్’ సినిమా కనిపించడం మొదలైంది.

మూడో పెళ్లి జరిగిన కొద్ది నెలల తర్వాత చౌహాన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆ తర్వాత అతడి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా చనిపోవడం మొదలైంది. ముందు అతడి తండ్రి జియావన్, అన్నయ్య చొటావు, భార్య ఇంద్రావతి, ఇద్దరు కొడుకులు, తమ్ముడు బదావు చనిపోయారు. అయితే, ఆ మరణాలు అంతటితో ఆగలేదు. ఆ తర్వాత అతడి సోదరుల ముగ్గురు కుమార్తెలు, నలుగురు కొడుకులు సైతం చనిపోయారు.

ఒక రోజు చౌహాన్ కలలో రెండో భార్య కనిపించి.. తన మరణానికి కారణం చౌహాన్ కారణమని చెప్పి.. నువ్వు మోసం చేయడంతోనే మరణించానని చెప్పి ఏడ్చినట్లు చెప్పాడు. అప్పుడు నేను చేసింది పాపపు పనే నన్ను క్షమించి అని కోరుకున్నానని చౌహన్ చెప్పాడు. అప్పుడు తన రెండో భార్య ఓ కోరిక కోరిందట..

చౌహాన్ ను రెండో భార్య వేసుకున్న పెళ్లి కూతురు దుస్తులు ధరించాలని ఆ బట్టలు తనతో ఉంచుకోవాలని భర్తను కోరిందట.. అప్పటి నుంచి తాను పెళ్లి కూతురు దుస్తుల్లోనే ఉంటున్నా. ఆ రోజు నుంచి నా ఆరోగ్యం బాగుపడిందని చౌహన్ చెప్పాడు. అంతేకాదు తన ఇంట్లో మరణాలు కూడా ఆగాయని.. మిగతా కుటుంబ సభ్యులు కూడా అనారోగ్యం కోలుకున్నారని చెప్పాడు.

ఈ దుస్తుల్లో చూసి అంతా నవ్వుకుంటారు. కానీ, కుటుంబం కోసమే నేను ఇలా చేశాను. వారిని రక్షించేందుకే నేను ఈ దుస్తులు ధరిస్తున్నానని చెప్పాడు చౌహాన్.. మనిషి కో నమ్మకం.. నమ్మకమే మనిషిని భవిష్యత్ వైపు నడిపిస్తుంది.. మరి చౌహన్ రెండో భార్య నిజంగా దెయ్యంగా మారిందో లేదో తెలియదు కానీ.. ఆమెకు చేసిన అన్యాయం అనే భావన నుంచి బయట పడడానికి చొహాన్ ఓ దారి ఎంచుకున్నాడు అని చెప్పవచ్చు.

Also Read:

నిద్రపోతూ కిందపడిపోయిన గున్న ఏనుగు .. వెంటనే స్పందించిన మిగిలిన ఏనుగులు వీడియో వైరల్

తెలుగుతమ్ముళ్లు సెకండ్ రౌండ్, పరాభవం నుంచి అధినేత తేరుకోకముందే మళ్లీ షాకుమీద షాకిలివ్వడం షురూ