Diwali Akshardham: అక్షరధామ్ ఆలయంలో మొదలైన దీపావళి వేడుకలు.. అంగరంగ వైభవంగా..
దేశరాజధాని న్యూఢిల్లీలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణాన్ని విద్యుదీపాలతో పాటు, రంగురంగుల రంగోళీలతో అలంకరించారు. ప్రపంచంలోని అతి పెద్ద దేవాలయాల్లో ఒకటైన స్వామి నారాయణ్ అక్షర ధామ్, పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు. ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి వచచారు. ఈ ఆలయంలో జరిగే గోవత్స ద్వాదశి, ధన్ త్రయోదశి, హనుమాన్ చుదర్దశి, దీపావళి, గోవర్ధన్ పూజ...

దీపావళి వేడుకలకు దేశమంతా సిద్ధమవుతోంది. మరో రెండు రోజుల్లో జరగనున్న ఈ వేడుకులకు ప్రజలు సిద్ధమవుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పలు ఆలయాలు దీపావళి వేడుకకు ముస్తాబు అవుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం స్వామినారాయణ్ అక్షర్‌ధామ్ ఆలయంలో దీపావళి వేడుకలు ప్రారంభమ్యాయి.
దేశరాజధాని న్యూఢిల్లీలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణాన్ని విద్యుదీపాలతో పాటు, రంగురంగుల రంగోళీలతో అలంకరించారు. ప్రపంచంలోని అతి పెద్ద దేవాలయాల్లో ఒకటైన స్వామి నారాయణ్ అక్షర ధామ్, పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు. ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి వచచారు. ఈ ఆలయంలో జరిగే గోవత్స ద్వాదశి, ధన్ త్రయోదశి, హనుమాన్ చుదర్దశి, దీపావళి, గోవర్ధన్ పూజ, అన్నకూట్, భాయ్ దూజ్ పండుగలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ వేడుకలను వీక్షించేందుకు పెద్ద ఎత్తున జనాలు ఆలయానికి వస్తుంటారు.
స్వామినారాయణ్ అక్షరధామ్ నిర్వహిస్తున్న అన్నకూట్ ఉత్సవ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు గాంచింది. ఈ ఏడాది అక్షరధామ్ ఆలయంలో మొత్తం 1221 శాకాహార వంటకాలను దేవుడికి సమర్పించారు. అలాగే ఆలయంలో.. లక్ష్మీ పూజ, శరద్ పూజ, గణేష్ పూజ, హనుమాన్ పూజతో పాటు ఇతర సంప్రదాయ ఆచారాలు కూడా హిందూ సంప్రదాయ పద్ధతులకు అనుగుణంగా నిర్వహిస్తారు. స్వామినారాయణ్ ట్రస్ట్‌కు చెందిన దివ్యాంగ్ ధమేలియా అనే వాలంటరీ మాట్లాడుతూ.. ‘అక్షరధామ్ ఆలయాన్ని నిర్మించడం ద్వారా, ప్రముఖ స్వామి మహారాజ్ ప్రాచీన భారతీయ సంస్కృతి, మతం ఆవష్యకతను కాపారు. ఇందులో భాగంగానే ఇక్కడ ప్రతీ పండుగను వైభవంగా, ఒక ఉత్సవంగా జరుపుకుంటాము’ అని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే స్వామి నారాయణ్ ట్రస్ట్ ఇటీవల అమెరికాలోని రాబిన్స్ విల్లేలో ఆధునిక ప్రపంచంలోనే అతిపెద్ద సమగ్ర హిందూ దేవాలయాన్ని నిర్మించారు. ఇక్కడ కూడా దీపావళి వేడులు ఘనంగా నిర్వహించనున్నారు. అలాగే వచ్చే ఏడాదిలో అబుదాబిలో కూడా ఆలయాన్ని నిర్మించనున్నారు. ఇక కేవలం ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయంలో మాత్రమే కాకుండా, సంస్థ ప్రస్తుతం ఆధ్యాత్మిక నాయకుడు మహంత్ స్వామీజీ మహారాజ్ మార్గదర్శకత్వంలో దీపావళి, అన్నకూట్ పండుగలు ప్రపంచంలోని 1400 దేవాలయాల్లో వైభవంగా జరుపుతున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..