Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air Pollution: వాతావరణ కాలుష్యంలో ప్రపంచంలోనే ఢిల్లీ టాప్ ప్లేస్‌లో.. ఆందోళన కలిగిస్తున్న వాస్తవం!

దీపావళి తర్వాత మరింత దిగజారిన ఢిల్లీ వాతావరణ కాలుష్య పరిస్థితి ఇంకా తీవ్ర స్థాయిలోనే ఉంది. ఢిల్లీలో వాతావరణ కాలుష్యం ఎంత దారుణంగా ఉందంటే ప్రపంచంలోని 10 అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ ముందంజలో ఉంది. దీన్ని బట్టి పరిస్తితిలోని తీవ్రత అర్థం చేసుకోవచ్చు.

Air Pollution: వాతావరణ కాలుష్యంలో ప్రపంచంలోనే ఢిల్లీ టాప్ ప్లేస్‌లో.. ఆందోళన కలిగిస్తున్న వాస్తవం!
Delhi Pollution
Follow us
KVD Varma

|

Updated on: Nov 13, 2021 | 11:27 AM

Air Pollution: దీపావళి తర్వాత మరింత దిగజారిన ఢిల్లీ వాతావరణ కాలుష్య పరిస్థితి ఇంకా తీవ్ర స్థాయిలోనే ఉంది. ఢిల్లీలో వాతావరణ కాలుష్యం ఎంత దారుణంగా ఉందంటే ప్రపంచంలోని 10 అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ ముందంజలో ఉంది. దీన్ని బట్టి పరిస్తితిలోని తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ఈ జాబితాలో భారత్‌లోని ముంబై, కోల్‌కతా కూడా ఉన్నాయి. స్విట్జర్లాండ్‌కు చెందిన క్లైమేట్ గ్రూప్ ఐక్యూఎయిర్(IQAir) ఈ కొత్త జాబితాను విడుదల చేసింది. ఈ బృందం గాలి నాణ్యత, కాలుష్యాన్ని పర్యవేక్షిస్తుంది. ఈ బృందం ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమంలో సాంకేతిక భాగస్వామి. ఈ టాప్ 10 జాబితాలో పాకిస్థాన్‌లోని లాహోర్, చైనాలోని చెంగు నగరం కూడా ఉన్నాయి. ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం, పంజాబ్, హర్యానాలలో పొలాల్లో పంట చెత్తను కాల్చడం, ఢిల్లీలో వాహన కాలుష్యం ప్రధాన వాటాను కలిగి ఉన్నాయి.

ప్రపచంలో టాప్ 10 కాలుష్య నగరాలు ఇవే..

Top 10 Polluted Cities In World

Top 10 Polluted Cities In World

ఈరోజు (నవంబర్ 13, 2021) ఢిల్లీలో గాలి నాణ్యత స్థాయి (ఏక్యూఐ) 476గా ఉందని, ఇది తీవ్రమైన కేటగిరీలోకి వస్తుందని కాలుష్య బోర్డు హెచ్చరించింది . వచ్చే 48 గంటల పాటు గాలి నాణ్యత తీవ్రంగా ఉంటుందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) శుక్రవారం హెచ్చరించింది. రాష్ట్రాలు, స్థానిక సంస్థలు పాఠశాలలను మూసివేయడం, ప్రైవేట్ కార్లపై ‘బేసి-సరి’ విధానం అలాగే, అన్ని నిర్మాణాలను నిలిపివేయడం వంటి అత్యవసర చర్యలను అమలు చేయాలి.

ఉత్తరప్రదేశ్‌లోని ఐదు నగరాల AQI ఇలా ఉంది..

బులంద్‌షహర్, హాపూర్, నోయిడా, మీరట్, ఘజియాబాద్‌లలో 400 కంటే ఎక్కువ . నేడు ఈ ఐదు నగరాల్లో AQI 400 కంటే ఎక్కువగా ఉంది. బులంద్‌షహర్‌లో AQI స్థాయి 444. PM10 స్థాయి 568 మరియు PM 2.5 స్థాయి 417. లక్నోలో గాలి నాణ్యత దారుణంగా ఉంది. ఇక్కడ AQI 187, PM10 స్థాయి 187, PM 2.5 స్థాయి 125.

రాజస్థాన్‌లోని 17 జిల్లాల్లో 15 జిల్లాల్లో గాలి నాణ్యత రాజస్థాన్‌లోని గాలిలో కాలుష్య స్థాయి ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో ఉన్నంత ప్రమాదకరం కాదు. ఇక్కడ AQI 200 కంటే తక్కువ. జైపూర్, ఉదయపూర్, అజ్మీర్, పుష్కర్ సహా రాష్ట్రంలోని 15 జిల్లాల్లో గాలి నాణ్యత తక్కువగా ఉంది. రెండు జిల్లాల నాణ్యత ఆరోగ్యానికి ప్రమాదకరంగా ఉంది.

పెరిగిన PM2.5 స్థాయిల కారణంగా ఊపిరితిత్తుల నష్టం

పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చెబుతున్న దాని ప్రకారం, ఢిల్లీ గాలిలో ఊపిరితిత్తులకు హాని కలిగించే PM2.5 (చాలా సూక్ష్మమైన ధూళి కణాలు) స్థాయి అర్ధరాత్రి సమయంలో 300 మార్కును దాటింది. సాయంత్రం 4 గంటలకు క్యూబిక్ మీటరుకు 381 మైక్రోగ్రాములు. గాలి సురక్షితంగా ఉండాలంటే, PM2.5 స్థాయి క్యూబిక్ మీటరుకు 60 మైక్రోగ్రాములు ఉండాలి. ప్రస్తుతం, ఇది సురక్షిత పరిమితి కంటే దాదాపు 6 రెట్లు ఎక్కువ. PM2.5 చాలా చిన్నది, ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ మరియు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుంది.

ఇవి కూడా చదవండి: Zika Virus: పెరుగుతున్న జికా వైరస్ వ్యాప్తి.. గర్భిణీలు మరింత జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే..

Health with Ghee: మన ఆరోగ్యానికి ఏ నెయ్యి మంచిది? పసుపు నెయ్యి.. తెల్లని నెయ్యి మధ్య తేడాలేంటి?

CBSE Exams: సీబీఎస్‌ఈ..ఐసీఎస్ఈ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలి..సుప్రీంకోర్టులో పిటిషన్‌!