AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oxygen Plants: ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీర్చేందుకు ప్రణాళిక.. వచ్చే నెలలో 44 ప్లాంట్లు ఏర్పాటు: సీఎం కేజ్రీవాల్

Arvind Kejriwal: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. ఆక్సిజన్ కొరతతో నాలుగైదు రోజుల నుంచి 50 మందికి

Oxygen Plants: ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీర్చేందుకు ప్రణాళిక.. వచ్చే నెలలో 44 ప్లాంట్లు ఏర్పాటు: సీఎం కేజ్రీవాల్
Arvind Kejriwal
Shaik Madar Saheb
|

Updated on: Apr 27, 2021 | 4:33 PM

Share

Arvind Kejriwal: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. ఆక్సిజన్ కొరతతో నాలుగైదు రోజుల నుంచి 50 మందికి పైగా మరణించారు. బెడ్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ తరుణంలో రాజధాని ఢిల్లీలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. ఆక్సిజన్ సమస్యను అధిగమించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. వచ్చే నెల చివరి నాటికి ఢిల్లీలో 44 కొత్త ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. వీటిలో ఎనిమిదింటిని కేంద్రం ఏర్పాటు చేస్తుండగా.. మిగిలిన ప్లాంట్ల ఏర్పాటు బాధ్యతను ఢిల్లీ ప్రభుత్వమే తీసుకుందని తెలిపారు. ఢిల్లీలో ఆక్సిజన్, ఆక్సిజన్ ట్యాంకర్ల కొరత తీవ్రంగా వేధిస్తుందని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తంచేశారు. ఢిల్లీలో ఆక్సిజన్ సమస్యను అధిగమించేందుకు బ్యాంకాక్ నుంచి 18 ట్యాంకర్లను దిగుమతి చేసుకుంటున్నామని కేజ్రీవాల్ వెల్లడించారు. దీంతోపాటు.. వెంటనే ఉత్పత్తి ప్రారంభించే స్థితిలో ఉన్న మరో 21 ఆక్సిజన్ తయారీ ప్లాంట్లను ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు వివరించారు.

గత వారం తీవ్రస్థాయికి చేరుకున్న ఆక్సిజన్ కొరత ప్రస్తుతం కాస్తంత సద్దుమణిగిందని, సకాలంలో పరిస్థితిని కొంత మేర చక్కదిద్దగలిగామని కేజ్రీవాల్ తెలిపారు. కొత్త రోగులను ఆసుపత్రుల్లో చేర్చుకోవడం కూడా ప్రారంభించామని ఆయన తెలిపారు. కాగా.. ప్రాణవాయువు రవాణా వేగవంతం చేసేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ తొలి రైలు 70 టన్నుల ఆక్సిజన్‌తో మంగళవారం ఉదయం ఢిల్లీకి చేరుకుంది. ఈ 70 టన్నులను ఏయే ఆస్పత్రులకు కేటాయించాలనే దానిపై ఢిల్లీ ప్రభుత్వమే నిర్ణయం తీసుకోనుంది.

కాగా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరతతో చాలామంది రోగులు మరణిస్తున్నారు. నిన్న ఆక్సిజన్ కొరతతో పంజాబ్, మహారాష్ట్ర, హర్యానా తదితర ప్రాంతాల్లో 12 మంది వరకు మరణించారు. దీంతోపాటు రెండు రోజుల క్రితం ఢిల్లీలో దాదాపు 50 మంది ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోయారు.

Also Read:

Ramdan Thofa: కరోనా కష్టకాలంలో పేద ముస్లింలకు రాష్ట్ర సర్కార్ అండ.. రంజాన్ తోఫా పంపిణీ ప్రారంభించిన మహమూద్ అలీ

ఎండాకాలంలో కూడా పాదాలు పగులుతున్నాయా ? అయితే ఇలా చేయండి.. సమస్యను దూరం పెట్టండి..

ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..