Delhi: పెద్దోళ్లను దోచి.. పేదోళ్లకు పంచుతున్న ‘రాబిన్ హుడ్’ వసీం అరెస్ట్.. పోలీసులు అతడిని ఎలా పట్టారంటే..

ధనవంతుల దగ్గర దోచుకుని.. పేదవాళ్లకు పంచడం వంటి సీన్లు సినిమాల్లో మాత్రమే చూస్తాం.. ఇలాంటి సీన్లు చూసినప్పుడు.. అలా చేస్తే తప్పేం కాదులే అనుకుంటాం.. సేమ్ ఇలాంటి సీన్స్ ఢిల్లీలో గత కొద్ది నెలలుగా పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. చివరికి..

Delhi: పెద్దోళ్లను దోచి.. పేదోళ్లకు పంచుతున్న 'రాబిన్ హుడ్' వసీం అరెస్ట్.. పోలీసులు అతడిని ఎలా పట్టారంటే..
Delhi Police
Follow us
Amarnadh Daneti

|

Updated on: Aug 22, 2022 | 6:19 PM

Delhi: ధనవంతుల దగ్గర దోచుకుని.. పేదవాళ్లకు పంచడం వంటి సీన్లు సినిమాల్లో మాత్రమే చూస్తాం.. ఇలాంటి సీన్లు చూసినప్పుడు.. అలా చేస్తే తప్పేం కాదులే అనుకుంటాం.. సేమ్ ఇలాంటి సీన్స్ ఢిల్లీలో గత కొద్ది నెలలుగా పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. చివరికి పక్కా స్కెచ్ తో రాబిన్ హుడ్ ను పోలీసులు పట్టుకున్నారు. ఇంతకీ ఈ ఢిల్లీ రాబిన్ హుడ్ అసలు స్టోరీ ఎంటో తెలుసుకుందాం.. జస్ట్ అతడి వయస్సు 27 సంవత్సరాలు.. ఇప్పటివరకు 125కి పైగా క్రిమినల్ కేసులు.. 35 క్రిమినల్ కేసులో మోస్ట్ వాంటెడ్.. కాని ఢిల్లీలోని ఓ ప్రాంతం ప్రజలకు ఈ రాబిన్ హుడ్ ఓ హీరో లాంటోడు. ఎందుకనుకుంటున్నారా.. ఢిల్లీలోని జహంగీర్ పూరి ప్రాంతంలో రాబిన్ హుడ్ గా పేరొందిన వసీం అక్రమ్ అలియాస్ లంబూ.. చోరీలు చేయడానికి 25 మందితో ఓ గ్యాంగ్ ను ఏర్పాటుచేసుకున్నాడు. ఉదయం ఢిల్లీలోని ధనికుల ఇళ్లపై రెక్కీ నిర్వహించి.. రాత్రికి వారింట్లో చోరీ చేసి దోచుకోవడం ఈగ్యాంగ్ పని.. ఇలా దోచుకున్న సొమ్ములో కొంత భాగానని జహంగీర్ పూరి ప్రాంత వాసులకు పంచుతూ ఉండేవాడు. కొంత కాలంగా ఇలా చేయడంతో వసీం అక్రమ్ కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో అతడు చోరీలు చేయడాన్ని ఆప్రాంత ప్రజలు సమర్థించేవారు. దీంతో వసీం అక్రమ్ కు ఆప్రాంత ప్రజలు ఇన్ ఫార్మర్లుగా మారిపోయారు.

పోలీసులు వసీం అక్రమ్ ను ఎప్పుడు అరెస్ట్ చేద్దామన్నా.. పోలీసుల కదలికలను పసిగట్టి వసీం అక్రమ్ కు చెప్పడంతో అతడు అక్కడినుంచి తప్పించుకుని పారిపోయేవాడు. దీంతో కొద్దిరోజులుగా వసీం అక్రమ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఎప్పటికప్పుడు పోలీసుల ప్లాన్స్ ఫెయిల్ అవుతుండటంతో ఈసారి ఎలాగైనా పట్టుకోవాలని రాబిన్ హుడ్ కోసం పక్కా స్కెచ్ వేశారు. ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ కు సమీపంలో సహచరులను కలిసేందుకు వెళ్లగా.. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వసీం అక్రమ్ ను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో వసీం అక్రం వద్ద తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ ఓ సారి వసీం అక్రమ్ ను పట్టుకునేందుకు పోలీసులు సినిమా రేంజ్ లో ఛేజింగ్ చేసినా తృటిలో తప్పించుకున్నాడు. ఎట్టకేలకు పక్కా ప్లాన్ తో రాబిన్ హుడ్ వసీం ను పోలీసులు అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే