Health insurance: ఆరోగ్య బీమా క్లెయిమ్‌ తో సమస్యలా.? త్వరలో ప్రభుత్వ పోర్టల్‌..

ఆరోగ్య బీమా క్లెయిమ్‌ సెటిల్‌మెంట్లను మరింత వేగవంతం చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో జరుగుతున్న జాప్యాన్ని తగ్గించేందుకు కొత్త పోర్టల్‌కు శ్రీకారం చుట్టనుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నేషనల్‌ క్లెయిమ్‌ ఎక్స్ఛేంజ్ పోర్టల్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. బీమా కంపెనీలు, ఆసుపత్రులు, పాలసీదారులకు మధ్య ఇది ఉమ్మడి వేదికగా ఉండనుంది. బీమా రంగంలోనే ఇదొక కీలక మలుపుగా మారనుంది.

Health insurance: ఆరోగ్య బీమా క్లెయిమ్‌ తో సమస్యలా.? త్వరలో ప్రభుత్వ పోర్టల్‌..

|

Updated on: May 30, 2024 | 10:40 PM

ఆరోగ్య బీమా క్లెయిమ్‌ సెటిల్‌మెంట్లను మరింత వేగవంతం చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో జరుగుతున్న జాప్యాన్ని తగ్గించేందుకు కొత్త పోర్టల్‌కు శ్రీకారం చుట్టనుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నేషనల్‌ క్లెయిమ్‌ ఎక్స్ఛేంజ్ పోర్టల్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. బీమా కంపెనీలు, ఆసుపత్రులు, పాలసీదారులకు మధ్య ఇది ఉమ్మడి వేదికగా ఉండనుంది. బీమా రంగంలోనే ఇదొక కీలక మలుపుగా మారనుంది. నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ కింద ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నంలో భాగంగా కొత్త పోర్టల్‌ను తీసుకురానున్నారు. దీంతో ఆరోగ్య బీమా క్లెయిమ్‌ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. రానున్న రెండు లేదా మూడు నెలల్లో దేశమంతంటా ఈ పోర్టల్‌ సేవలు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం . దీని కోసం ప్రభుత్వం ఇప్పటికే 50 బీమా కంపెనీలు, 250 ఆసుపత్రులను అనుసంధానించింది. క్రమంగా మరిన్ని ఆసుపత్రులు, బీమా ప్రొవైడర్లనూ ఇందులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టాటా AIG జనరల్ ఇన్సూరెన్స్, పారామౌంట్ TPA, బజాజ్ అలయన్జ్ ఇన్సూరెన్స్ వంటి అనేక ప్రముఖ కంపెనీలు పోర్టల్‌తో అనుసంధానాన్ని పూర్తి చేశాయి. ప్రస్తుతం దేశంలో ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్ ప్రక్రియ ప్రధానంగా మాన్యువల్ విధానాలపై ఆధారపడి ఉంది. దీంతో జాప్యం జరుగుతోంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకే కేంద్రం ఈ కొత్త పోర్టల్‌ను తీసుకువస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us