India vs England: చివరి టెస్టు కోసం నెట్స్‌లో శ్రమిస్తున్న టీమిండియా .. మొతేరా పిచ్ ఎలా ఉండబోతుందో చెప్పిన హిట్‌మ్యాన్
డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పిస్తానన్నాడు. ఒక్కొక్కరి నుంచి 10వేల రూపాయలు వసూలు చేశారు. రోజులు గడిచాయి. ఇల్లు లేదు. డబ్బులు రాలేదు. బాధితులు టీవీనైన్‌ని ఆశ్రయించారు. టీవీ నైన్ ఆ సర్పంచ్ బండారాన్ని బయట పెట్టింది. దీంతో సర్పంచ్ దారికొచ్చాడు. వసూలు చేసిన డబ్బులు వెనక్కి ఇచ్చేశాడు.
Ind vs Eng: మెతేరా స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరగనున్న నాలుగో టెస్టు కోసం టీమిండియా ఆటగాళ్లు నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది బీసీసీఐ. మార్చి 4 నుంచి మొతేరా వేదికగా తుది టెస్టు ప్రారంభం కానుంది.
ఫోటోలతోపాటు ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో చివరిదైన నాలుగో టెస్టు కోసం భారత ప్లేయర్లు సన్నద్ధమవుతున్నారు. అంటూ ట్వీట్‌ను ట్యాగ్ చేసింది.
#TeamIndia members gearing up for the fourth and final Test against England.@Paytm #INDvENG pic.twitter.com/7YmPyfUj6W
— BCCI (@BCCI) February 28, 2021
ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్‌లు అంచనాలను అందుకోగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ చివరి టెస్టులోనైనా సెంచరీ చేయాలని పట్టుదలతో ఉన్నాడు. విరాట్ చివరిసారిగా 2019లో శతకం చేశాడు.
నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న కోహ్లీ సేన.. చివరి మ్యాచ్‌ను గెలిచి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు ఆత్మవిశ్వాసంతో వెళ్లాలని రెడీ అవుతున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించిన ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని ప్రయత్నిస్తోంది.
ఇదిలావుంటే నాలుగో టెస్టుపై ఓ ట్వీట్ చేశాడు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ. అంతే కాదు మెతేరా పిచ్ నాలుగో టెస్ట్‌కు ఎలా ఉండనుందో కూడా చెప్పుకొచ్చాడు. మూడో టెస్టుకు ముందు వికెట్ స్పిన్‌కు సహకరిస్తుందంటూ చెప్పిన రోహిత్ తాజాగా ఇలా పోస్ట్ పెట్టాడు. దీనితోపాటు పచ్చగా ఉన్న గ్రౌండ్‌లో అలా ఫోటోకు ఫోజ్ ఇచ్చాడు. అంటే ఇది ఖచ్చితంగా ఇది బ్యాటింగ్‌కు సహకరిస్తుందని చెప్పకనే చెప్పాడు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి
ఇష్యూకు రానున్నా పసిడి బాండ్లు.. మార్చి 5 వరకు గోల్డెన్ ఛాన్స్.. నాలుగు కిలోల వరకు కొనేందుకు అనుమతి