AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Lockers: ఖాతాదారులు బ్యాంకుల్లో లాకర్లను ఉపయోగిస్తున్నారా… ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే

Bank Lockers: బ్యాంకు లాకర్లను వినియోగించే ఖాతాదారులు నియమాలను పూర్తిగా తెలుసుకోవాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సూచిస్తోంది. ఎక్కువ రోజులు ..

Bank Lockers: ఖాతాదారులు బ్యాంకుల్లో లాకర్లను ఉపయోగిస్తున్నారా... ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే
Subhash Goud
|

Updated on: Feb 28, 2021 | 8:12 PM

Share

Bank Lockers: బ్యాంకు లాకర్లను వినియోగించే ఖాతాదారులు నియమాలను పూర్తిగా తెలుసుకోవాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సూచిస్తోంది. ఎక్కువ రోజులు లాకర్‌ను తెరవకుండా ఉంటే బ్యాంకులే స్వయంగా కస్టమర్ల లాకర్లను ఓపెన్‌ చేయవచ్చని చెబుతోంది. సాధారణంగా అభరణాలు, ముఖ్యమైన డాక్యుమెంట్లను సురక్షితంగా ఉంచడానికి బ్యాంకు లాకర్లను వాడుకుంటారు. ఒక్కసారి వీటిల్లో భద్రపరిచిన తర్వాత చాలా మంది వాటి గురించి పట్టించుకోరు. కానీ నియమాల ప్రకారం బ్యాంకు లాకర్లను ఏడాదికి ఒకసారైనా సందర్శించాలి. లేదంటే మీ బ్యాంకు లాకర్‌ణు తెరవవచ్చు. ఆ అధికారి బ్యాంకులకు ఉంటుంది.. అని ఆర్బీఐ తెలిపింది. తక్కువ రిస్క్ (లో రిస్క్) కేటగిరీలో ఉన్న ఖాతాదారులకు బ్యాంకులు కాస్త సమయం ఇస్తాయి. కానీ మీడియం రిస్క్ విభాగంలో ఉన్నవారు మూడు సంవత్సరాల వరకు లాకర్‌ ఓపెన్ చేయకపోతే.. వారికి బ్యాంకు నోటీసు పంపుతుంది.

ఖాతాదారులకు లాకర్ల కేటయింపు..

అయితే దరఖాస్తు చేసుకున్న అందరికీ లాకర్లను కేటాయించదు. ఇందుకు బ్యాంకులు ఎన్నో విషయాలను పరిగణలోకి తీసకుంటాయి. సాధారణంగా బ్యాంకులు తమ కస్టమర్లను మొత్తం మూడు రిస్క్ కేటగిరీలుగా వర్గీకరిస్తాయి. ఇందుకు ఆర్థిక పరిస్థితులు, సామాజిక నేపథ్యం, వ్యాపార కార్యకలాపాల స్వభావం, కస్టమర్లు నివాసముండే ప్రాతం.. వంటివి పరిగణనలోకి తీసుకుంటాయి. వీటి ఆధారంగానే బ్యాంకు ఖాతాదారులను హై రిస్క్, మీడియం రిస్క్, లో రిస్క్ విభాగాలుగా విభజిస్తాయి. ఆ ప్రకారమే వారికి లాకర్లు కేటాయిస్తాయి.

లాకర్‌ను ఎక్కువ రోజులు తెరవకుండా ఉంచితే..

కాగా, లాకర్‌లను ఎక్కువ రోజులు తెరవకుండా ఉంచితే కస్టమర్లకు బ్యాంకు ఒక నోటీసుల పంపుతుంది. లాకర్‌ సదుపాయాన్ని కొనసాగించాలని, లేదా సరెండర్‌ చేయాలని బ్యాంకులు పంపిన నోటీసులలో ఉంటుంది. చాలా రోజులు లాకర్‌ను ఎందుకు ఆపరేట్‌ చేయలేదనే వివరాలు కస్టమర్లు బ్యాంకుకు రాత పూర్వకంగా తెలుపాల్సి ఉంటుంది. ఖాతాదారులు చెప్పిన కారణాలు నిజమైనవని బ్యాంకు నమ్మితేనే లాకర్ సదుపాయాన్ని కొనసాగిస్తాయి.

ఇక ప్రసవా భారతీయులు, ఉద్యోగంలో బదిలీపై ఇతర ప్రాంతాల్లో ఉంటున్ననవారు, ఏదైనా ఇతర కారణాలతో నగరంలో లేనివారు లాకర్‌ సదుపాయాన్ని కొనసాగించేందుకు బ్యాంకు అనుమతించవచ్చు. ఒకవేళ బ్యాంకు నోటీసులకు ఖాతాదారుడు సరైన సమాధానం ఇవ్వనట్లయితే లాకర్ సదుపాయాన్ని బ్యాంకు రద్దు చేస్తుంది. కస్టమర్లు లాకర్‌కు సంబంధించిన అన్ని ఫీజులు చెల్లించినా సరే, వాటిని నిర్ణీత సమయానికి ఓపెన్ చేయకపోతే రద్దు చేయవచ్చు. ఆ లాకర్‌ను వేరొకరికి కేటాయించవచ్చు. కస్టమర్లకు కేటాయించి, ఆ తరువాత రద్దు చేసిన లాకర్లను తెరిచేటప్పుడు బ్యాంకు కూడా కొన్ని నియమ నిబంధనలు పాటిస్తుంది. సరైన విధాన్ని పాటించనట్లుగా ఖాతాదారుడికి తెలియజేస్తుంది. అయితే ఖాతాదారులు లాకర్‌ సదుపాయం కావాలని కోరినప్పుడు ఈ నిబంధనలు అన్ని అగ్రిమెంట్‌లో భాగంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి:

Aadhaar Number: మీ ఆధార్‌ కార్డు మీ వద్ద లేదా.. ఆధార్‌ నెంబర్‌ మర్చిపోయారా.. సింపుల్‌గా తెలుసుకోండిలా..!

Bank Holidays March 2021: మార్చి నెలలో 8 రోజులు బ్యాంకులకు సెలవులు.. రెండు రోజులు సమ్మె.. పూర్తి వివరాలు