AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pengwin: ఆ చిన్నిపెంగ్విన్ చనిపోయింది.. ఆ విషయం తెలిసిన దాని తల్లిదండ్రులు ఏం చేశాయో చూడండి..

బిడ్డ చనిపోతే తల్లిదండ్రులు పడే బాధ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. అందులోనూ, చిన్నారిగా ఉన్న బిడ్డ పోతే ఆ బిడ్డ తల్లిదండ్రులను ఎవరూ ఒదార్చలేరు. ఈ ఎమోషన్ మనుషుల్లోనే అని మనం అనుకుంటాం.

Pengwin: ఆ చిన్నిపెంగ్విన్ చనిపోయింది.. ఆ విషయం తెలిసిన దాని తల్లిదండ్రులు ఏం చేశాయో చూడండి..
Pengwin
KVD Varma
|

Updated on: Apr 27, 2021 | 12:01 AM

Share

Pengwin: బిడ్డ చనిపోతే తల్లిదండ్రులు పడే బాధ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. అందులోనూ, చిన్నారిగా ఉన్న బిడ్డ పోతే ఆ బిడ్డ తల్లిదండ్రులను ఎవరూ ఒదార్చలేరు. ఈ ఎమోషన్ మనుషుల్లోనే అని మనం అనుకుంటాం. కానీ, జంతువులు, పక్షుల్లోనూ చాలా ఉంటుంది. మనం గమనించం అంతే. ఒక్కోసారి మన దగ్గరలో ఏదైనా సంఘటన ఇటువంటిది జరిగితే కూడా పెద్దగా మనకు అర్ధం కాదు. కానీ, ఇక్కడ మీకు చూపిస్తున్న వీడియో చూస్తె మీ మనసు ద్రవించిపోవడం ఖాయం. పెంగ్విన్ గురించి అందరికీ తెలిసిందే. అంటార్కిటికా మంచు ప్రాంతాల్లో ఉంటాయి. వీటి ప్రవర్తన అచ్చు మనుషుల్లానే ఉంటుంది. వీటిలో కూడా కుటుంబ వ్యవస్థ ఉంటుంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ కు చెందిన సుశాంత్ నందా సోమవారం ఒక వీడియో ఈ పెంగ్విన్ లకు సంబంధించింది షేర్ చేశారు. దానిని చూసిన ప్రతి ఒక్కరూ కంట తడి పెడుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..

ఒక చిన్న పెంగ్విన్ ఎలా చనిపోయిందో తెలీదు చనిపోయి ఉంది. అక్కడికి తల్లి వచ్చి ఆ పిల్ల శరీరాన్ని కదిపి చూసింది. అది లేవలేదు. మళ్ళీ కదిపింది కదలలేదు. ఈసారి గట్టిగా కాలితో తోసింది. అప్పుడూ ఆ పిల్ల పెంగ్విన్ లో చలనం లేదు. దీంతో విషయం తల్లి పెంగ్విన్ కు అర్ధం అయిపొయింది ఆ పిల్ల దగ్గరకు వచ్చి దాని శరీరాన్ని కాలితో.. రెక్కలతో పట్టుకుని చూస్తోంది. దుఃఖంతో ఉండిపోయింది. ఇదంతా గమనిస్తున్న తండ్రి పెంగ్విన్ తల్లి పెంగ్విన్ దగ్గరకు వచ్చి ఓదారుస్తోంది. నిజంగా.. ఈ వీడియో చూస్తుంటే.. ఆ పిల్ల పెంగ్విన్ కోసం పెద్ద పెంగ్విన్ లు పడుతున్న ఆరాటం చూస్తుంటే మనసు చివుక్కు మంటుంది. ఇక్కడ ఆ వీడియో ట్వీట్ చూడండి.

“అన్ని జీవితాల విషయం ఇదే. ఈ రెండు పెంగ్విన్లు తమ పిల్లలను కోల్పోయినందుకు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి. హృదయ విదారకం. కరోనా మహమ్మారిలో తమ దగ్గరి మరియు ప్రియమైన వారిని కోల్పోయిన వారికి దేవుడు బలం చేకూరుస్తాడు ”అని సుసాంత నంద పోస్ట్ కు ఇచ్చిన శీర్షికలో పేర్కొన్నారు.

ఈ వీడియో పై నెటిజన్ల రియాక్షన్స్ ఎలా ఉన్నాయో చూడండి..

Also Read: Pawan Kalyan Fans: పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి ఇప్పుడు కొత్త శత్రువు..! అన‌వ‌స‌రంగా బుక్క‌యిన పీవీపీ

Funny Chimpanji: ఈ చింపాంజీ చేస్తున్న విన్యాసాలకు నెటిజన్లు ఫిదా అయిపోయారు.. మరి మీరు?