TV9 India Festival 2025: టీవీ9 ఇండియా ఫెస్టివల్ 4వ రోజు.. దుర్గా పూజకు హాజరైన ఢిల్లీ సీఎం రేఖా గుప్త
ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో శారదీయ నవరాత్రి సందర్భంగా టీవీ9 ఇండియా ఫెస్టివల్ మూడవ సీజన్ ఘనంగా జరుగుతుంది. మొత్తం 5 రోజులపాటు జరిగే ఈ వేడుకలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. బుధవారం (అక్టోబర్ 1) జరిగిన TV9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా పూజా..

ఢిల్లీ, అక్టోబర్ 1: దేశ రాజధాని ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో శారదీయ నవరాత్రి కార్యక్రమవాలు జరుగుతున్నాయి. టీవీ9 నెట్‌వర్క్ చొరవతో ఇండియా ఫెస్టివల్ మూడవ సీజన్ ఘనంగా జరుగుతుంది. మొత్తం 5 రోజులపాటు జరిగే ఈ వేడుకలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. బుధవారం (అక్టోబర్ 1) జరిగిన TV9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా పూజా కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా హాజరయ్యారు. దుర్గా పూజ పండల్ వద్ద జరిగిన పూజలో ఆమె పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
కాగా TV9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 28న జరిగిన మొదటి రోజు కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ సింగర్ ద్వయం సచేత్, పరంప అద్భుతమైన గానాలాపనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. గాన కచేరీ ఎంతో ఆహ్లాదకరంగా జరిగింది. దుర్గాదేవి పూజతో పాటు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవానికి ప్రవేశం పూర్తిగా ఉచితం. మరోవైపు రుచికరమైన ఫుడ్ స్టాల్స్, షాపింగ్, ధునుచి నృత్యం జనాలను అలరించాయి. ఈ ఫెస్టివల్‌ను చూడటానికి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంకు తరలివస్తున్నారు.
నాల్గవ రోజు దాండియా ఆడనున్నారు. దీనితోపాటు పలు లైవ్ కచేరీలు జరగనున్నాయి. ఇక ఐదవ రోజులో టీవీ9 ఇండియా ఫెస్టివల్ ముగియనుంది. చివరి రోజు కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు షాన్ ప్రదర్శన ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




