AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీ కాలుష్యానికి విరుగుడు ఎలాగంటే ? 11 అంశాలతో ప్లాన్ రెడీ !

ఢిల్లీని ముంచెత్తుతున్న వాయు కాలుష్యాన్ని అదుపు చేసేందుకు అటు ప్రభుత్వం, ఇటు సుప్రీంకోర్టు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా అత్యున్నత న్యాయస్థానం ఏర్పాటు చేసిన ఎన్విరాన్ మెంట్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అథారిటీ… సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతోను, ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీతోను కలిసి ఓ ముసాయిదా ప్లాన్ ని సిద్ధం చేసింది. దీన్ని బుధవారం కోర్టుకు సమర్పించనుంది. నగరంలో కాలుష్యాన్ని 70 శాతం తగ్గించేందుకు, ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు 11 అంశాలతో ఈ […]

ఢిల్లీ కాలుష్యానికి విరుగుడు ఎలాగంటే ? 11 అంశాలతో ప్లాన్ రెడీ !
Anil kumar poka
| Edited By: |

Updated on: Nov 04, 2019 | 5:36 PM

Share

ఢిల్లీని ముంచెత్తుతున్న వాయు కాలుష్యాన్ని అదుపు చేసేందుకు అటు ప్రభుత్వం, ఇటు సుప్రీంకోర్టు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా అత్యున్నత న్యాయస్థానం ఏర్పాటు చేసిన ఎన్విరాన్ మెంట్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అథారిటీ… సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతోను, ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీతోను కలిసి ఓ ముసాయిదా ప్లాన్ ని సిద్ధం చేసింది. దీన్ని బుధవారం కోర్టుకు సమర్పించనుంది. నగరంలో కాలుష్యాన్ని 70 శాతం తగ్గించేందుకు, ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు 11 అంశాలతో ఈ ప్లాన్ ను రూపొందించారు.

దేశవ్యాప్తంగా ఒకే విధమైన ఎమిషన్ స్టాండర్డ్స్ ని పాటించడం, డీజిల్ తో నడిచే వాహనాల వాడకాన్ని తగ్గించడానికి అనువుగా వాటిపై పన్ను వేయాలన్న పాలసీని అమల్లోకి తేవడం, పార్కింగ్ చార్జీలను పెంచడం, లీగల్ పార్కింగ్ వంటివి వీటిలో ఉన్నాయి. సైక్లింగ్, పాదచారుల ట్రాక్ ల నెట్ వర్క్ ని వ్యాప్తి చేయాలని కూడా ఈ ముసాయిదా ప్లాన్ లో సూచించారు. అంటే సైకిళ్లను వినియోగించేవారికి, పాదచారులకు వీలుగా దారులను వెడల్పు చేయాలన్నదే ఈ సూచనలోని ఉద్దేశం. ప్రతిరోజూ ఢిల్లీలో 1400 కొత్త కార్లు వీధుల్లోకి వస్తుంటాయి. వీటితో బాటు ట్రక్కులు, బస్సులు, ఇతర వాహనాల ఇంధన కాలుష్య నియంత్రణకు సమగ్ర చర్యలు చేపట్టాలని, ఇందుకోసం మరో కమిటీని వేయాలని కూడా ప్రతిపాదించారు. డీజిల్ తో నడిచే వాహనాలకు, పెట్రోలుతో నడిచే వెహికల్స్ కు మధ్య ధరల గ్యాప్ తగ్గిపోవడం కూడా కాలుష్యానికి కారణమవుతోందని తేల్చారు. డీజిల్ వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయని, ఈ కారణంగా ప్రయివేటు డీజిల్ కార్లపై పన్ను వంటిది విధించాలని సూచించారు. పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల రైతులు తమ వ్యర్థ పంటలను కాల్చివేయడం వల్ల కూడా నగరంలో పొల్యూషన్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను సంప్రదించి.. ఆ రైతులపై జరిమానా విధించే విషయమై యోచించాలని మరికొందరు వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ నగరాన్ని ‘ గ్యాస్ చాంబర్ ‘ గా అభివర్ణించడం, సుప్రీంకోర్టు పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించడం చూస్తే ఢిల్లీ నగరం ఎంత కాలుష్య కోరల్లో నలిగిపోతోందో అర్థమవుతోందని అంటున్నారు. విద్యార్థులకు స్కూళ్ళు మూసివేయడంతో బాటు.. నగర ప్రజలకు పెద్ద ఎత్తున మాస్కులు పంపిణీ చేయడం కూడా పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

.

కొవ్వు కరగాల్సిందే.. కండరాలు పెంచాల్సిందే.. లేకపోతే మెదడు..
కొవ్వు కరగాల్సిందే.. కండరాలు పెంచాల్సిందే.. లేకపోతే మెదడు..
ఓలా, ఉబర్‌కు పోటీగా ఏపీ ప్రభుత్వం కొత్త యాప్.. తక్కువ ధరకే..
ఓలా, ఉబర్‌కు పోటీగా ఏపీ ప్రభుత్వం కొత్త యాప్.. తక్కువ ధరకే..
భయపెట్టే ఘోర యాక్సిడెంట్.. చూస్తే షాకే
భయపెట్టే ఘోర యాక్సిడెంట్.. చూస్తే షాకే
వరల్డ్ కప్ జట్టు నుంచి గిల్ అవుట్ వెనుక ఉన్న నమ్మలేని నిజాలివే
వరల్డ్ కప్ జట్టు నుంచి గిల్ అవుట్ వెనుక ఉన్న నమ్మలేని నిజాలివే
విన్నర్ అవ్వాల్సినోడు టాప్-3లోనూ లేకుండా..ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్
విన్నర్ అవ్వాల్సినోడు టాప్-3లోనూ లేకుండా..ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్
వామ్మో.. ఒక్క వారంలోనే రూ.16వేలు పెరిగిన వెండి.. అసలు కారణాలు..
వామ్మో.. ఒక్క వారంలోనే రూ.16వేలు పెరిగిన వెండి.. అసలు కారణాలు..
పొలంలోకి వెళ్లి కళ్లు తేలేసిన పోలీసులు.. వీడియో చూశారా
పొలంలోకి వెళ్లి కళ్లు తేలేసిన పోలీసులు.. వీడియో చూశారా
తెలంగాణలో మరో ఎన్నికలు.. త్వరలోనే షెడ్యూల్..!
తెలంగాణలో మరో ఎన్నికలు.. త్వరలోనే షెడ్యూల్..!
శ్రీలంక అమ్మాయిలకు వైజాగ్‎లో చుక్కలు చూపించడం పక్కా భయ్యా
శ్రీలంక అమ్మాయిలకు వైజాగ్‎లో చుక్కలు చూపించడం పక్కా భయ్యా
సిబిల్ స్కోర్ తక్కువుందా.. 500 నుంచి 750కి పెరగాలంటే ఇలా చేస్తే.
సిబిల్ స్కోర్ తక్కువుందా.. 500 నుంచి 750కి పెరగాలంటే ఇలా చేస్తే.