Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lockdown Love Story: “కిటికీ అద్దాలపై ప్రేమ సందేశం..” లాక్‌డౌన్‌ సమయంలో విరహ ప్రేమ..ఇది చదివితే షాక్ అవుతారు..

Love Story: అబ్బాయి తన ప్రేమను అమ్మాయికి తెలియజేయాలనుకున్నాడు.. గులాబి పువ్వు ఇచ్చి రొటీన్‌గా చెప్పడం కాకుండా...మరికాస్త రొమాంటిక్‌గా మనసులో మాట చెప్పాలనుకున్నాడు.

Lockdown Love Story: కిటికీ అద్దాలపై ప్రేమ సందేశం.. లాక్‌డౌన్‌ సమయంలో విరహ ప్రేమ..ఇది చదివితే షాక్ అవుతారు..
lockdown love story
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 28, 2021 | 6:49 PM

Window Love Story: అబ్బాయి తన ప్రేమను అమ్మాయికి తెలియజేయాలనుకున్నాడు.. గులాబి పువ్వు ఇచ్చి రొటీన్‌గా చెప్పడం కాకుండా…మరికాస్త రొమాంటిక్‌గా మనసులో మాట చెప్పాలనుకున్నాడు. అందమైన ప్రేమలేఖతో తన ప్రేయసిని ‘ఇంప్రెస్‌’ చేయాలనుకున్నాడు. ఇది 1990లో కథ.. కానీ ఇప్పుడు లెక్క మారింది.. ఇంకేముంది  ‘లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ విండో సైట్‌’గా మారింది…

ఎదురింటి కిటికీలో అందమైన అమ్మాయి రాసిన ప్రేమ సందేశం ఇప్పుడు పెద్ద వైరల్ అవుతోంది. కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో అంతా ఇంటికే పరిమితమైపోయారు. పెద్ద పెద్ద పట్టణాల్లో మాత్రం ఆకాశహర్మ్యాల్లో  జీవితాలు ఒంటరిగా చిక్కుకుపోయాయి. అదే సమయంలో కనీసం ఎదురింటివారితో మాట్లాడుకోవడం కూడా కుదరలేదు. ఇలాంటి సమయంలో లండన్ నుంచి వచ్చి ఓ యువతికి అదే బిల్డింగ్‌లో ఉంటున్న యువకుడితో చూపులు కలిశాయి. ఆ సమయంలో తనకు జరిగిన చిన్న అనుభవాన్ని ఓ సింగిల్ విండో ప్రేమికుడు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ స్టోరీ ఇప్పుడు పెద్ద వైరల్‌గా మారుతోంది.

lockdown love story

lockdown love story

“పడోసన్” హిందీ సినిమాలో ‘మేరె సామ్నే వాలి ఖిడ్కీమే…’ పాట పెద్ద ఎత్తున హిట్టు కొట్టింది. ఇలానే పాట పడుకుంటున్న ఓ యువకుడికి జరిగిన ఈ ప్రేమ కథ అందరిని కట్టి పడేసింది. ఎదురుగా ఉండే ఫ్లాట్లో ఉండే ఓ యువతితో చూపులు కలిపాడు. ‘చూపులు కలసిన శుభవేళ..’ ఆ యువతి మెసెజ్ పంపించింది. అయితే ఇది అలాంటి.. ఇలాంటి సందేశం కాదు ప్రేమ.. విరహ సందేశం.. అందులోనూ కాస్తా వెరైటీగా.. తమ ఇద్దరి ఫ్లాట్ కిటికీ అద్దలపై చిట్ చాట్‌ జరిగింది.

అయితే “లాక్డౌన్ లవ్ స్టోరీ” ని టిక్‌టాక్‌లో ముందుగా పంచుకుంది. ఆమె కిటికీ అద్దాలపై సందేశాలను ఇలా రాసుకుంది. “RU సింగిల్?” అని ఆ యువతి ఆమె పెద్ద నల్ల అక్షరాలతో రాసింది.

అయితే ఈ మెసేజ్ చూసిన ఆ యువకుడు కొంత ఆశ్చర్యానికి గురైనప్పటికీ.. వెంటనే తేరుకుని అదే తరహాలో స్పందించాడు. “యస్.., కానీ.. నేను 2 నెలల వ్యవధిలో కదులుతున్నాను. క్షమించండి. పీఎస్, శృంగారభరితంగా ఉండండి.” అంటూ మెసెజ్ పెట్టాడు.

అతడు పెట్టిన మెసెజ్‌కు ఇలా స్పందించింది. ‘వర్త్ ఏ ట్రై’ అంటూ తన ఫోన్ నెంబర్‌ పెట్టింది. అనాలోచిత ప్రేమకథ వైరల్ గా మారింది. 1.5 లక్షలకు పైగా వీక్షణలను సంపాదించింది. నెటిజన్లు వారి పరస్పర చర్యతో ఆనందంగా ఉన్నారు. తరువాత ఏమి జరిగిందో తెలుసుకోవటానికి సంతోషిస్తున్నారు.

ఇది కూడా చదవండి

Bank of Baroda: మీ ఆవిడకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారా.. ఈ బ్యాంక్‌లో అకౌంట్ నెంబర్ ఇచ్చి చూడండి..