గీతాకాలనీ ఫ్లైఓవర్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య.. భయాందోళనలో స్థానికులు..
ఇది శత్రుత్వమేనా.. లేక దోపిడీ ఉద్దేశంతో హత్య చేశారా అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నివేదిక వచ్చిన తర్వాత మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు. ఈ ఘటన చుట్టుపక్కల ప్రజల్లో సంచలనం రేపింది.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. నగరంలోని గీతాకాలనీ ఫ్లైఓవర్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి శవమై కనిపించాడు. గీతాకాలనీ నుంచి రాజ్ ఘాట్ వెళ్లే రోడ్డుపై ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, హత్యకు గురైన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరుపుతున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనా స్థలంలో మృతదేహాన్ని గుర్తించారు. అతని ముఖం, తల, మెడపై పదునైన ఆయుధంతో దాడి చేసిన గుర్తులు ఉన్నాయి. ఫోరెన్సిక్ బృందాన్ని సంఘటనా స్థలానికి రప్పించారు. వారు సంఘటన స్థలం నుండి ఆధారాలు సేకరించారు. దీంతో పాటు సమీపంలోని వారిని కూడా విచారించారు. మృతదేహాన్ని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు.
పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. హత్య కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇది శత్రుత్వమేనా.. లేక దోపిడీ ఉద్దేశంతో హత్య చేశారా అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నివేదిక వచ్చిన తర్వాత మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు. ఈ ఘటన చుట్టుపక్కల ప్రజల్లో సంచలనం రేపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..