Liquor Shops: మద్యం ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. అక్టోబర్ 1 నుంచి 260 వైన్స్ షాపుల మూసివేత.. ఎక్కడ అంటే..
Liquor Shops: ప్రభుత్వాలకు అధిక ఆదాయం వచ్చేది ఎక్సైజ్ శాఖ ద్వారానే. ఇక కొత్త మద్యం పాలసీలు రాబోతున్నాయి. రాబోయే కొత్త మద్యం పాలసీ ప్రకారం....

Liquor Shops: ప్రభుత్వాలకు అధిక ఆదాయం వచ్చేది ఎక్సైజ్ శాఖ ద్వారానే. ఇక కొత్త మద్యం పాలసీలు రాబోతున్నాయి. రాబోయే కొత్త మద్యం పాలసీ ప్రకారం.. దేశంలోని పలు రాష్ట్రాల్లో వైన్స్ షాపుల సంఖ్య పెరగనున్నాయి. మద్యం షాపుల ద్వారా ఎంతో ఆదాయం సమకూర్చుకుంటోంది. ఇక ఢిల్లీలో కొత్త మద్యం పాలసీ తీసుకురానుంది ప్రభుత్వం. ఢిల్లీలో అక్టోబర్ 1వ తేదీ నవంబర్ 16 వరకు ప్రైవేటు మద్యం షాపులను మూసివేయనుంది ఢిల్లీ సర్కార్. దీంతో 47 రోజుల పాటు ప్రభుత్వ మద్యం దుకాణాలలో మాత్రమే మద్యం విక్రయించబడుతుందని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇటీవల వెల్లడించారు. కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం.. ఢిల్లీని 32 జోన్లుగా విభజించడం ద్వారా లైసెన్సుల కేటాయింపు ప్రక్రియ పూర్తయిందని పేర్కొన్నారు.
నవంబర్ 17 నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ కింద షాపులు..
కాగా, మద్యం షాపులను మూసివేస్తున్నట్లు ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం.. ఇప్పుడు కొత్త ఎక్సైజ్ పాలసీ కింద నవంబర్ 17 నుండి షాపులు ఓపెన్ అవుతాయని, ఈ సమయంలో అక్టోబర్ 1 నుంచి ప్రైవేటు మద్యం షాపులను మూసివేయనున్నట్లు వెల్లడించారు. కొత్త మద్యం పాలసీ అనంతరం నవంబర్ 17 నుంచి షాపులన్నీ తెరవనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
మొత్తం 720కిపైగా మద్యం షాపులు..
కాగా, ఢిల్లీలో ప్రస్తుతం 720కి పైగా మద్యం షాపులు ఉన్నాయి. అందులో ప్రైవేటు మద్యం షాపులు 260, ప్రభుత్వ మద్యం షాపులు 460 ఉన్నాయి. ఇక నూతన ఎక్సైజ్ పాలసీ నేపథ్యంలో ప్రైవేటు మద్యం షాపుల లైసెన్స్‌లను పొడిగించింది ప్రభుత్వం. సెప్టెంబర్ 30 తర్వాత లైసెన్స్‌లను జారీ చేయదు. ఈ కారణంగా అక్టోబర్ 1 నుండి మొత్తం 260 మద్యం దుకాణాలు మూసివేయబడతాయని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అన్నారు. ఇక కొత్త ఎక్సైజ్ పాలసీ కింద జారీ చేయబడిన లైసెన్సులు నవంబర్ 17 తెరవనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రైవేటు మద్యం దుకాణాల మూసివేతతో 47 రోజుల పాటు ఢిల్లీలోని ప్రభుత్వ దుకాణాలలో మాత్రమే మద్యం విక్రయించబడుతుంది.
ఖజానాకు రూ.3 వేల కోట్ల ఆదాయం:
కరోనా మహమ్మారితో తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు మద్యంతో ఊపునిచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. నూతన ఎక్సైజ్ విధానంతో రాష్ట్ర ప్రభుత్వం రానున్న 12 నెలల్లో రూ 3000 కోట్ల అదనపు ఆదాయం ఆర్జిస్తుందని మనీష్ సిసోడియా తెలిపారు.
మద్యం దుకాణాల వేలం ద్వారా రూ.10 వేల కోట్ల రాబడి:
ఢిల్లీ నగరంలోని 32 జోన్లలో మద్యం దుకాణాల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ 10,000 కోట్ల రాబడి సమకూరుతుందని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ వ్యాప్తితో గత ఏడాది ఢిల్లీ ప్రభుత్వం రాబడిలో 41 శాతం తగ్గుదల నమోదైందని అన్నారు. ఇక ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలోనూ రాబడిలో 23 శాతం తగ్గిందని చెప్పారు.
మద్యం అమ్మకాలలో మార్పులు..
ఇక మద్యం షాపులకు కనీసం 500 చదరపు మీటర్ల స్థలం అవసరమని ఢిల్లీ మంత్రి తెలిపారు. ఇక నుంచి కౌంటర్ షాపు పక్కన ఉండకుండా మద్యం షాపులోనే ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కస్టమర్లు మద్యం షాపు కోసం చేతులు లోపల పెట్టి తీసుకోకుండా నేరుగా దుకాణం లోపలికి వచ్చి స్వయంగా మద్యం తీసుకోవచ్చన్నారు. షాపుల వద్ద మరిన్ని సీసీటీవీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.