‘ మనుషుల్ని చంపేస్తారా ‘ ? ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు గరంగరం
ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అదుపు చేయలేక విఫలమవుతున్న రాష్ట్ర ప్రభుత్వాలపైన, అధికారులపైన సుప్రీంకోర్టు మండిపడింది. ఈ ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలు పోవడానికి వారి మానాన వారిని వదిలేస్తున్నాయని తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఈ కాలుష్యం కారణంగా పౌరులు తమ అమూల్యమైన జీవన కాలాన్ని కోల్పోతున్నారని, ఈ విధమైన వాతావరణంలో మనం బతకగలుగుతామా అని న్యాయమూర్తులు జస్టిస్ అరుణ్ మిశ్రా, దీపక్ గుప్తాలతో కూడిన బెంచ్ ప్రశ్నించింది. మనం బతకాలంటే ఇది సరైన మార్గం కాదు.. పంజాబ్, హర్యానా, పశ్చిమ […]
ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అదుపు చేయలేక విఫలమవుతున్న రాష్ట్ర ప్రభుత్వాలపైన, అధికారులపైన సుప్రీంకోర్టు మండిపడింది. ఈ ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలు పోవడానికి వారి మానాన వారిని వదిలేస్తున్నాయని తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఈ కాలుష్యం కారణంగా పౌరులు తమ అమూల్యమైన జీవన కాలాన్ని కోల్పోతున్నారని, ఈ విధమైన వాతావరణంలో మనం బతకగలుగుతామా అని న్యాయమూర్తులు జస్టిస్ అరుణ్ మిశ్రా, దీపక్ గుప్తాలతో కూడిన బెంచ్ ప్రశ్నించింది. మనం బతకాలంటే ఇది సరైన మార్గం కాదు.. పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ లలో రైతులు పంటలను తగులబెట్టడం ప్రతి ఏడాదీ ఆనవాయితీగా మారింది ‘ అని వీరు తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. తమలో సహనం నశించిందని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే ఈ నిర్వాకానికి బాధ్యత వహించాలని అన్నారు. ప్రతి సంవత్సరం ఢిల్లీ ఈ కాలుష్యం బారిన పడుతోందని, కానీ మనం ఏమీ చేయలేక నిస్సహాయంగా చేతులు ముడుచుకుని కూర్చున్నామని న్యాయమూర్తులు దాదాపు ఆవేదన వ్యక్తం చేశారు.’ ఈ నగరమే కాదు.. పంజాబ్, హర్యానా రాష్ట్రాలు కూడా ఈ పొల్యూషన్ కి గురవుతున్నాయి.. ఆయా ప్రభుత్వాలతో బాటు పంచాయతీలు కూడా ఇందుకు బాధ్యత వహించాల్సిందే అని కోర్టు ‘ తప్పు పట్టింది ‘.