ఈ రాష్ట్రాల్లో నీటి కటకట.. దాహం తీరక విలవిలలాడుతున్న జనం..
ఇప్పుడు మీరు చూడబోయే దృశ్యాలు ఏ ఆఫ్రికా దేశానికి సంబంధించినవో కాదు.. మన దేశ రాజధాని ఢిల్లీలో కనిపిస్తున్న సీన్లు. ఔను.. ఢిల్లీలో నీటి కొరత పీక్స్‌కు చేరింది. అన్ని ప్రాంతాల్లో నీటికోసం జనం అవస్థలు పడుతున్నారు. రికార్డుస్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో భూగర్భజలాలు ఎండిపోయి నీటికొరత పెరిగింది. అప్రమత్తమైన ప్రభుత్వం నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తోంది.
ఇప్పుడు మీరు చూడబోయే దృశ్యాలు ఏ ఆఫ్రికా దేశానికి సంబంధించినవో కాదు.. మన దేశ రాజధాని ఢిల్లీలో కనిపిస్తున్న సీన్లు. ఔను.. ఢిల్లీలో నీటి కొరత పీక్స్‌కు చేరింది. అన్ని ప్రాంతాల్లో నీటికోసం జనం అవస్థలు పడుతున్నారు. రికార్డుస్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో భూగర్భజలాలు ఎండిపోయి నీటికొరత పెరిగింది. అప్రమత్తమైన ప్రభుత్వం నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తోంది. రెండు బకెట్ల నీటిని పట్టుకునేందుకు జనం రోడ్లపై బారులు తీరాల్సిన దుస్థితి ఏర్పడింది. ఐతే ఈ ఎమర్జెన్సీ పరిస్థితికి పెరిగిన ఉష్ణోగ్రతలు ఒక కారణమైతే, హర్యానా ప్రభుత్వం నీటిని విడుదల చేయకపోవటం మరొక కారణమన్నారు మంత్రి అతిశీ.
మరోవైపు ఆప్ సర్కార్ అదనపు నీటి సరఫరా కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల నుండి అదనపు నీరు అందించాలని కోరింది. ఢిల్లీలో నీటి కొరతకు బీజేపీనే కారణమని ఆరోపించారు కేజ్రీవాల్. అటు ఢిల్లీలో నీటి కొరతపై బీజేపీ కూడా ఆందోళనకు దిగింది. ఆప్ సర్కారు కావాలనే కృత్రిమ నీటి కొరత సృష్టిస్తోందని ఆరోపించారు బీజేపీ నేత వీరేంద్ర సచ్‌దేవ. కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. వెంటనే పరిస్థితిని సరిచేయాలని డిమాండ్ చేశారు.
అటు రాజస్థాన్‌లో ఇదే పరిస్థితి నెలకొంది. రాజస్థాన్‌లోనూ నీటి కొరతతో అక్కడి ప్రజలు గుక్కెడు నీటి కోసం గంటలపాటు ఎదురుచూడాల్సి వస్తోంది. నీళ్ల ట్యాంకర్ల దగ్గర బిందెడు నీటి కోసం మండుటెండల్లో పడిగాపులు కాస్తున్నారు మహిళలు. కానీ నీటి ట్యాంకర్లు మాత్రం అన్ని ప్రాంతాలకూ సరఫరా చేయకుండానే తిరిగి వెళ్లిపోతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..