గ్రాండ్‌గా జూనియర్‌ దళపతి జన్మదిన వేడుకలు.. నచ్చిన కూరగాయలు తినిపించి సెలబ్రేషన్స్..!

తన పుట్టినరోజు నాడు తనకోసం వచ్చిన స్నేహితులను చూసి ఆ జూనియర్ దళపతి మురిసిపోయింది. అందరూ పెట్టిన ఫీడును తీసుకొని ఆనందంగా ఆరగించింది. తనకు బర్త్డే కోసమే ఇంత మంది వచ్చారన్న సంగతి గ్రహించకపోయినా.. ఒకేసారి ఇంతమంది రావడం డిఫరెంట్ అందించడంతో చలాకీగా అటు ఇటు తిరిగింది.

గ్రాండ్‌గా జూనియర్‌ దళపతి జన్మదిన వేడుకలు.. నచ్చిన కూరగాయలు తినిపించి సెలబ్రేషన్స్..!
Junior Dalapati
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Jyothi Gadda

Updated on: Nov 30, 2024 | 9:05 PM

బర్త్ డే అంటే ఎవరికైనా వెరీ వెరీ స్పెషల్… అందులోనూ కాస్త డిఫరెంట్ గా జరుపుకుంటే దానికదే వేరు.. తమకు తాము పుట్టినరోజు జరుపుకోవడం కామన్.. కానీ నీటిలో ఉన్న తమ స్నేహితుడికి బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం అంటే మామూలు విషయం కాదు కదా.. అదే జరిగింది విశాఖలో. హ్యాపీగా కేక్ కట్ చేయడమే కాదు… కూరగాయలు పండ్లు తినిపించి విషెస్ కూడా చెప్పారు.

ఇలాంటి అరుదైన ఘటన ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ లో చోటు చేసుకుంది. ఈ నీటిఏనుగు పేరు జూనియర్ దళపతి.. తనకు ఏడవ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా కేక్ కటింగ్ వేడుకంగా జరిగింది. హిప్పో కోసం కూరగాయలు, పండ్లుతో తయారుచేసిన ఫీడ్ ను అందచేశారు.

ఇవి కూడా చదవండి
Junior Dalapati

తన పుట్టినరోజు నాడు తనకోసం వచ్చిన స్నేహితులను చూసి ఆ జూనియర్ దళపతి మురిసిపోయింది. అందరూ పెట్టిన ఫీడును తీసుకొని ఆనందంగా ఆరగించింది. తనకు బర్త్డే కోసమే ఇంత మంది వచ్చారన్న సంగతి గ్రహించకపోయినా.. ఒకేసారి ఇంతమంది రావడం డిఫరెంట్ అందించడంతో చలాకీగా అటు ఇటు తిరిగింది. ఈ కార్యక్రమంలో క్యూరేటర్ మంగమ్మ తో పాటు జూ ఎడ్యుకేషన్ కి, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..