దేశ వ్యాప్తంగా బలవంతపు మత మార్పిడులకు ఓ వర్గం యత్నం..ఢిల్లీ, యూపీలలో ఈడీ సోదాలు

బలవంతంగా మత మార్పిడులకు పాల్పడుతున్నారని కొంతమందిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఢిల్లీ, యూపీ రాష్ట్రాల్లో పలు చోట్ల ఈడీ అధికారులు శనివారం సోదాలు జరిపారు. చట్ట విరుద్ధంగా సాగుతున్న మత మార్పిడులను వీరు ప్రోత్సహిస్తున్నారని...

దేశ వ్యాప్తంగా బలవంతపు మత మార్పిడులకు ఓ వర్గం యత్నం..ఢిల్లీ, యూపీలలో ఈడీ సోదాలు
Delhi Up Mass Conversations Ed Raids Two Arrested
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Jul 03, 2021 | 7:24 PM

బలవంతంగా మత మార్పిడులకు పాల్పడుతున్నారని కొంతమందిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఢిల్లీ, యూపీ రాష్ట్రాల్లో పలు చోట్ల ఈడీ అధికారులు శనివారం సోదాలు జరిపారు. చట్ట విరుద్ధంగా సాగుతున్న మత మార్పిడులను వీరు ప్రోత్సహిస్తున్నారని…పైగా ఈ నిందితులకు విదేశాల నుంచి ముఖ్యంగా పాకిస్తాన్ లోని ఇంటర్ సర్వీసెస్ ఏజెన్సీ (ఐఎస్ఐ) నుంచి నిధులు అందుతున్నాయని వారు తెలిపారు. ఢిల్లీలో మూడు చోట్ల, యూపీలో కూడా మూడు చోట్ల ఏకకాలంలో నిర్వహించిన సోదాల్లో పలు అనుమానాస్పద పత్రాలను కూడా వీరు స్వాధీనం చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా మత మార్పిడులను తమ అనుయాయుల చేత ప్రోత్సహించేందుకు యత్నిస్తున్న ఉమర్ గౌతమ్, అతని సహచరుడు ముఫ్తీ ఖాజీ జహంగీర్ కాస్మీలను పోలీసులు ఇటీవలే అరెస్టు చేశారు. వీరికి.. ఈ రాకెట్ తో సంబంధం ఉన్నవారికి పలు దేశాల నుంచి పెద్ద ఎత్తున కోట్లాది నిధులు అందుతున్నట్టు తాము స్వాధీనం చేసుకున్న పత్రాల ద్వారా తెలిసిందని ఈడీ సిబ్బంది వెల్లడించారు.

ఉమర్ గౌతమ్ ..ఢిల్లీలోని తన ఇంటినే ఇస్లామిక్ దావా సెంటర్ కార్యాలయంగా మార్చాడని. అలాగే లక్నోలో అల్ హసన్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ ఫేర్ ఫౌండేషన్, గైడెన్స్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ ఫేర్ సొసైటీని కూడా తన సహచరునితో కలిసి నిర్వహిస్తున్నాడని వెల్లడైంది. మనీ లాండరింగ్ చట్టం కింద కూడా వీరిపై కేసు నమోదైంది. వీరి నెట్ వర్క్ విస్తృతంగా ఉందని, త్వరలో దేశంలోని మరికొన్ని నగరాల్లో కూడా సోదాలు నిర్వహిస్తామని ఆదికారులు చెప్పారు. తమను హిందువులుగా చెప్పుకుంటూ ఘజియాబాద్ జిల్లాలోని ఓ ఆలయం లోకి ప్రవేశించబోయిన ఇద్దరు ముస్లిములను అరెస్టు చేయగా ‘డొంకంతా కదిలింది’.

మరిన్ని ఇక్కడ చూడండి:టీకా కోసం తోపులాట…అంత రచ్చ రచ్చ..ఇలాఐతే థర్డ్ వేవ్ కాదు.. ఎన్ని వేవులైన వస్తాయంటూ కామెంట్లు:vaccine centre video.

ఆరోగ్యానికి ఔషధం లా తెల్ల మిరియాలు..! నల్ల వాటికంటే కంటే తెల్ల మిరియాలు ద్వారానే ఎన్నో లాభాలు..:White Pepper video.

Magic Lake Video:స్పాటెడ్ లేక్..సమ్మర్ లో నీళ్లు ఉండటమే కష్టం అలాంటిది రంగులు విరజిమ్మే సరస్సు…ఎక్కడంటే..?

రంగంలోకి దిగిన ‘ఎఫ్ 3’ టీమ్..! మెల్లగా నవ్వులు మొదలు సెట్ లో సందడే సందడి:F3 Movie video.