Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali 2023: భారత్‌ ఆత్మనిర్భర్‌ స్ట్రోక్‌తో చైనా గిలగిల.. బ్యాన్‌బాజాతో లక్ష కోట్ల నష్టం..

CAIT ఆత్మనిర్బర్‌ నిర్ణయం చైనా ఆర్ధిక వ్యవస్థకు పొగ పెట్టింది. మేడిన్‌ చైనా టపాసుల దిగుమతిపై బ్యాన్‌ విధించింది. దీంతో చైనాకు 50వేల కోట్ల నష్టం అనేది ప్రాథమిక అంచనా. టపాసులు సహా మిగతా వస్తువలను కలిపిచూస్తే చైనాకు ఎటూ లేదన్న లక్ష కోట్ల బిగ్‌ లాస్‌. అదీ ఆత్మనిర్భర్‌ భారత్‌ స్ట్రోక్‌. దీపావళికి నరకాసుర వధ.. కానీ, అంతకన్నా ముందే బాణాసంచా మార్కెట్‌లో చైనాసర వధ జరిగిందన్న మాట.

Diwali 2023: భారత్‌ ఆత్మనిర్భర్‌ స్ట్రోక్‌తో చైనా గిలగిల.. బ్యాన్‌బాజాతో లక్ష కోట్ల నష్టం..
Diwali
Follow us
Venkata Chari

|

Updated on: Nov 10, 2023 | 7:39 PM

Diwali Crackers: బోర్డర్‌లో గిల్లి కజ్జాలకు దిగుతోన్న చైనాకు ది గ్రేట్‌ భారత్‌ షాక్‌ల మీద షాక్‌లనిస్తోంది. ఆత్మనిర్బర్‌ భారత్‌లో భాగంగా ఇప్పటికే చైనా యాప్‌లపై మోదీ సర్కార్‌ ఉక్కుపాదం మోపింది. బెట్టింగ్‌ యాప్‌లు.. లోన్‌ యాప్‌లు వెరిసి 232 చైనా యాప్‌లపై భారత్‌ సర్కార్‌ బ్యాన్‌ విధించింది. ఈజీ లోన్‌ పేరిట సామాన్యుల జీవితాలతో చెలగాటమే కాకుండా భారత ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేందుకు చైనా పన్నిన కుట్రలకు చెక్‌ పెట్టింది భారత్‌. తాజాగా చైనాకు మరో బిగ్‌ షాక్‌.. మేడిన్‌ చైనా టపాసులపై బ్యాన్‌బాజా.. చైనాకు 50వేల కోట్ల నష్టం వాటిల్లింది.

భారత్‌లో పండుగ సీజన్‌ వచ్చిందంటే చైనా కంపెనీలకు పండుగే పండుగ. తీరక్కొ బొమ్మలను భారత్‌ మార్కెట్‌లోకి డంప్‌చేసి బాగా సొమ్ముచేసుకునేవి చైనా కంపెనీలు. రావొచ్చు.. పోవచ్చు.. బొమ్మలు అమ్ముకోవచ్చు అని ఫ్రెండ్లీగా ఆదరిస్తే.. భారత్‌ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలనే కుట్ర పన్నింది లత్కోర్‌ చైనా. సరిహద్దు వివాదాల క్రమంలో ఆత్మనిర్బర్‌ అంటూ గర్జించిన భారత్‌.. కీలెరిగి చైనాకు వాత పెట్టడం షురు చేసింది. అందులో భాగంగా చైనా యాప్‌లపై నిషేధం విధించింది.

మేకిన్‌ ఇండియా విధానం స్వదేశి నినాదానికి మరింత ఊపునిచ్చింది. మేడిన్‌ చైనా వస్తువుల్ని బాయ్‌కాట్‌ చేయాలంటూ కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు నిరసనలు హోరెత్తాయి. ఈ సెగ చైనా ఆర్ధిక వ్యవస్థకు పొగ పెట్టనే పెట్టింది.

దీపావళి వస్తుందంటే చైనా కంపెనీలకు పండగే.. కాకర వత్తులు.. చిచ్చు బుడ్లు. రాకెట్లు, రంగు రంగుల మతాలబులతో ఇండియన్‌ మార్కెట్‌ను ఆక్రమించేవి చైనా బానాసంచా కంపెనీలు. పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టుగా మనోళ్లు కూడా కలర్‌ఫుల్‌ చైనా టపాసులపై మోజు పడేవాళ్లు. కానీ, ఇప్పుడు కథ మారింది. ఆవాజ్‌తో పాటు మేడిన్‌ ఇండియా లోకల్‌ సరకులకు ఆదరణ పెరిగింది. చైనా సరకులపై సర్కార్‌ విధించిన నిషేధం.. కష్ట జీవులకు నిజమైన దీపావళిగా మారింది.

ఆత్మనిర్బర్‌ నినాదమే విధానంగా CAIT.. కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా ట్రేడర్స్‌ చైనా దిగుమతులపై నిషేదాన్ని ప్రకటించింది. దాంతో దేశీయ మతాబులకు మంచి రోజులు వచ్చాయి. గతేడాది దీపావళి బాణా సంచా విక్రయాల్లో చైనా ప్రొడక్ట్స్‌ తుస్సు తుస్సు మంటే.. మేడిన్‌ ఇండియా టపాసుల విక్రయాలు రాకెట్‌లా దూసుకెళ్లాయి. బాణాసంచ ఇండస్ట్రీ సహా కార్మికులకు ఆర్ధిక బలాన్నిచ్చాయి.

ఈసారి కూడా అదే ట్రెండ్‌ రిపీటవుతుంది. వినాయక చవతి, ధన్‌ తేరాజ్‌.. దసరా, ఇప్పుడు దీపావళి పండుగల్లో మేడిన్‌ ఇండియా బ్రాండ్‌ దూసుకెళ్తోంది. స్వదేశి ఉత్పత్తుల వినియోగం పెంచడానికి CAIT తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలను ఇస్తోంది. ఈ ఏడాది ఇండియన్‌ మార్కెట్‌లో చైనా టపాసులకు చోటు లేదు

CAIT ఆత్మనిర్బర్‌ నిర్ణయం చైనా ఆర్ధిక వ్యవస్థకు పొగ పెట్టింది. మేడిన్‌ చైనా టపాసుల దిగుమతిపై బ్యాన్‌ విధించింది. దీంతో చైనాకు 50వేల కోట్ల నష్టం అనేది ప్రాథమిక అంచనా. టపాసులు సహా మిగతా వస్తువలను కలిపిచూస్తే చైనాకు ఎటూ లేదన్న లక్ష కోట్ల బిగ్‌ లాస్‌. అదీ ఆత్మనిర్భర్‌ భారత్‌ స్ట్రోక్‌. దీపావళికి నరకాసుర వధ.. కానీ, అంతకన్నా ముందే బాణాసంచా మార్కెట్‌లో చైనాసర వధ జరిగిందన్న మాట.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..