ISRO Launches: పీఎస్‌ఎల్వీ సీ-51 ప్రయోగం గ్రాండ్ సక్సెస్‌.. అంతరిక్షంలోకి భగవద్గీత, ప్రధాని మోదీ ఫొటో ఎందుకు పంపించారో తెలుసా..? ఎందుకంటే..!

సక్సెస్‌... గ్రాండ్ సక్సెస్‌... దేశ ఖ్యాతి మరోసారి స్పేస్‌లో విజయగర్వంతో ఎగిరింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా మరో రాకెట్‌ని నింగిలోకి పంపింది. భగవద్గీత, ప్రధాని మోదీ ఫొటో సహా..

ISRO Launches: పీఎస్‌ఎల్వీ సీ-51 ప్రయోగం గ్రాండ్ సక్సెస్‌.. అంతరిక్షంలోకి భగవద్గీత, ప్రధాని మోదీ ఫొటో ఎందుకు పంపించారో తెలుసా..? ఎందుకంటే..!
Bhagavad Gita and PM Narendra Modi photo
Follow us

|

Updated on: Feb 28, 2021 | 7:41 PM

ISRO Successfully launches: సక్సెస్‌… గ్రాండ్ సక్సెస్‌… దేశ ఖ్యాతి మరోసారి స్పేస్‌లో విజయగర్వంతో ఎగిరింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా మరో రాకెట్‌ని నింగిలోకి పంపింది. భగవద్గీత, ప్రధాని మోదీ ఫొటో సహా 18 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది పీఎస్‌ఎల్వీ సీ-51. ఇస్రో ప్రతిష్టాత్మకంగా మరో రాకెట్‌ని నింగిలోకి పంపింది.

పీఎస్‌ఎల్వీ సీ-51 ద్వారా భగవద్గీత, ప్రధాని మోదీ ఫొటోను నింగిలోకి పంపింది. షార్‌ సెంటర్‌ నుంచి ఈ సరికొత్త ప్రయోగానికి ఇస్రో శ్రీకారం చుట్టింది. ఇస్రోకి ఇది 78వ ప్రయోగం. 50 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారిగా విదేశీ ప్రైవేట్‌ సంస్థల ఉపగ్రహాలను టేకాఫ్ చేసింది. బ్రెజిల్‌కు చెందిన అమెజోనియా-1తోపాటు 18 నానో ఉపగ్రహాలు మోసుకెళ్లింది.

ఈ పీఎస్‌ఎల్వీ సీ-51 రాకెట్‌ ద్వారా ఓ ఈ అరుదైన ఘట్టానికి తెరలేపింది చెన్నైకు చెందిన స్పేస్‌ కిడ్జ్స్‌ అనే ఇండియా సంస్థ. మొట్ట మొదటిసారిగా తాము చేస్తున్న ఈ ప్రయోగంలో ప్రధాని మోదీ ఫొటో కింద..ఆత్మనిర్భర్‌ మిషన్‌ అనే పదాలతోపాటు భగవద్గీత పంపింది. మరో 25వేల మంది పేర్లు కూడా పంపింది. ఆ 25వేల మందిలో వెయ్యి మంది విదేశీయులు కాగా..చెన్నైలోని ఓ పాఠశాలకు చెందిన విద్యార్థుల పేర్లున్నాయి. మొదటి ప్రయోగవేదిక నుంచి 39వ ప్రయోగం కాగా, సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి 78వది, పీఎస్‌ఎల్వీ సిరీస్‌లో 53వ ప్రయోగం ఇది. ఇస్రో ఎందుకు ఇలా పంపింది..? వీటికి ఉన్న ప్రాధాన్యం ఏమిటి..? అనే విషయాలపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

ఎందుకలా పంపింది..?

సతీష్ ధావన్ ఉపగ్రహం పై ప్యానెల్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటోను చెక్కారు. ప్రధాని పిలుపునిచ్చిన స్వావలంబన చొరవకు సంఘీభావం ప్రదర్శించేందుకు.. ప్రైవేటు కంపెనీలు అంతరిక్షానికి మార్గం తెరవడానికి తీసుకున్న నిర్ణయానికి అభినందనగా ప్రధాని మోదీ ఫొటోను రాకెట్‌ పై ప్యానెల్‌లో ఫిక్స్‌ చేశారు. ఓ  చిత్రాన్ని పైప్యానెల్‌లో అంతరిక్షంలోకి తీసుకెళ్లడం భారత అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో ఇదే తొలి అని చెప్పుకోవచ్చు. ఈ ఉపగ్రహాన్ని ఇస్రో కోసం స్పేస్ కిడ్స్ ఇండియా అభివృద్ధి చేసింది. ఈ ఉపగ్రహం ద్వారా అంతరిక్షంలో రేడియేషన్‌పై స్పేస్ కిడ్స్ ఇండియా పరిశోధనలు కూడా చేస్తుంది.

ఇక భగవద్గీతను కూడా పంపించారు.. ఎందుకు..?

ప్రధాని మోదీ ఫొటోతోపాటు భగవద్గీత కాపీని కూడా అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. భగవద్గీతను అంతరిక్షంలోకి తీసుకెళ్లే ఆలోచనను స్పేస్ కిడ్స్ ఇండియా సీఈఓ డాక్టర్ కేసన్ ఇస్రోకు సూచించారు. ప్రపంచంలోని ఇతర అంతరిక్ష కార్యకలాపాలలో బైబిల్ వంటి పవిత్ర పుస్తకాలను తీసుకువెళ్ళే ధోరణి ఇప్పటికే ఉంది. అలాంటి విధానాన్ని మనం కూడా ఎందుకు చేపట్టకూడదనే ఆలోచనతోనే భగవద్గీతను అంతరిక్షంలోకి పంపించామని డాక్టర్‌ కేసన్‌ వెల్లడించారు. ఇది భారతదేశంలో కొత్త చరిత్రను శ్రీకాకారం చుట్టింది. గతంలో భారతదేశ అంతరిక్ష ప్రయోగాల్లో ఇలాంటివి ఏమీ జరుగలేదు. భారతదేశం ప్రయోగించిన మొత్తం విదేశీ ఉపగ్రహాల సంఖ్య ఇప్పుడు 342 కు చేరుకున్నది.

ప్రధాని మోదీ అభినందనలు

ప్రయోగం విజయవంతపై ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు ప్రధాని మోదీ, ఏపీ గవర్నర్ హరిచందన్, సీఎం జగన్. రానున్న కాలంలో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి

Fuel prices: పెట్రోల్ ధరలు ఏప్రిల్‌లోపు తగ్గుతాయి.. కీలక కామెంట్స్ చేసిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

Lockdown Love Story: “కిటికీ అద్దాలపై ప్రేమ సందేశం..” లాక్‌డౌన్‌ సమయంలో విరహ ప్రేమ..ఇది చదివితే షాక్ అవుతారు..