Punjab Politics: కాస్త మెత్తబడ్డ నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. పీసీసీ చీఫ్ రాజీనామాపై పునరాలోచన!

Navjot Singh Sidhu: పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ కాస్త మెత్తబడుతున్నాడు. పీసీసీ చీఫ్ పదవికి చేసిన రాజీనామాపై పునరాలోచన చేస్తానని తెలిపాడు సిద్దూ.

Punjab Politics: కాస్త మెత్తబడ్డ నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. పీసీసీ చీఫ్ రాజీనామాపై పునరాలోచన!
Navjot Sidhu And Charanjit Singh Channi
Follow us

|

Updated on: Sep 30, 2021 | 7:00 PM

Navjot Singh Sidhu: పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ కాస్త మెత్తబడుతున్నాడు. పీసీసీ చీఫ్ పదవికి చేసిన రాజీనామాపై పునరాలోచన చేస్తానని తెలిపాడు సిద్దూ. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌సింగ్‌ చన్నీతో సమావేశం తరువాత ఇద్దరి మధ్య రాజీ కుదిరినట్లు సమాచారం. సిద్దూ లేవనెత్తిన చాలా డిమాండ్లకు సీఎం చన్నీ అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో సిద్ధూ కాస్త వెనక్కు తగ్గినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, అక్టోబర్‌ 4న జరిగే పంజాబ్‌ కేబినెట్‌ సమావేశం తరువాత సిద్దూ డిమాండ్లపై సీఎం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లను పదవులను నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు నవజ్యోత్ సింగ్ సిద్దూ.

సిద్దూ డిమాండ్లకు అనుగుణంగా పంజాబ్‌ డీజీపీతో పాటు ఆ రాష్ట్ర ప్రస్తుతఅడ్వొకేట్‌ జనరల్‌ను కూడా మార్చే అవకాశాలున్నాయి. పంజాబ్ పోలీసు చీఫ్‌గా ఇక్బాల్ ప్రీత్ సింగ్ సహోటాను తొలగించవచ్చు. అతను 2015 లో జరిగిన ఘటనకు సంబంధించి అకాలీదళ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి అధిపతిగా ఉన్నాడు. అంతేకాదు గురు గ్రంథ్ సాహిబ్‌ను అవమానించడాన్ని నిరసిస్తున్న వారిపై పోలీసు కాల్పుల ఘటనకు ప్రధాన కారకుడని సిద్ధూ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనను తొలగించాలని సిద్ధూ పట్టుబడతున్నారు. అయితే, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను కూడా పదవుల నుంచి తొలగిస్తారా? లేదా? అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

మరోవైపు కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేసిన పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్‌సింగ్‌ ఢిల్లీ పర్యటన ముగిసింది. కాంగ్రెస్‌లో ఉండేది లేదని , బీజేపీలో చేరడం లేదని కీలక ప్రకటన చేశారు కెప్టెన్‌. త్వరలో జాతీయత చాటే కొత్త పార్టీ పెట్టే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా , జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌తో ఢిల్లీలో భేటీ అయ్యారు అమరీందర్‌. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయి. Read Also…  Pawan Kalyan vs YSRCP: టీడీపీ – జనసేన కలిసే ఉన్నాయి.. పవన్ కల్యాణ్‌పై మంత్రి మేకతోటి విమర్శలు