AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup: డబ్ల్యూటీసీలో టీమిండియా​ ఫైనల్‌కు వస్తే ఆసియా కప్​ వాయిదా..! జోస్యం చెప్పిన పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు

ఆసియా కప్​ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు ఛైర్మన్​ ఎహ్సాన్ మణి జోస్యం చెప్పాడు. టీమిండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్​ షిప్​..

Asia Cup: డబ్ల్యూటీసీలో టీమిండియా​ ఫైనల్‌కు వస్తే ఆసియా కప్​ వాయిదా..! జోస్యం చెప్పిన పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు
Asia Cup
Sanjay Kasula
|

Updated on: Feb 28, 2021 | 9:22 PM

Share

Asia Cup to be postponed: ఆసియా కప్​ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు ఛైర్మన్​ ఎహ్సాన్ మణి జోస్యం చెప్పాడు. టీమిండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్​ షిప్​ ఫైనల్స్​కు చేరే ఛాన్స్ ఉండటమే ఇందుకు కారణమని అన్నాడు.

ఆసియా కప్​ షెడ్యూల్​ను గత సంవత్సరమే నిర్ణయించినప్పటికీ.. ప్రస్తుతానికి ఆ టోర్నీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది జూన్​లో డబ్ల్యూటీసీ ఫైనల్​ను నిర్వహించాల్సి ఉంది. భారత్​ కనుక ఫైనల్​ చేరితే.. ఆసియా కప్​ జరగకపోవచ్చు అని ఎహ్సాన్ అన్నాడు. ఈ దఫా టోర్నీకి శ్రీలంక ఆతిథ్యమిస్తోంది. ఆ సిరీస్​ను 2023కు వాయిదా వేయడం మంచిదని అభిప్రాయ పడ్డాడు.

ఈ ఏడాది చివర్లో భారత్​ వేదికగా జరుగనున్న టీ20 వరల్డ్​కప్​ గురించి కూడా పీసీబీ ఛైర్మన్ ఎహ్సాన్ మణి స్పందించాడు. తమకు వీసాల మంజూరు విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఐసీసీకి ఒక లేఖ కూడా రాశాడు.

ఇదిలావుంటే.. పీసీబీ సీఈఓ వసీం ఖాన్ కూడా ఇదే తరహాలో స్పందించాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్స్​కు భారత్ అర్హత సాధించవచ్చు అని తెలిపాడు. దీంతో శ్రీలంకలో తలపెట్టిన ఆసియా కప్​ ఆగిపోయేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించాడు. ఈ విషయంపై మాకింకా స్పష్టత లేనప్పటికీ.. టోర్నీ జరిగే సూచనలు మాత్రం కనిపించడం లేదని పీసీబీ సీఈఓ వసీం ఖాన్​ తెలిపాడు.

ఇవి కూడా చదవండి..

MLC Graduate Election Telangana: తెలంగాణకు ఏం చేసిందని బీజేపీకి ఓటు వేయాలి.. నిలదీసిన ఆర్థిక మంత్రి మంత్రి హరీష్ రావు

Benefits of Credit Cards: మీరు క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నారా..! అయితే ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారో..! లేదో..! చెక్ చేసుకోండి..!

Medaram Jatara 2021: కరోనా ఎఫెక్ట్.. మేడారం జాతరకు తాళం.. సెల్ఫ్ లాక్‌డౌన్ ప్రకటించిన పూజారులు, అధికారులు..

Bank Lockers: ఖాతాదారులు బ్యాంకుల్లో లాకర్లను ఉపయోగిస్తున్నారా… ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే