Delhi Police: అదిరిపోయే సమాధానం ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. పాక్ నటిని ట్విట్టర్‌లో ఆడుకుంటున్న నెటిజన్లు..
భారత ప్రధాని నరేంద్ర మోదీపై ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ పోలీసులను కోరుతూ పాకిస్థానీ నటి సహర్ షిన్వారీ చేసిన ట్వీట్‌కు అదిరిపోయే సమాధానం ఇచ్చారు ఢిల్లీ పోలీసులు.

ప్రధాని నరేంద్ర మోదీపై కంప్లైంట్ చేయాలంటున్నపాకిస్తాన్ నటి సహర్ షిన్వారీకి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు ఢిల్లీ పోలీసులు. ఢిల్లీ పోలీసుల ఆన్‌లైన్ లింక్ ఎవరికైనా తెలుసా? మా దేశంలో గందరగోళం, ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్న ప్రధాని మోదీ, RAWపై ఫిర్యాదు చేయాలి అంటూ ఆ నటి చేసిన ట్వీట్ చేసింది. అంతేకాదు ఇండియా కోర్టు ఖాళీగా ఉంటే నాకు సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందంటూ అందులో పేర్కొన్నారు. ఆమె ప్రశ్నకు అదిరిపోయే రిప్లై ఇచ్చారు ఢిల్లీ పోలీసులు. పాకిస్తాన్‌లో మాకు ఇంకా అధికార పరిధి లేదని మేము భయపడుతున్నాము.
కానీ.. మీ దేశంలో ఇంటర్నెట్ ఆపేసిన మీరు ఎలా ట్వీట్ చేస్తున్నారో తెలుసుకోవచ్చా అంటూ రిప్లై ఇచ్చారు. పాక్ నటికి అదిరిపోయే సమాధానం ఇచ్చిన ఢిల్లీ పోలీసులపై నెటిజన్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రసుత్తం ఈ రెండు ట్వీట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
దిమ్మతిరిగిపోయిందనుకుంటా..
షిన్వారీ ఈ ట్వీట్‌పై స్పందిస్తూ, పాకిస్తాన్‌లో తమకు అధికార పరిధి లేదని ఢిల్లీ పోలీసులు చెప్పారు. పాకిస్థాన్‌లో ఇప్పటికీ మాకు అధికార పరిధి లేదని ఢిల్లీ పోలీసులు ట్వీట్ చేశారు. దీనితో పాటు, మీ దేశంలో ఇంటర్నెట్ నిలిపివేయబడినప్పుడు.. మీరు ఎలా ట్వీట్ చేస్తున్నారు అంటూ ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు.
We are afraid we still do not have jurisdiction in Pakistan.
But, would like to know how come you are tweeting when the internet has been shut down in your country! https://t.co/lnUCf8tY59
— Delhi Police (@DelhiPolice) May 9, 2023
సహర్ ఈ ట్వీట్‌పై, చాలా మంది భారతీయ నెటిజన్లు ఆడుకోవడం మొదలు పెట్టారు. పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ మంగళవారం ఇస్లామాబాద్‌లో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఆయన అరెస్టు తర్వాత పాకిస్థాన్‌లో నిరసనలు మొదలయ్యాయి. దీంతో పాకిస్థాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా సోషల్ మీడియా, ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం