Hare Swimming: మీరు ఎప్పుడన్నా కుందేలు నీటిలో ఈత కొట్టడం చూశారా? ఈ వీడియో చూడండి! మీరు రిలాక్స్ అవడం గ్యారెంటీ!

ఎటు చూసినా కరోనా వార్తలు.. ఎక్కడ విన్నా కరోనా కబుర్లు.. విసిగిపోతున్నారు కదూ. సరే.. కొద్దిసేపు ఆ విసుగును పక్కన పెట్టి ఈ విషయం వినండి. మీరెప్పుడైనా కుందేలు చూశారా?

Hare Swimming: మీరు ఎప్పుడన్నా కుందేలు నీటిలో ఈత కొట్టడం చూశారా? ఈ వీడియో చూడండి! మీరు రిలాక్స్ అవడం గ్యారెంటీ!
Hare Swimming
Follow us

|

Updated on: Apr 27, 2021 | 6:25 PM

Hare Swimming: ఎటు చూసినా కరోనా వార్తలు.. ఎక్కడ విన్నా కరోనా కబుర్లు.. విసిగిపోతున్నారు కదూ. సరే.. కొద్దిసేపు ఆ విసుగును పక్కన పెట్టి ఈ విషయం వినండి. మీరెప్పుడైనా కుందేలు చూశారా? ఇదేం ప్రశ్న అని సీరియస్ అవ్వొద్దు.. చూసే ఉంటారు లెండి. ఎక్కడ? జూలోనో.. ఎవరన్నా పెంచుకుంటుంటే అక్కడో.. లేకపోతే సినిమాల్లోనో కదా. అప్పుడు కూడా చెంగున ఎగురుతున్న కుందేలు చూసి ఉంటారు. లేదా ఒక పక్కగా ముడుచుకుని కూచున్న కుందేలును చూసి ఉంటారు. కానీ నీటిలో ఈత కొడుతున్న కుందేలును చూశారా? దీనికి మాత్రం నో అనే చెబుతారు లెండి. అందుకే మీకోసం ఈత కొట్టుకుంటూ నీటిని దాటి అడవిలోకి చెంగున గెంతిన కుందేలు వీడియో మన ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్‌కు చెందిన సుశాంత నందా ట్విట్టర్ లో షేర్ చేసిన వీడియో చూపిస్తున్నాం. చూసేయండి.. ఇది చూస్తె కచ్చితంగా మీరు రిలాక్స్ అవుతారు.. ఎందుకంటే, జంతువులు అందులోనూ కుందేలు లాంటి సాధు జంతువులు ఎంత క్యూట్ గా ఉంటాయో… అవి గెంతినా.. పరిగెట్టినా..ఎలా ఉన్నా చూస్తుంటే చూడాలనిపిస్తుంది. ముద్దుగా ఉండే ఇటువంటి జంతువులు నాచురల్ గా అడవిలో ఎలా తిరుగుతుంటాయో ఇటువంటి వీదియోల్లోనే చూడగలం.

ఈ వీడియోలో ఓ కుందేలు సరస్సులో ఈత కొట్టింది. కొద్దిసేపే అయినా కానీ కుందేలు ఈత కొట్టడం కొత్తగా..ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఈ వీడియోను ఇప్పటిదాకా ఏడువేల మందికి పైగా చూశారు. చూసిన వాళ్ళు ఊరుకోరుగా.. ఈ వీడియోకు లైకేసుకుని.. మంచి కామెంటు కూడా పెట్టారు. కొన్ని కామెంట్లు కూడా చూడండి..