AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Marriage: పీపీటీ కిట్లతో పెళ్లి.. కోవిడ్ నిబంధనలను పాటించి వివాహం చేసుకున్న వారికి పోలీసుల విందు.. ఎక్కడంటే..?

మధ్యప్రదేశ్ లో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి వివాహం చేసుకున్నాడు. అలా ఎలా? నిబంధనలు ఒప్పుకోవు కదా? అయినా పెళ్లి కూతురు తరఫు వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు?

Marriage: పీపీటీ కిట్లతో పెళ్లి.. కోవిడ్ నిబంధనలను పాటించి వివాహం చేసుకున్న వారికి పోలీసుల విందు.. ఎక్కడంటే..?
Marriage In Ppt Kits
KVD Varma
|

Updated on: Apr 27, 2021 | 4:32 PM

Share

Marriage: కరోనా కల్లోలం రోజు రోజుకూ పెరిగిపోతోంది. మొదటిసారి వచ్చిన వేవ్ కంటె ఎన్నోరెట్లు ఎక్కువ వేగంతో విరుచుకుపడుతోంది. కరోనా నిరోధానికి ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలితాలు ఇవ్వడం లేదు. కరోనాపై పోరాటం కోసం నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక కరోనా వేళలో జరుగుతున్న వివాహాలు, వివాహ వేడుకలు వార్తలుగా విపరీతంగా సోషల్ మీడియాలో ప్రచారంలోకి వస్తున్నాయి. ఇప్పుడు అటువంటిదే ఓ పెళ్లికి సంబంధించిన విశేషం…

మధ్యప్రదేశ్ లో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి వివాహం చేసుకున్నాడు. అలా ఎలా? నిబంధనలు ఒప్పుకోవు కదా? అయినా పెళ్లి కూతురు తరఫు వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు? ఇవేగా మీ ప్రశ్నలు. ఆగండి అదే చెప్పబోతున్నాం. మధ్యప్రదేశ్ రత్లాంలో ఈ సంఘటన జరిగింది. ఇక్కడ ఒక యువకునికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే, అప్పటికే అతని వివాహం నిర్ణయం అయిపోయింది. కరోనా నేపధ్యంలో పెళ్లి వాయిదా వేయాలని భావించారు. అయితే, వధువు తరఫు వారు ఎలాగైనా ఈ ముహూర్తంలో పెళ్లి జరగాలి. అని వరుడు తరఫు వారిని కోరారు. దాంతో ఇరువురూ చర్చించుకుని అదే ముహూర్తానికి పెళ్ళిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎవరినీ పిలవకుండా రెండు కుటుంబాల పెద్దలు దగ్గరుండి జరిపించాలని భావించారు.

ఈ విషయం జిల్లా అధికారులకు ఎవరో ఫిర్యాదు చేశారు. దీంతో ఆ పెళ్లిని ఆపడానికి ఆ ప్రాంత తహశీల్దార్ వచ్చారు. కరోనా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న పెళ్లిని ఆపుచేయాలనీ, దీనికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలనీ వచ్చిన వారికి అక్కడ జరుగుతున్న సీన్ చూసి ఏమీచేయలేక పోయారు. ఏమీ అనలేకపోయారు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే..పెళ్లి కూతురు.. పెళ్లి కొడుకూ ఇద్దరూ పీపీటీ కిట్లతో పీటల మీద కూచుని ఉన్నారు. పెళ్లి పెద్దలు కూడా కోవిడ్ నిబంధనాలు అన్నీ పాటిస్తున్నారు. తహశీల్దార్ కు ఆ పెళ్లి ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరంగా చెప్పారు వరుడు, వధువు తరఫు వారు.

ఆ పెళ్లిని మీరు ఈ వీడియోలో చూడొచ్చు..

ఇక కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి మధ్యప్రదేశ్ అంతా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. పెళ్లిళ్లకు 50 మంది కంటె ఎక్కువ మందిని అనుమతించడం లేదు. అంతే కాదు అక్కడ ఒక పోలీసు అధికారి పది మంది కంటె తక్కువ హాజరుతో పెళ్లి చేసుకుంటే, వారందరికీ విందు ఇవ్వాలని నిర్ణయించారు.

పది లేదా అంతకంటే తక్కువ అతిథుల సమక్షంలో వివాహం చేసుకుంటే నేను వారికి, వధువు-వరుడు తొ సహా నా ఇంట్లో రుచికరమైన విందు ఇవ్వబోతున్నాను అని పోలీస్ సూపరింటెండెంట్ మనోజ్ కుమార్ సింగ్ చెప్పారు. ఈ జంటలకు మెమెంటోలు కూడా ఇస్తామన్నారు. అదేవిధంగా వారిని ప్రభుత్వ వాహనం లో తీసుకొచ్చి తిరిగి పంపిస్తాం అని అయన వివరించారు.

పెళ్లిపై తహశీల్దార్ ఏమన్నారో ఇక్కడ చూడండి..