Delhi Air Crisis: ‘కాలుష్య నివారణలో ‘సరి-బేసి’ విధానం అంత ప్రభావవంతంగా పనిచేస్తుందని మేం అనుకోవట్లేదు’ సుప్రీంకోర్టు
ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు తామే బాధ్యులని, అందులోకి కోర్టును లాగొద్దని, అలాంటి ప్రయత్నం చేయవద్దని ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు శుక్రవారం (నవంబర్ 10) సూచించింది. ఈ సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేసింది. తాము పదేపదే జోక్యం చేసుకుంటేనే వేగం వస్తుందా..? అంటూ మందలించింది. దేశ రాజధానిలో ‘సరి-బేసి’ కార్ల పథకాన్ని తీసుకురావాలనే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని, దానిపై కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయదని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీలో గాలి నాణ్యత..

న్యూఢిల్లీ, నవంబర్ 10: ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు తామే బాధ్యులని, అందులోకి కోర్టును లాగొద్దని, అలాంటి ప్రయత్నం చేయవద్దని ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు శుక్రవారం (నవంబర్ 10) సూచించింది. ఈ సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేసింది. తాము పదేపదే జోక్యం చేసుకుంటేనే వేగం వస్తుందా..? అంటూ మందలించింది. దేశ రాజధానిలో ‘సరి-బేసి’ కార్ల పథకాన్ని తీసుకురావాలనే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని, దానిపై కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయదని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీలో గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉండటంపై నమోదైన కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు అభిప్రాయపడింది. బేసి-సరి స్కీమ్‌తో కోర్టుకు ఎలాంటి సంబంధం లేదని, పొరుగు రాష్ట్రాల ప్రజలు ఢిల్లీకి రాకుండా నిరోధించమని కోర్టు ఎప్పుడూ చెప్పలేదని పేర్కొంది.
నవంబర్ 7న ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వాయు కాలుష్యంపై విచారణ సమయంలో సరి-బేసి పథకం ప్రభావాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఢిల్లీ వాయు కాలుష్యంపై పర్యావరణవేత్త ఎంసీ మెహతా వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. మెహతా పిటిషన్‌పై విచారణ సందర్భంగా కాలుష్యానికి సంబంధించిన అనేక సమస్యలు తలెత్తాయి. న్యాయస్థానం గత విచారణలో సరి-బేసి అంశాన్ని లేవనెత్తిందని, దీనికి ముందు అమికస్ క్యూరీగా కోర్టుకు సహకరిస్తుందని అన్నారు. అయితే వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో బేసి-సరి పథకం సహాయం చేయలేదని ప్రభుత్వ న్యాయవాది అన్నారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చే ట్యాక్సీలను ఢిల్లీలోకి అనుమతించరాదని, లేకుంటే ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారుతుందని ఢిల్లీ ప్రభుత్వం తరపు న్యాయవాది అన్నారు. జస్టిస్ కౌల్ సమాధానం ఇస్తూ.. ఢిల్లీలో పనిచేస్తున్న లక్షల మంది ప్రజలు ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా, హర్యానాలోని గురుగ్రామ్ వంటి నగరాల్లో నివసిస్తున్నారు. మేం ఎప్పుడూ ఇలా చెప్పలేం. ఈ విషయంలో కోర్టుపై భారం మోపేందుకు ప్రయత్నించవద్దు’ అని బెంచ్ కోరింది.
ఈ సరి-బేసి పథకం ప్రయోజనకరం కాదని అమికస్ క్యూరీ చెప్పారు. అది సహాయం చేయలేదన్నారు. అయితే ట్యాక్సీలకు కూడా సరి-బేసిని అమలు చేస్తామని మీరు ఇప్పుడు చెప్పారు. ట్యాక్సీలలో సరి-బేసిని అమలు చేయమని మేము మిమ్మల్ని అడగలేదు. కాలుష్యాన్ని తగ్గించడంలో బేసి-సరి పథకం అంత ప్రభావవంతంగా లేదని, అయితే అది కాస్త ప్రభావవంతంగా ఉంటేనే అది లెక్కించబడుతుందని అమికస్ క్యూరీ వాదించారు. బెంచ్ కలుగజేసుకుంటూ.. ‘కాలుష్యానికి ప్రధాన కారణం రోడ్లపై వాహనాలు అధికంగా ఉండడమేనని, వీటిని తగ్గించడంలో సరి-బేసి దోహదపడుతుందని మేం అనుకోవడం లేదు. ఏం చేయాలో అది చేయండి. ఏం చేయాలో చెప్పడానికి మేము ఇక్కడ కూర్చోవడం లేదు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని’ అని ధర్మాసనం తెలిపింది. పరిస్థితిని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తోందని ఢిల్లీ ప్రభుత్వ న్యాయవాది అన్నారు.
కాగా దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో దీపావళి మరుసటి రోజు నవంబర్ 13 నుంచి నవంబర్ 20 వరకు సరి-బేసి పథకాన్ని అమలు చేస్తామని ఢిల్లీ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ కీలక ప్రకటన చేశారు. గాలి నాణ్యతలో మెరుగుదల కనిపిస్తోంది. 450కి మించి ఉన్న వాయు కాలుష్యం 300కి పడిపోయింది. దాంతో నవంబర్ 13 నుంచి అమలు చేయాలనుకున్న సరి-బేసి విధానాన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నామన్నారు. దీపావళి తర్వాత మరోసారి సమీక్ష జరుపుతామన్నారు. ఈ విధానం అమలు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు, ఢిల్లీ ప్రభుత్వానికే వదిలేసినట్లు గతంలో ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.