Pawan Kalyan Fans: పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి ఇప్పుడు కొత్త శత్రువు..! అన‌వ‌స‌రంగా బుక్క‌యిన పీవీపీ

పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి ఇప్పుడు కొత్త శత్రువు దొరికారు. మా సార్ ని అంత మాటంటావా? అంటూ చీల్చి చెండాడుతోంది పవన్ సేన....

Pawan Kalyan Fans:  పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి ఇప్పుడు కొత్త శత్రువు..! అన‌వ‌స‌రంగా బుక్క‌యిన పీవీపీ
Pvp Tweet
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 26, 2021 | 11:05 PM

పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి ఇప్పుడు కొత్త శత్రువు దొరికారు. మా సార్ ని అంత మాటంటావా? అంటూ చీల్చి చెండాడుతోంది పవన్ సేన. ఇంతకీ ఆ కొత్త శత్రువు ఎవరు? అతడు కొత్తగా చేసిన ఆ నేరమేంటి? కొంచెం నీరు కొంచెం నిప్పు లాంటి ఆ ఇంట్రస్టింగ్ ఎపిసోడ్ ఏంటో తెలుసుకుందాం ప‌దండి.

రీసెంట్ గా ముంబైలో ఒక రైల్వే స్టేషన్ పట్టాలపై పడిన పిల్లాడ్ని రక్షించి హీరో అయిన వ్యక్తిని.. ఆ వీడియోను మీరూ చూసే వుంటారు. ఇప్పుడు ఆ వీడియో… తెలుగు సినిమా హీరోల తలనొప్పికొచ్చేసింది. ఎలాగంటే.. ప్రముఖ పారిశ్రామికవేత్త, నిర్మాత పొట్లూరి వరప్రసాద్… ఆ దృశ్యాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఒక సస్పిషియస్ కామెంట్ పెట్టారు. అది నేరుగా పవన్ కళ్యాణ్ అభిమానులకే తాకేసింది.

అంత సాహసం చేసిన ఆ వ్యక్తికి జావా బైక్ గిఫ్టుగా ఇచ్చారేంటి… లంగా డ్యాన్సులేసే హీరోలకు మాత్రం 50 కోట్లిస్తారా? అనేది పీవీపీ పెట్టిన క్యాప్షన్. రీసెంట్ గా వకీల్ సాబ్ మూవీకి పవన్ 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఆ గాసిప్ కీ, ఈ కామెంట్ కీ లంకె పెట్టి.. సొంత భాష్యాలు తీస్తోంది నెటిజనం.

సినిమా మీద బతుకుతూ సినిమా వాళ్లనే అవహేళన చేస్తావా అంటూ పవన్ అభిమానులు కొందరు నెట్టింట్లో డైరెక్ట్ గానే పీవీపీ కి రిటార్ట్ ఇవ్వడం మొదలైంది. గతంలో జనసేన తొలిరోజుల్లో పవన్ వెంటే తిరిగిన పీవీపీ.. ఆ తర్వాత గ్యాప్ తీసుకుని దూరంగా వుంటున్నారు. ఈ క్రమంలోనే పీవీపీ వర్సెస్ పవన్ అనే ఈ ఎపిసోడ్ కాక రేపుతోంది.

Also Read: 50 మిలియ‌న్ వ్యూస్ టార్గెట్.. మాస్ ప‌వ‌రేంటో చూపిస్తోన్న బాల‌య్య‌..

 ‘అరవింద సమేత’కు మించిన ఈవిల్‌ క్యారెక్టర్..ర‌జ‌నీ సినిమాలో త‌న పాత్ర గురించి జ‌గ్గూ భాయ్ హింట్