Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharath Agniban: ఇస్రో ఖాతాలో మరో ఘనత.. నింగిలోకి దూసుకెళ్లిన ప్రైవేట్ రాకెట్ ‘అగ్నిబాణ్‌’

ఇస్రో మరో ఘనత సాధించింది. దేశంలోనే తొలిసారి అగ్నిబాణ్‌ అనే ఓ ప్రైవేట్ రాకెట్‌ను విజయవంతంగా నింగిలోకి ప్రయోగించింది. ఇంతకీ.. అగ్నిబాణ్‌ ప్రైవేట్‌ రాకెట్‌ స్పెషల్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Bharath Agniban: ఇస్రో ఖాతాలో మరో ఘనత.. నింగిలోకి దూసుకెళ్లిన ప్రైవేట్ రాకెట్ 'అగ్నిబాణ్‌'
Bharath Agniban
Follow us
Balaraju Goud

|

Updated on: May 31, 2024 | 7:06 AM

ఇస్రో మరో ఘనత సాధించింది. దేశంలోనే తొలిసారి అగ్నిబాణ్‌ అనే ఓ ప్రైవేట్ రాకెట్‌ను విజయవంతంగా నింగిలోకి ప్రయోగించింది. ఇంతకీ.. అగ్నిబాణ్‌ ప్రైవేట్‌ రాకెట్‌ స్పెషల్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో భవిష్యత్‌లో ప్రైవేటు సంస్థల ద్వారా రాకెట్ ప్రయోగాలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది. దానిలో భాగంగా.. చెన్నై ఐఐటీ స్టూడెంట్స్ సారథ్యంలో అగ్నికుల్ అనే ఓ ప్రైవేటు సంస్థ ద్వారా అగ్నిబాణ్‌ రాకెట్‌ను విజయవంతంగా నింగిలోకి పంపింది. తిరుపతి జిల్లాలోని సతీష్ దావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోటలో గురువారం ఉదయం 7గంటల 15 నిమిషాలకు అగ్నిబాన్‌ రాకెట్‌ను శాస్త్రవేత్తలు సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించినట్లు ఇస్రో ప్రకటించింది.

ఇస్రోలో తొలిసారి సబ్‌-ఆర్బిటాల్‌ టెక్నాలజీ డెమానిస్ట్రేటర్‌ ప్రయోగాన్ని నిర్వహించారు. చెన్నైకు చెందిన అగ్నికుల్ కాస్కోస్ స్టార్టప్ సంస్థ.. భూమికి 700 కిలోమీటర్ల ఎత్తులోని భూ కక్ష్య 300 కిలోలలోపు ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేందుకు ఈ ప్రయోగం చేపట్టింది. అగ్నికుల్ కాస్మోస్ సంస్థ.. ఇస్రోతో ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో ఈ రాకెట్‌ను రూపొందించారు. వాస్తవానికి.. ఈ ప్రయోగం ఈ నెల 6న జరగాల్సి ఉన్నప్పటికీ.. సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. చివరికి.. తాజాగా విజయవంతం కావడంతో అగ్నికుల్ సంస్థ యాజమాన్యంతోపాటు శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ ప్రయోగం సక్సెస్‌ కావడంతో ప్రపంచ అంతరిక్ష మార్కెట్లను ఒడిసిపట్టేలా మరో కీలక ముందడుగు పడినట్లయింది. ఈ ప్రైవేట్ రాకెట్ ప్రయోగం దాదాపు 2 నిమిషాల పాటు సింగిల్ స్టేజ్‌లోనే జరిగింది. ప్రపంచంలోనే తొలిసారి తయారు చేసిన సింగిల్ పీస్ త్రీడీ ప్రింటెడ్ సెమీ క్రయోజనిక్ ఇంజిన్‌ను అమర్చారు. దీనిపై అగ్నికుల్ కాస్మోస్‌కు పేటెంట్ ఉండగా.. సబ్ కూల్డ్ ద్రవ ఆక్సిజన్ ఆధారంగా ఒక స్టేజిలోనే పనిచేసింది. ఈ వ్యవస్థను పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేశారు. దీర్ఘ వృత్తాకార ముక్కుతో ఉన్న ఈ రాకెట్ పొడవు 6.2 మీటర్లు కాగా.. దీని లోపలే ఉపగ్రహాన్ని అమర్చారు. ఈ రాకెట్‌లో తొలిసారి ఐథర్‌నెట్ ఆధారంగా పని చేసే ఏవియానిక్స్ వ్యవస్థను ఉపయోగించారు. పూర్తి దేశీయంగా అభివృద్ధి చేసిన ఆటో పైలెట్ కంట్రోల్ సిస్టమ్‌ను ఈ రాకెట్‌లో పూర్తిగా వినియోగించారు. ఇక.. ఈ ప్రయోగ ప్రక్రియను షార్‌లో పర్యవేక్షించిన ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్.. అగ్నికుల్‌ కాస్మోస్‌ సంస్థను అభినందించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…