Karnataka Polls: పోలింగ్ బూత్‌లో గర్భిణికి ప్రసవం… ఓటేయగానే ఒడిలో మగబిడ్డ
కర్నాటక ఎన్నికల పోలింగ్ సమయంలో విస్మయానికి గురిచేసే సంఘటన జరిగింది. ఓటు వేసేందుకు వచ్చిన ఓ నిండు గర్భిణి పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో పోలింగ్ కేంద్రం వద్దనే ప్రసవమైన ఘటన ఉమ్మడి బళ్లారి జిల్లాలో జరిగింది.

ఉత్కంఠ రేపిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 224 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు ఎన్నికల అధికారులు. అధికారిక సమాచారం ప్రకారం.. సాయంత్రం 5 గంటల వరకు 66 శాతం పోలింగ్ నమోదయ్యింది. కాగా కర్నాటక ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో పోలింగ్ బూత్ వద్ద విస్మయానికి గురిచేసే సంఘటన జరిగింది. ఓటు వేసేందుకు వచ్చిన ఓ నిండు గర్భిణి పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో పోలింగ్ కేంద్రం వద్దనే ప్రసవమైన ఘటన ఉమ్మడి బళ్లారి జిల్లాలో జరిగింది.
కంప్లి నియోజకవర్గ పరిధిలోని కురుగోడు తాలూకాలో కొర్లగుంది గ్రామానికి చెందిన మణిలా అనే నిండు గర్భిణి బుధవారం ఓటు వేసేందుకు వచ్చి క్యూలో నిలబడింది. తన వంతు వచ్చాక ఓటు వేసి తిరిగి వెళ్తుండగా నాలుగడుగులు వేయగానే నొప్పులు ప్రారంభమయ్యాయి. దాంతో పోలింగ్‌ను కొంతసేపు నిలిపివేశారు అధికారులు. అక్కడే ఓ గదిలో కొందరు మహిళలు, మహిళా సిబ్బంది సాయంతో కొంతసేపటికే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తరువాత తల్లీబిడ్డను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు సమాచారం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




