Benefits of Credit Cards: మీరు క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నారా..! అయితే ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారో..! లేదో..! చెక్ చేసుకోండి..!

క్రెడిట్‌‌‌‌కార్డు కంపెనీలు మొదట కార్డు ఇచ్చేటప్పుడు క్రెడిట్‌‌‌‌ లిమిట్‌‌‌‌ తక్కువ ఇస్తాయి. కార్డుహోల్డర్‌‌‌‌ ట్రాన్సాక్షన్లు, కరెక్ట్‌‌‌‌ టైమ్‌‌‌‌కు బిల్‌‌‌‌ చెల్లించడం, నెల ఆదాయం వంటి అంశాలను లెక్కలోకి తీసుకొని..

Benefits of Credit Cards: మీరు క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నారా..! అయితే ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారో..! లేదో..! చెక్ చేసుకోండి..!
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 28, 2021 | 8:44 PM

Credit Card Limit :క్రెడిట్ కార్డులను జారీ చేసే బ్యాంకులు మొదట్లో తమ వినియోగదారులకు తక్కువ పరిమితి గల కార్డును ఇస్తాయి. కార్డుహోల్డర్‌‌‌‌ ట్రాన్సాక్షన్లు, కరెక్ట్‌‌‌‌ టైమ్‌‌‌‌కు బిల్‌‌‌‌ చెల్లించడం, నెల ఆదాయం వంటి అంశాలను లెక్కలోకి తీసుకొని క్రెడిట్‌‌‌‌ లిమిట్‌‌‌‌ పెంచడానికి ఆఫర్ ఇస్తాయి. క్రెడిట్ పరిమితిని పెంచే ముందు, క్రెడిట్‌ను తిరిగి చెల్లించడంలో కస్టమర్ ఎలా ప్రవర్తిస్తున్నాడు.. ఆదాయ వృద్ధి ఎలా ఉందో బ్యాంకులు తెలుసుకోవాలనుకుంటాయి.

మీరు క్రెడిట్ కార్డును సరిగ్గా ఉపయోగించుకుని, బిల్లును సకాలంలో చెల్లిస్తే, పరిమితిని పెంచడానికి బ్యాంకుల నుండి మంచి ఆఫర్ ఉంటుంది. కానీ పరిమితిని పెంచడం వల్ల ప్రయోజనం మాత్రమే కాదు.. అది కూడా ప్రతికూలత అని తెలుసుకోవడం ముఖ్యం.

క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడం సౌలభ్యాన్ని ఇస్తుందని, కార్డ్ నుండి కొనుగోలు చేసే ఎంపికలను పెంచుతుందని మీరు అనుకోవచ్చు.. ఇలాంటి ఆఫర్‌‌‌‌ను ఒప్పుకోవాలా ? వద్దా ? అనే విషయమై చాలా మందికి కన్‌‌‌‌ఫ్యూజన్‌‌‌‌ ఉంటుంది.  క్రెడిట్ పరిమితిని పెంచే ప్రధాన ప్రమాదం రుణ ఉచ్చులో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంది.

క్రెడిట్‌‌‌‌లిమిట్ ఎక్కువ తీసుకుంటే అప్పుల పాలవుతామనే భయం కూడా ఉంటుంది. అయితే.. లిమిట్ తక్కువ ఉంటే ఎక్కువ ఖర్చు చేయడానికి వీలుండదు. అయితే, కొంతమందికి, అధిక క్రెడిట్ పరిమితి లాభదాయకమైన ఒప్పందమని రుజువు చేస్తుంది. ఈ నేపథ్యంలో క్రెడిట్‌‌‌‌ లిమిట్‌‌‌‌ను పెంచుకోవడంలో ఉండే మంచిచెడులు ఏంటో చూద్దాం…

క్రెడిట్ పరిమితిని పెంచడం వల్ల కలిగే లాభాలు

క్రెడిట్‌‌‌‌ లిమిట్‌‌‌‌లో 30 శాతం కంటే ఎక్కువ వాడుకుంటే.. కార్డుహోల్డర్‌‌‌‌కు డబ్బుపరమైన అవసరాలు ఎక్కువగా ఉన్నాయని క్రెడిట్‌‌‌‌ బ్యూరోలు భావిస్తాయి. క్రెడిట్ స్కోరును లెక్కించేటప్పుడు క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (CUR) చూస్తారు. CUR కార్డ్ హోల్డర్ క్రెడిట్ పరిమితిని ఎంత ఉపయోగిస్తుందో చూపిస్తుంది. CUR 30 అంటే.. కార్డును ఎక్కువ వాడితే క్రెడిట్‌‌‌‌స్కోరు తగ్గుతుంది.

ఈ శాతాన్ని పెంచడం డిఫాల్ట్ అవకాశాన్ని పెంచుతుంది. CUR స్థాయి 30 శాతం పెరిగినప్పుడు క్రెడిట్ బ్యూరో క్రెడిట్ స్కోర్‌ను తగ్గిస్తుంది. ఇది పరిమితిని మరింత తగ్గిస్తుంది.  క్రెడిట్‌‌‌‌ లిమిట్‌‌‌‌ను పెంచుకుంటే ఈ సమస్య ఉండదు. ఉదాహరణకు మీ కార్డుకు రూ.లక్ష క్రెడిట్‌‌‌‌ లిమిట్‌‌‌‌ ఉంటే 30 శాతం.. అంటే రూ.30 వేల కంటే ఎక్కువ వాడితే స్కోర్‌‌‌‌ తగ్గుతుంది. అయితే కంపెనీలు క్రెడిట్‌‌‌‌ లిమిట్‌‌‌‌ను పెంచేవాటిని తీసుకుంటే మంచిది.

దురదృష్టవశాత్తు ఉద్యోగం ‌‌పోయినప్పుడు, ఆస్పత్రిలో చేరాల్సి వచ్చినప్పుడు, యాక్సిడెంట్‌‌‌‌ జరిగినప్పుడు హఠాత్తుగా డబ్బు కావాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో ఎక్కువ క్రెడిట్‌‌‌‌ లిమిట్‌‌‌‌ ఉన్న కార్డులు మనల్ని ఆదుకుంటాయి. ఎవరినీ అప్పు అడగాల్సిన అవసరం ఉండదు. మొత్తం బిల్లు చెల్లించడం సాధ్యం కాని వాళ్లు ఈఎంఐల ద్వారా నెలకు కొంత డబ్బు కట్టొచ్చు. ఫైన్లు పడటం, స్కోర్‌‌‌‌ తగ్గడం వంటి ఇబ్బందులు ఉండవు. ఏదేమైనా, బిల్లులను నిర్ణీత తేదీన జమ చేయాలి.  లేకపోతే భవిష్యత్తులో అది ప్రమాదంగా మారే ఛాన్స్ ఉంది.  

ఎక్కువ లోన్‌‌‌‌ తీసుకునే ఛాన్స్…

క్రెడిట్‌‌‌‌ లిమిట్‌‌‌‌ ఎక్కువ ఉన్న కార్డుహోల్డర్లకు పెద్ద మొత్తంలో లోన్లు ఇవ్వడానికి బ్యాంకులు ఆఫర్లు ఇస్తాయి. ఇవి ప్రి–అప్రూవ్డ్‌‌‌‌ లోన్లు కాబట్టి నిమిషాల్లో డబ్బు మన అకౌంట్లో పడుతుంది. ఎలాంటి డాక్యుమెంటేషన్‌‌‌‌, షూరిటీలు అవసరం లేదు. అయితే కార్డు బిల్లును గడువు తేదీలోగా కట్టేవాళ్లకు మాత్రమే ఇలాంటి ఆఫర్లు వస్తాయి. క్రెడిట్‌‌‌‌ రికార్డ్ బాగా లేకపోతే లోన్‌‌‌‌ రావడం కష్టంగా ఉంటుంది.

క్రెడిట్ లిమిట్ పెంచుకుంటే నష్టాలు..

క్రెడిట్‌‌‌‌ లిమిట్‌‌‌‌ ఎక్కువ ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు ఖర్చులు పెడితే మాత్రం అప్పులు పెరిగిపోయే ఛాన్స్ ఉంది. క్రెడిట్‌‌‌‌ లిమిట్‌‌‌‌ పెరగ్గానే కొందరు మునుపటి కంటే ఎక్కువ ఖర్చు చేసి ఇబ్బందుల్లో చిక్కుకుంటారు. అత్యవసరం అయితే తప్ప మన ఆదాయానికి మించి కార్డును వాడకూడదు.

వాడుకున్న మొత్తాన్ని చెల్లించకపోతే కంపెనీలు భారీగా వడ్డీని వడ్డిస్తాయి. ఈఎంఐ విధానంలో చెల్లించినా కనీసం 12 శాతం వడ్డీని భరించాలి. ఎక్కువ ఈఎంఐల వల్ల ఎక్కువ వడ్డీ కట్టడమే కాదు క్రెడిట్‌‌‌‌స్కోర్‌‌‌‌  మరింత తగ్గిపోయే ప్రమాదం ఉంది. వీలైనంత వరకు చెల్లించాల్సిన తేదీకంటే ముందే మొత్తం బిల్లు కట్టేయడం మంచిది. కాబట్టి ఎక్కువ క్రెడిట్‌‌‌‌ లిమిట్‌‌‌‌ ఉన్న కార్డు హోల్డర్లు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి.

ఇవి కూడా చదవండి..

Lockdown Love Story: “కిటికీ అద్దాలపై ప్రేమ సందేశం..” లాక్‌డౌన్‌ సమయంలో విరహ ప్రేమ..ఇది చదివితే షాక్ అవుతారు..

ISRO launches: పీఎస్‌ఎల్వీ సీ-51 ప్రయోగం గ్రాండ్ సక్సెస్‌.. అంతరిక్షంలోకి భగవద్గీత, ప్రధాని మోదీ ఫొటో ఎందుకు పంపించారో తెలుసా..? ఎందుకంటే..!

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..