Punarnava Benefits : శరీరంలోని అవయవాలను పునరుజ్జీవితం చేసే ఔషధాల గని గలిజేరు. ఉపయోగాలను తెలిస్తే వదలరుగా
ప్రకృతి ఓ ఔషదాల గని. వర్షం పడగానే ఎక్కడపడితే అక్కడ చక చకా మొలిచి కనిపించే మరో అద్భుతమైన మూలిక గలిజేరు. అత్యంత ప్రమాదకర అనారోగ్యాలకు వైద్యాన్ని, ఔషధాలను ప్రకృతిలో...
Punarnava Benefits : ప్రకృతి ఓ ఔషదాల గని. వర్షం పడగానే ఎక్కడపడితే అక్కడ చక చకా మొలిచి కనిపించే మరో అద్భుతమైన మూలిక గలిజేరు. అత్యంత ప్రమాదకర అనారోగ్యాలకు వైద్యాన్ని, ఔషధాలను ప్రకృతిలో లభించే మొక్కలతో తయారు చేసుకోవచ్చు. ఆయుర్వేదంలో దీనిపేరు పునర్నవ. పునర్ అంటే తిరిగి, నవ అంటే కొత్తగా అని అర్థం. దీని శాస్త్రీయ నామం బోరేవియా డిఫ్యూసా. సంస్కృతంలో స్వనాడిక, రక్తపుష్ప, పునర్నవ అంటారు. ఆయుర్వేద మందుల్లో నొప్పిని తగ్గించే ఔషదంగా, రక్తాన్ని వృద్ధి పరచటానికి వాడే ముందుగా తయారు చేసేది ఈ మొక్కతోనే. ఈ మొక్క వర్షాకాలంలో ఎక్కువగా మొలుస్తుంది.. నేల మీద పాకే ఈ మొక్క మూడు రకాలు. తెలుపు, ఎరుపు మరియు నలుపు. ఔషధ గుణాలు మూడింటికీ ఒకేలాగా ఉన్నా తెల్ల గలిజేరు ఉత్తమమని అంటారు. వాటికి పూచే చిన్న చిన్న పువ్వుల రంగు బట్టి అది ఏ రంగుదో నిర్ణయిస్తారు.
తెల్ల గలిజేరును వేడి నీటిలో మరిగించి తాగితే కఫము, దగ్గు, విషము, పాడు రోగాలు, శరీరానికి కలిగే వాపులు, వాత వ్యాధులు, కడుపుకి సంబంధించిన వ్యాధులు, కాలేయ వాపుని మరియు గుండె బలహీనత వల్ల వచ్చిన వాపుని పోగొడుతుంది. మూత్రపిండాలను బాగు చేసి సక్రమంగా పని చేసేలా చేస్తుంది. నెల రోజులు తింటే కుష్టు రోగమును కూడా హరిస్తుందని వస్తు గుణ దీపిక చెప్తుంది. ఈ వేరు నీటిలో అరగతీసి కంటికి పెడితే రేచీకటి తొలగిపోయి కంటి చూపు మెరుగు పడుతుంది. ఈ ఆకు వండుకుని తింటూ ఉంటే రక్తం శుభ్రపడి వృద్ది చెందుతుంది. ఈ తెల్ల గలిజేరు ఆకు రసం పది గ్రాములు పెరుగులో కలిపి ఉదయం, సాయంకాలం తీసుకుంటే కామెర్లు నయమవుతాయి. అలా మూడు రోజులు తినాలి. తెల్లగలిజేరు ఆకులు పిడికెడు తీసుకొని శుభ్రపరిచి పావు లీటర్ మంచినీటిలో వేసి పది నిమిషాలుమరగనివ్వాలి. అనంతరం చల్లార్చి వడపోసిరోజు ఉదయం పరగడుపు ఒక గ్లాసు తీసుకున్నట్లయితే కిడ్నీలు శుద్ధితో పాటు మూత్ర నాళ సమస్యలు పూర్తిగా దూరం అవుతాయి. కానీ ప్రక్రియను 21 రోజులు చేయివలసి వుంటుంది.ఈ కాషాయం తీసుకున్న అనంతరం ఓ అరగంట ఏమీ తినకూడదు. తెల్ల గలిజేరు వేరు, ఉమ్మెత వేరు కలిపి ముద్ద చేసి తింటే పిచ్చి కుక్క కరిచినప్పటి విషం విరిగిపోతుంది. తెల్లగలిజేరు వేరు, నీరు, పాలు సమంగా కలిపి పాలు మిగిలే దాకా కాచి వడకట్టి తాగితే సర్వ జ్వరాలు హరిస్తాయని సుశ్రుత సంహిత చెప్తుంది. తెల్ల గలిజేరు ఆకును నూరి ముఖానికి రాసుకుంటే మచ్చలు తగ్గుతాయి. గలిజేరు మొక్కను నూరి రసం తీసి దానికి సమానం గా నువ్వుల నూనెని కలిపి నూనె మిగిలేదాకా సన్నని సెగను కాచి వాతం నొప్పులున్న చోట, కీళ్ల నెప్పులకు మర్దనా చేస్తే తగ్గుతాయి. నడకరాని పిల్లలకు ఇదే తైలం మర్దన చేసి తర్వాత స్నానం చేయిస్తే నడక వస్తుందని మూలికా వైద్యులు చెప్తారు. గలిజేరు ఆకు వేడి చేసి కడితే బోదకాలు తగ్గుతుంది. ఎర్ర గలిజేరు చలవ చేసి పైవాటితో పాటు పిత్తాన్ని పోగొడుతుంది. నల్ల గలిజేరు కారం, చేదు రుచి ఉండి వాతాన్ని పోగొడుతుంది. ఇది దొరకటం అరుదు. మనకి సామాన్యం గా అందుబాటులో ఉండేది తెల్ల గలిజేరె. పప్పులో కలిపి వండుకుంటారు. ఉప్పు, మిరప కాయలు వేసి రుబ్బిన మినప్పిండి లో గుమ్మడి బదులు తరిగిన గలిజేరు మొక్క కలిపి వడియాలు గా చేసి ఎండబెట్టి నిల్వ చేసుకుంటారు. ఆకులతో కషాయం చేసి తాగుతారు. ఈ కషాయం లో కొద్దీ గా అల్లం రసం కలిపి తాగితే నెలరోజుల్లో శరీరం ఉబ్బు తగ్గుతుంది.
ఈ ఆకు కూరని అతిగా తినకూడదు. తీవ్రమైన హృద్రోగం ఉన్నవారు వైద్యుడి సలహా తీసుకుని తీరాలి. డయాబెటిస్, అధిక రక్త పోటు ఉన్నవారు చలువ చేసే పదార్ధాలు అధిక గా తింటూ ఈ ఆకు కూరని మితంగా తినాలి. పాలిచ్చే తల్లులు, గర్బిణీలు ఈ ఆకు కూర తినకూడదు. ఆరోగ్యం బాగున్న వారు ఈ కాలంలో వారానికి ఒక సారి తిన్నా సరిపోతుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు వారానికి రెండు మూడు సార్లు పప్పులో వండుకుని తింటే మంచిది. చాలా త్వరగా కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ఆకు ప్రతి కణానికి ఆరోగ్యాన్నిచ్చి పునరుజ్జీవితం చేయగలదు కనుకనే ఇది ‘పునర్నవ’ అయ్యింది.
Also Read: