AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రిటీష్ జర్నలిస్ట్‌కు దిమ్మదిరిగే సమాధానం చెప్పిన టీమిండియా ప్లేయర్.. ట్రోల్ చేస్తున్న ఇండియన్ మాజీ క్రికెటర్..

మొతేరా వేదికగా జరిగిన మూడో (డే/నైట్‌) టెస్టులో భారత్‌ 10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో కోహ్లీసేన

బ్రిటీష్ జర్నలిస్ట్‌కు దిమ్మదిరిగే సమాధానం చెప్పిన టీమిండియా ప్లేయర్.. ట్రోల్ చేస్తున్న ఇండియన్ మాజీ క్రికెటర్..
uppula Raju
|

Updated on: Mar 01, 2021 | 5:37 AM

Share

మొతేరా వేదికగా జరిగిన మూడో (డే/నైట్‌) టెస్టులో భారత్‌ 10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో కోహ్లీసేన సిరీస్‌లో 2-1తేడాతో ఆధిక్యం సాధించింది. ఈ నేపథ్యంలోనే మొతేరా పిచ్‌పై పలువురు మాజీ ఆటగాళ్లతో పాటు బ్రిటిష్‌ మీడియా కూడా విమర్శలు చేస్తోంది. అది స్పిన్‌కు అనుకూలించే పిచ్‌ అని, టెస్టు క్రికెట్‌కు ఇలాంటి వికెట్‌ను తయారు చేయొద్దని అంటున్నారు.

ఈ క్రమంలోనే మీడియా సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఓ బ్రిటిష్‌ జర్నలిస్టు.. అశ్విన్‌ను ఆ పిచ్‌ గురించి మాట్లాడి కోపం తెప్పించాడు. మూడో టెస్టుకు తయారు చేసిన వికెట్‌ మంచిదేనా అని ప్రశ్నించాడు. దీనికి స్పందించిన టీమ్‌ఇండియా స్పిన్నర్‌.. అసలు మంచి పిచ్‌ అంటే ఏమిటి? అని నిలదీశాడు. దాంతో ఆ బ్రిటిష్‌ జర్నలిస్టు కంగుతిని.. ‘నేనే మిమ్మల్ని ఆ ప్రశ్న వేస్తున్నా.. టెస్టు మ్యాచ్‌ అంటే బ్యాట్స్‌మెన్, బౌలర్ల మధ్య ఆధిపత్య పోరు’ అని చెప్పుకొచ్చాడు. దీనికి మళ్లీ జవాబిచ్చిన అశ్విన్.. ‘మంచి పిచ్‌ అంటే ఏమిటి?దాన్ని ఎవరు నిర్వచిస్తారు. తొలిరోజు పేస్‌ బౌలర్లకు సహకరించి, తర్వాత బ్యాట్స్‌మెన్‌కు అనుకూలించి.. ఆపై స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయిస్తే అది మంచి వికెటా? ఇలాంటి వాటి నుంచి బయటకు రండి. పిచ్‌ గురించి రాద్దాంతం అనవసరం’ అని సూటిగా తనదైనశైలిలో తేల్చిచెప్పాడు.

‘ఇంగ్లాండ్‌ ఆటగాళ్ల నుంచి పిచ్‌పై ఎలాంటి ఫిర్యాదుల్లేవు. వాళ్లు ఇక్కడి పిచ్‌లపై మెరుగవ్వాలనుకుంటున్నారు. బయటి వాళ్లే ఈ పిచ్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మేం ఏ పర్యటనలోనూ పిచ్‌ గురించి ఫిర్యాదులు చేయలేదు’ అని అశ్విన్‌ చెప్పుకొచ్చాడు. ఇక చివరి టెస్టుకు సమతూకం ఉన్న పిచ్‌ ఉంటుందా అని అడిగిన ప్రశ్నకు.. దాని గురించి తమకు తెలియదని, టీమ్‌ఇండియా మంచి క్రికెట్‌ మ్యాచ్‌ కోసం చూస్తోందని ఈ స్పిన్‌ వీరుడు పేర్కొన్నాడు. మన గురించి అవతలి వారు ఏమనుకుంటారనే విషయం పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పాడు.

అయితే ఈ విషయం గురించి మాజీ బ్యాట్స్‌మన్‌ వసీమ్ జాఫర్‌ సరదాగా మాట్లాడాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ ఇంగ్లాండ్‌ వాళ్లను ఎక్కడా వదలట్లేదని.. అటు మైదానంలో, ఇటు మీడియా సమావేశంలో నోరు మెదపనీయడం లేదని చురకలంటించాడు. అంతేకాకుండా ఇంటర్వూ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేసి సరదాగా ట్రోల్‌ చేశాడు.

Follow Us
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన