ఆ ఇద్దరూ మీ ఫ్యూచర్ కి డేంజర్.. యువతకు రాహుల్ గాంధీ హెచ్ఛరిక

ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇద్దరూ ఈ దేశాన్ని రెండుగా చీలుస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నిరుద్యోగం, దేశ ఆర్ధిక పరిస్థితిపై ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోలేక వారు ఇలా విభజిస్తున్నారని ఆయన ట్వీట్ చేశారు. ‘ డియర్ యూత్ ఆఫ్ ఇండియా ‘ అంటూ ఆయన.. ఈ ఇద్దరివల్ల ఈ దేశ యువత భవిష్యత్తు నాశనమవుతుందని అన్నారు.’ మీకు ఉద్యోగావకాశాలు తగ్గిపోయాయి.. పైగా ఈ దేశ ఎకానమీ క్రమేపీ క్షీణీస్తోంది. దీంతో […]

ఆ ఇద్దరూ మీ ఫ్యూచర్ కి డేంజర్.. యువతకు రాహుల్ గాంధీ హెచ్ఛరిక

ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇద్దరూ ఈ దేశాన్ని రెండుగా చీలుస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నిరుద్యోగం, దేశ ఆర్ధిక పరిస్థితిపై ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోలేక వారు ఇలా విభజిస్తున్నారని ఆయన ట్వీట్ చేశారు. ‘ డియర్ యూత్ ఆఫ్ ఇండియా ‘ అంటూ ఆయన.. ఈ ఇద్దరివల్ల ఈ దేశ యువత భవిష్యత్తు నాశనమవుతుందని అన్నారు.’ మీకు ఉద్యోగావకాశాలు తగ్గిపోయాయి.. పైగా ఈ దేశ ఎకానమీ క్రమేపీ క్షీణీస్తోంది. దీంతో మీ ఆగ్రహాన్ని ఎదుర్కొనలేక మోదీ, అమిత్ షా ద్వేషం వెనుక దాక్కుంటున్నారు ‘ అని రాహుల్ ఆరోపించారు. అయితే ప్రతి భారతీయుడి పట్ల ప్రేమను చూపడం ద్వారా ఈ ఇద్దరినీ ఎదుర్కొందామన్నారు. దేశంలో పౌరసత్వ చట్టంపై వెల్లువెత్తిన నిరసనల నేపథ్యంలో రాహుల్ ఈ ట్వీట్ చేశారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నా నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న రాహుల్.. సోమవారం ఉదయమే ఢిల్లీ చేరుకోవచ్ఛు .