Delhi Pollution: ఢిల్లీ వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలు ఏమిటో వెల్లడించిన నాసా..!
Delhi Pollution: ఢిల్లీలో కాలుష్యం కారణంగా ఎంతో నష్టం వాటిల్లుతున్న విషయం తెలిసిందే. చాలా మంది కాలుష్యం కారణంగా ఆస్పత్రుల పాలవుతున్నారు. దీంతో..
Delhi Pollution: ఢిల్లీలో కాలుష్యం కారణంగా ఎంతో నష్టం వాటిల్లుతున్న విషయం తెలిసిందే. చాలా మంది కాలుష్యం కారణంగా ఆస్పత్రుల పాలవుతున్నారు. దీంతో ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుందనే చెప్పాలి. కాలుష్యం కారణంగా ఢిల్లీలో స్కూళ్లు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే రైతులు పంట వ్యర్థాలను కాల్చడం వల్లే ఢిల్లీ కాలుష్యానికి కారణమని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వెల్లడించింది. నవంబర్-డిసెంబర్ మధ్య కాలుష్యం భారీ స్థాయిలో ఎక్కువగా నమోదవుతోందని నాసా నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
ఢిల్లీ వాయు కాలుష్యానికి పరిశ్రమలు, చుట్టుపక్కల రాష్ట్రాల రైతులు కాల్చే పంట వ్యర్థాలు, వాహన కాలుష్యం, బాణసంచా కాల్చడం వంటివి కొంత కారణమని తెలిపింది. ఈ కాలుష్యానికి బాణసంలు కాల్చడం తోడైందని తెలిపింది. విజిబుల్ ఇన్ ఫ్రారెడ్ ఇమేజింగ్ రేడియోమీటర్ స్విట్ ద్వారా ఈ సంవత్సరం నవంబర్ 11న ఉన్న పరిస్థితిని నాసా పరిశీలించింది. షువామీ ఎన్పీపీ శాటిలైట్ ద్వారా ఫొటోలను తీసింది. పంజాబ్, హర్యానాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల భారీ ఎత్తున పొగ ఢిల్లీ వైపు మళ్లి మరింత కాలుష్యం ఏర్పడడానికి మరో కారణమని నాసా తెలిపింది.
పొగవల్ల ప్రాణాలకు ముప్పు: కాగా, ఢిల్లీ కాలుష్యం వల్ల మనుషుల ప్రాణాలకే ముప్పు ఉందని నాసా వెల్లడించింది. ఆ ఒక్కరోజే పొగ వల్ల 2.2 కోట్ల మంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని నాసా మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ శాస్త్రవేత్త పవన్ గుప్తా పేర్కొన్నారు. నవంబర్ 12వ తేదీని దాని ప్రభావం మరింతగా ఉందని అభిప్రాయపడింది. అంతేకాకుండా థార్ ఎడారి నుంచి కొట్టుకొచ్చిన దుమ్ము ధూళి, వాహన కాలుష్యం, నిర్మాణ కాలుష్యం, టపాకాయల కాలుష్యం కూడా తీవ్రతకు కారణమయ్యాయని వెల్లడించారు.
డబ్ల్యూహెచ్‌వో ప్రమాణం కంటే 25 రెట్లు ఎక్కువ కాలుష్యం: భారతదేశ రాజధానిలోని సెన్సార్‌లు నవంబర్‌లో అనేక సందర్భాల్లో క్యూబిక్ మీటరుకు 400 మైక్రోగ్రాముల కంటే ఎక్కువగా PM 2.5 మరియు PM 10 స్థాయిని నమోదు చేశాయని, ఇది డబ్ల్యూహెచ్‌వో సిఫార్సు చేసిన క్యూబిక్ మీటరుకు 15 మైక్రోగ్రాముల కంటే ఎక్కువ అని నాసా తెలిపింది.
విషపూరిత గాలిక పాకిస్థాన్ కూడా కారణం: ఈ విషపూరిమైన కాలుష్యానికి పాకిస్థాన్ కూడా కారణమని నాసా గుర్తించింది. పాక్ నుంచి భారీగా వెలువడుతున్న పొగ కూడా ఈ కాలుష్యం పెరిగేందుకు కారణమని తెలిపింది. నవంబర్ 11న పొగ వల్ల కనీసం 22 మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారని నాసా మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ శాస్త్రవేత్త పవన్ గుప్తా తెలిపారు.
Smoke from crop fires in northern India blanketed Delhi and contributed to soaring levels of air pollution. https://t.co/Pe30imj6xV pic.twitter.com/RyNEmVcbXx
— NASA Earth (@NASAEarth) November 18, 2021