AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO WhatsApp Service: ప్రావిడెంట్‌ ఫండ్‌ చందాదారులకు గుడ్‌న్యూస్‌.. వాట్సాప్‌ సేవలను ప్రారంభించిన ఈపీఎఫ్‌ఓ

EPFO WhatsApp Service: ప్రావిడెంట్‌ ఫండ్‌ చందా దారులకు ఓ గుడ్‌న్యూస్‌. ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (EPFO) తాజాగా వాట్సాప్‌ హెల్ప్‌ లైన్‌నెంబర్‌ను అందుబాటులోకి...

EPFO WhatsApp Service: ప్రావిడెంట్‌ ఫండ్‌ చందాదారులకు గుడ్‌న్యూస్‌.. వాట్సాప్‌ సేవలను ప్రారంభించిన ఈపీఎఫ్‌ఓ
Subhash Goud
| Edited By: Team Veegam|

Updated on: Mar 01, 2021 | 1:46 PM

Share

EPFO WhatsApp Service: ప్రావిడెంట్‌ ఫండ్‌ చందా దారులకు ఓ గుడ్‌న్యూస్‌. ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (EPFO) తాజాగా వాట్సాప్‌ హెల్ప్‌ లైన్‌నెంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా ఈపీఎఫ్‌ఓ కస్టమర్లు సులభంగా తమ సమస్యలను పరిష్కరిచుకునే అవకాశం ఉంటుంది. అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. ప్రతి చిన్న విషయానికి ప్రాంతీయ కార్యాలయాలకు వెళ్లకుండానే ఈ ఏర్పాట్లు చేసినట్లు సదరు సంస్థ ప్రకటించింది. ఇంతకు ముందే ఈపీఎఫ్‌ఓ ఫిర్యాదుల పరిష్కారం కోసం గ్రీవియన్స్‌ రిడ్రెస్సల్‌ ఫోరంను ప్రారంభించింది. ఇందులో భాగంగానే వాట్సాప్‌ హెల్ప్ లైన్ నంబర్‌ను ప్రకటించింది. అయితే ఇప్పటికే EPFIGMS, CPGRAMS పోర్టళ్లను ఈపీఎఫ్‌ఓ అందుబాటులోకి తెచ్చింది. ఇక ప్రత్యేకంగా 24×7 కాల్ సెంటర్ కూడా అందుబాటులో ఉంది. వీటికి అదనంగా మరో సేవలను అందుబాటులోకి తీసుకువస్తూ, వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్‌ను ప్రారంభించింది. ఈ సదుపాయం ద్వారా పీఎఫ్ చందాదారులు డిజిటల్ విధానంలో ఈపీఎఫ్‌వో ప్రాంతీయ కార్యాలయాలను సంప్రదించవచ్చు. అవసరమైన సమాచారాన్ని నేరుగా పొందవచ్చు.

ఈ వాట్సాప్‌ సేవలను ఉపయోగించుకోవడం ఎలా..?

ఈపీఎఫ్‌ఓకు చెందిన మొత్తం 138 ప్రాంతీయ కార్యాలయాలలో వాట్సాప్‌ హెల్ప్‌ లైన్‌ సర్వీసులను ప్రారంభించింది. అయితే పీఎఫ్‌ కాంట్రిబూటర్లు ఇప్పుడు వాట్సాప్ నంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా ఫిర్యాదు చేసే సదుపాయం ఉంటుంది. ఇందుకు కస్టమర్లు ముందు EPFO వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. వెబ్‌ పేజీలో ప్రాంతీయ కార్యాలయాల వాట్సాప్‌ నంబర్లు కనిపిస్తాయి. సంబంధిత రీజినల్ ఆఫీస్ వాట్సాప్ నంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. పీఎఫ్‌ కాంట్రిబూషన్, ఇతర వివరాలకు సంబంధించిన సమాచారాన్ని చాట్ లిస్ట్‌లో టైప్ చేసి పంపించాలి. వివిధ రకాల సమస్యలను కూడా ఈ వాట్సాప్ నంబర్ల ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లి నివృత్తి చేసుకోవచ్చు.

డిజిటల్ సేవలు పొందవచ్చు

కాగా, కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలు కూడా డిజిటల్‌ బాట పట్టాయి. వైరస్‌ భయంతో ఈపీఎఫ్‌ఓ కార్యాలయాలకు వెళ్లేందుకు కస్టమర్లు ఆసక్తి చూపించడం లేదు. దీంతో వివిధ మార్గాల్లో డైరెక్ట్ ఇంటరాక్షన్ కమ్యునికేషన్‌ను ఆ సంస్థ చందాదారులకు కల్పిస్తోంది. ఈ డైరెక్ట్ కమ్యూనికేషన్ ఛానల్‌ను మరింత బలోపేతం చేసేందుకు వాట్సాప్ హెల్ప్‌లైన్ నంబర్‌ ఎంతగానో ఉపయోగ పడనుంది. తాజాసేవలతో కస్టమర్లు తమ తమ ఇంటి నుంచే పీఎఫ్‌కు సంబంధించిన సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈపీఎఫ్‌ఓ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఫిర్యాదులు చేసుకోవచ్చు. అయితే ప్రస్తుత డిజిటల్‌ కాలంలో అన్ని రంగాలు కూడా ఇలాంటి సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. గతంలో ఇలాంటి సదుపాయాలు లేకపోగా, ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న తరుణంలో వినియోగదారులకు సేవలను మరింత సులభతరం అయ్యేందుకు ఇలాంటి సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఏదైనా ఫిర్యాదు చేయాలంటే కార్యాలయానికి వెళ్లడం, సమయం వృధా అవుతుంది. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొకుండా ఇంటి నుంచే ఫిర్యాదులు, సేవల గురించి తెలుసుకునే విధంగా అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

ప్యాకెట్ పాలు తాగుతున్నారా..! చిన్న పిల్లలకు పట్టిస్తున్నారా..? అయితే ఎన్ని అనర్థాలున్నాయో తెలుసుకోండి..

Krithi Shetty : ఆ యాడ్స్‌లో నటించింది చిన్నప్పటి బేబమ్మేనా..! ఆ వయసులో కెమెరా ముందు అదరగొట్టిన కృతిశెట్టి..

స్మార్ట్ ఫోన్ ను పోగొట్టుకుంటే ఎలా దానిని ట్రేస్ చేయాలో తెలుసుకుందాం..!

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..