అన్నంత పని చేసిన యోగీ.. హింసకు కారణమైన వారి..

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే పలుచోట్ల ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, యూపీ, ఢిల్లీలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు.. బస్సులు, ప్రైవేట్ వాహనాలు, ప్రభుత్వ ఆస్తులకు నిప్పుపెట్టారు. ఈ ఆందోళనకారులకు యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏవరైతే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసంచేస్తారో.. వారి ఆస్తులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. అయితే చెప్పినట్లుగానే సీఎం యోగీ ఆందోళనకారుల ఆస్తులను […]

అన్నంత పని చేసిన యోగీ.. హింసకు కారణమైన వారి..
Follow us

| Edited By:

Updated on: Dec 23, 2019 | 4:25 AM

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే పలుచోట్ల ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, యూపీ, ఢిల్లీలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు.. బస్సులు, ప్రైవేట్ వాహనాలు, ప్రభుత్వ ఆస్తులకు నిప్పుపెట్టారు. ఈ ఆందోళనకారులకు యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏవరైతే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసంచేస్తారో.. వారి ఆస్తులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. అయితే చెప్పినట్లుగానే సీఎం యోగీ ఆందోళనకారుల ఆస్తులను సీజ్ చేయడం ప్రారంభించారు. ఇప్పటి వరకు ముజఫర్‌నగర్‌లో 67 షాపులను సీజ్‌ చేశారు. త్వరలో ఈ జప్తు చేసిన దుకాణాలను వేలం వేసి.. వాటితో వచ్చిన ఆదాయంతో.. జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తామని అధికారులు తెలిపారు.

ఇదిలా ఉంటే.. శుక్రవారం రోజు కూడా 12 జిల్లాల్లో చట్టానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఇందులో ముజఫర్‌నగర్‌, లక్నో, సంభాల్‌ ప్రాంతాల్లో జరిగిన ఆందోళనలు.. హింసాత్మకంగా మారాయి. దాదపు 10 బైకులు, పలు కార్లకు నిప్పుపెట్టారు. 12మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. ఈ నేఫథ్యంలో హింసకు కారణమైన వారిని.. సీసీ కెమెరాలు, డ్రోన్‌ కెమెరాలలో రికార్డు చేసిన విజువల్స్ చూస్తూ.. వారిని ఆందోళనకారులను గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటికే సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. హింసకు కారణమైన పలువురిని గుర్తించారు. వారందరికీ ఆస్తులను సీజ్‌ చేస్తున్నట్లు నోటీసులు జారీ చేశారు. ఇక లక్నోలో కూడా ఘటనకు సంబంధించిన బాధ్యులను గుర్తించే ప్రక్రియ జరుగుతోందని స్థానిక పోలీస్‌ అధికారి వెల్లడించారు.

Latest Articles