AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కిరాతకుడు.. ప్రియురాలిని చంపి ఆ శవంతో ఏం చేశాడంటే..?

లివ్ ఇన్ సంబంధాల చుట్టూ జరుగుతున్న నేరాలకు అద్దం పట్టే మరో దారుణం. ద్వారకలో ఒక వ్యక్తి తన లివ్ ఇన్ పార్ట్‌నర్‌ను డబ్బు విషయంలో గొడవపడి గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం మద్యం మత్తులో శవంతో కారులోనే నిద్రపోయాడు. పోలీసుల విచారణలో నిందితుడు కీలక విషయాలు తెలిపాడు.

కిరాతకుడు.. ప్రియురాలిని చంపి ఆ శవంతో ఏం చేశాడంటే..?
Man Kills Girlfriend In Delhi
Krishna S
|

Updated on: Nov 29, 2025 | 8:04 AM

Share

దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న లివ్ ఇన్ సంబంధాలు, వాటి చుట్టూ జరుగుతున్న నేరాలకు అద్దం పట్టే మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఢిల్లీలోని ద్వారక జిల్లాలో ఒక వ్యక్తి తన లివ్ ఇన్ పార్ట్‌నర్‌ను గొంతు కోసి హత్య చేసి, ఆ తర్వాత శవాన్ని పక్కనే పెట్టుకుని కారులోనే నిద్రపోయాడు. ఈ దారుణం చావ్లా ప్రాంతం దినాపూర్ ఎక్స్‌టెన్షన్ వద్ద జరిగింది. నిందితుడు 35 ఏళ్ల వీరేంద్ర సింగ్, మృతురాలు అదే ప్రాంతానికి చెందిన అతని లివ్ ఇన్ భాగస్వామి. ఒక కారులో మహిళ మృతదేహం ఉన్నట్లు పొరుగువారు చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కారు తలుపులు తెరిచి చూడగా, వెనుక సీటులో ఆ మహిళ మృతదేహం కనిపించింది. ఆమె ముఖంపై గాయాల గుర్తులు ఉండటంతో, అది హత్య అని నిర్ధారించారు.

మద్యం మత్తులో దారుణం

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి, నిందితుడు వీరేంద్ర సింగ్ కూడా అక్కడే ఉన్నాడు. సోమవారం రాత్రి వీరేంద్ర, మృతురాలి మధ్య పెద్ద గొడవ జరిగినట్లు తెలుస్తోంది. పోలీసుల దర్యాప్తులో వీరేంద్ర సింగ్ నేరాన్ని అంగీకరించాడు. మద్యం సేవించడం వల్ల ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, కోపంతో ఆమెను గొంతు కోసి చంపానని ఒప్పుకున్నాడు. హత్య చేసిన తర్వాత, మృతదేహాన్ని పారవేయాలని ప్రయత్నించాడు. అయితే నిందితుడు తీవ్రమైన మద్యం మత్తులో ఉండటం వలన, కారును కేవలం 100 మీటర్లు కూడా నడపలేకపోయాడు. దీంతో అతను మృతదేహాన్ని కారులోనే వదిలివేసి, మళ్లీ మద్యం సేవించి అక్కడే నిద్రపోయాడు.

హత్యకు కారణం: రూ.21 లక్షల డబ్బు

పోలీసుల దర్యాప్తులో హత్యకు ప్రధాన కారణం డబ్బు వ్యవహారమే అని తేలింది. మృతురాలు, వీరేంద్ర ఇటీవల రాజ్‌నగర్‌లో ఒక ఇంటిని అమ్మేవేశారు. దీని తరువాత, వీరేంద్ర తన పేరు మీద దిన్‌పూర్‌లో కొత్త ఫ్లాట్‌ను కొనుగోలు చేశాడు. అయితే మిగిలిన రూ.21 లక్షల నగదు వీరేంద్ర వద్దే ఉంది. ఈ డబ్బు విషయంలోనే ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. చావ్లా పోలీసులు వివాదానికి కారణమైన ఈ రూ.21 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..