అకస్మాత్తుగా రెండు ముక్కలైన రోలర్ కోస్టర్.. 200 మీటర్ల ఎత్తులో చిక్కుకున్న జనాలు.. షాకింగ్ దృశ్యాలు.!
ఏ క్షణం ఎలా ఉంటుందో.? ఎవరూ చెప్పలేరు.! ఇప్పటిదాకా అన్ని బాగానే ఉన్నా..
ఏ క్షణం ఎలా ఉంటుందో.? ఎవరూ చెప్పలేరు.! ఇప్పటిదాకా అన్ని బాగానే ఉన్నా.. నెక్స్ట్ మినిట్ లో అంతా మారిపోతుంది. అనుకోని దృశ్యాలను చూడాల్సి వస్తుంది. అలాంటి ఒక సంఘటన ఇంగ్లాండ్‌లోని అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో తాజాగా చోటు చేసుకుంది. అది చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు కూడా భయపడతారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో చూద్దాం..
ప్రపంచంలోనే అతిపెద్ద రోలర్ కోస్టర్ ఆకాశంలో రెండు భాగాలుగా- విరిగిపోయింది. కొంతమంది దాని నుంచి బయటపడగా.. మరికొందరు అందులో చిక్కుకుని పోయారు. ఏది ఏమైనా చివరికి అందరూ సురక్షితంగా బయటపడ్డారు. కాగా, సోషల్ మీడియాలో ఈ వీడియో షేర్ చేసిన వెంటనే వైరల్ గా మారింది. రోలర్ కోస్టర్ రెండుగా విడిపోయిన సమయంలో చాలామంది 200 అడుగుల ఎత్తులో చిక్కుకున్నారు. ఆ తర్వాత అందరూ కూడా జాగ్రత్తగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఎవరికీ నష్టం జరగలేదు.